విజయవాడ: బెజవాడ కల్తీ మద్యం కేసులో మరో అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రమణను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఈ కేసులో తూర్పు ఎక్సైజ్ సీఐను సస్పెండ్ చేయగా.. తాజాగా మరో అధికారి వేటుతో అధికారులలో టెన్షన్ మొదలైంది. ఏ క్షణాన ఏ అధికారి సస్పెండ్ అవుతారోనన్న ఆందోళనలో జిల్లా ఎక్సైజ్ అధికారులు ఉన్నారు. సస్పెండైన రమణ బుధవారం నుంచి సెలవులోకి వెళ్లారు.
ఈ ఘటనపై ఎక్సైజ్ కమిషనర్ మీనా ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించారు. ఈ నివేదికలో అధికారులు అక్రమాలను అరికట్టడంలో విఫలమయ్యారని పేర్కొనట్లు తెలుస్తుంది. దీంతో మరికొందరి అధికారులపై చర్యలు తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. దీంతో కొందరు అధికారులు సెలవులో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం
మరో అధికారిపై సస్పెన్షన్ వేటు
Published Thu, Dec 10 2015 11:05 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement
Advertisement