కల్తీ మద్యం ఘటనపై మెజిస్టీరియల్ విచారణ | magisterial enquiry on bezwada Adulterated alcohol case | Sakshi
Sakshi News home page

కల్తీ మద్యం ఘటనపై మెజిస్టీరియల్ విచారణ

Published Tue, Dec 8 2015 9:39 AM | Last Updated on Sun, Sep 3 2017 1:42 PM

magisterial enquiry on bezwada Adulterated alcohol case

విజయవాడ: బెజవాడ కల్తీ మద్యం ఘటనపై విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. దీనిపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. సబ్కలెక్టర్ సృజనను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఎక్సైజ్ అధికారులు దూకుడును పెంచారు. ఘటనపై పలు సెక్షన్ల కింది పోలీసులు కేసు నమోదు చేశారు.

 

ఐపీసీ 304 ఏ, 328, ఎకై్సజ్‌యాక్ట్ సెక్షన్ డీ(1),(2) కింద భాగవతుల శరత్ చంద్ర, కావూరి పూర్ణచంద్రశర్మ, కె.లక్ష్మీ సరస్వతీ, మల్లాది బాల త్రిపుర సుందరీలపై కేసు నమోదు చేశారు. కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందగా, మరో 29మంది తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వారిలో మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement