Adulterated alcohol case
-
మరో అధికారిపై సస్పెన్షన్ వేటు
విజయవాడ: బెజవాడ కల్తీ మద్యం కేసులో మరో అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రమణను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఈ కేసులో తూర్పు ఎక్సైజ్ సీఐను సస్పెండ్ చేయగా.. తాజాగా మరో అధికారి వేటుతో అధికారులలో టెన్షన్ మొదలైంది. ఏ క్షణాన ఏ అధికారి సస్పెండ్ అవుతారోనన్న ఆందోళనలో జిల్లా ఎక్సైజ్ అధికారులు ఉన్నారు. సస్పెండైన రమణ బుధవారం నుంచి సెలవులోకి వెళ్లారు. ఈ ఘటనపై ఎక్సైజ్ కమిషనర్ మీనా ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించారు. ఈ నివేదికలో అధికారులు అక్రమాలను అరికట్టడంలో విఫలమయ్యారని పేర్కొనట్లు తెలుస్తుంది. దీంతో మరికొందరి అధికారులపై చర్యలు తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. దీంతో కొందరు అధికారులు సెలవులో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం -
కల్తీ మద్యంపై సిట్ ఏర్పాటు
-
కల్తీ మద్యం ఘటనపై మెజిస్టీరియల్ విచారణ
విజయవాడ: బెజవాడ కల్తీ మద్యం ఘటనపై విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. దీనిపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. సబ్‌కలెక్టర్ సృజనను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఎక్సైజ్ అధికారులు దూకుడును పెంచారు. ఘటనపై పలు సెక్షన్ల కింది పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 304 ఏ, 328, ఎకై్సజ్‌యాక్ట్ సెక్షన్ డీ(1),(2) కింద భాగవతుల శరత్ చంద్ర, కావూరి పూర్ణచంద్రశర్మ, కె.లక్ష్మీ సరస్వతీ, మల్లాది బాల త్రిపుర సుందరీలపై కేసు నమోదు చేశారు. కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందగా, మరో 29మంది తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వారిలో మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. -
కల్తీ మద్యం ఘటనపై మెజిస్టీరియల్ విచారణ
-
కర్నూలు జెడ్పీ చైర్మన్‌ను అరెస్టు చేయాలి: వైసీపీ ఎమ్మెల్యేలు
ఎక్సైజ్ కమిషనర్‌ను డిమాండ్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు సాక్షి, హైదరాబాద్: కల్తీ మద్యం కేసులో ముద్దాయిగా ఉన్న కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ గౌడ్‌ను తక్షణం అరెస్టు చేయాలని ఆ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(వైసీపీ) ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, మరో నేత గౌరు వెంకటరెడ్డి గురువారం హైదరాబాద్‌లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ షంషేర్‌సింగ్ రావత్‌ను కలసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. ఎక్సైజ్ అధికారులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో రాజశేఖర్‌ను ఐదో ముద్దాయిగా పేర్కొన్నప్పటికీ అరెస్టు చేయలేదని వివరించారు. స్థానిక ఎక్సైజ్ అధికారులపై టీడీపీ నేతల ఒత్తిడి తీవ్రంగా ఉన్న ఫలితంగా దర్యాప్తు ముందుకు సాగడం లేదని చెప్పారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని జెడ్పీ చైర్మన్ అరెస్టుకు ఆదేశాలివ్వాలని, ఇందులో ప్రమేయమున్న డోన్ ఎంపీపీ కుమారుడిని కూడా అరెస్టు చేయాలని కోరారు. నేతల నుంచి వినతిపత్రం తీసుకున్న కమిషనర్ రావత్.. పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. నీతివంతమైన పాలన ఇదేనా? ‘సీఎం చంద్రబాబు నిత్యం వల్లించే నీతివంతమైన పాలన అంటే కల్తీ మద్యం కేసులో నిందితుడైన కర్నూలు జెడ్పీ చైర్మన్‌ను అరెస్టు చేయక పోవడమేనా? ఆయనను కేసులో నుంచి తప్పించాలని కుట్ర పన్నడమేనా?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సూటిగా ప్రశ్నించారు. ఎక్సైజ్ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పొద్దున లేచినప్పటి నుంచి నీతివంతమైన పాలన గురించి సూక్తులు వల్లిస్తే చాలదని ప్రజ ల ఆరోగ్యానికి హాని కలిగించే కల్తీ మద్యం వ్యాపారానికి పాల్పడుతున్న జెడ్పీ చైర్మన్‌ను అరెస్టు చేయాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. బుడ్డా రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 2న డోన్‌లో సాక్షాత్తూ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సొంత గ్రామాలుండే ప్రాంతంలో రూ. 12 లక్షల విలువైన కల్తీ మద్యం నిల్వలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. దీనిలో జెడ్పీ చైర్మన్ , ఆయన పీఏ, ఇతర అనుచరులు, డోన్ ఎంపీపీ కుమారుడి ప్రమేయమున్నట్టు పట్టుబడిన వ్యక్తులు వాంగ్మూలం ఇచ్చారని అయినా చైర్మన్ పీఏను మాత్రమే అరెస్టు చేసి మిగతా వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్‌కు కూడా దీనిపై వినతిపత్రం ఇచ్చామన్నారు.