బండా: ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతిపై తలెత్తుతున్న అనుమానాలకు ఎట్టకేలకు తెరపడింది. అన్సారీ మృతిపై మెజిస్టీరియల్ విచారణ ముగిసింది. జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఈ విచారణ నివేదికను సమర్పించారు. ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందినట్లు మెజిస్టీరియల్ విచారణలో వెల్లడయ్యింది.
ముఖ్తార్ అన్సారీ మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్న నేపధ్యంలో వీటికి చెక్ పెట్టేందుకు జిల్లా మేజిస్ట్రేట్ అధ్యక్షతన విచారణ చేపట్టారు. దర్యాప్తు నివేదిక వచ్చిన దరిమిలా ముఖ్తార్ అన్సారీ కుటుంబ సభ్యులకు దీనికి సంబంధించిన వివరాలు పంపారు. అయితే దీనిపై వారి వైపు నుండి ఎటువంటి స్పందన రాలేదు. ముఖ్తార్ కుటుంబానికి పంపిన నోటీసులో ఆయన మృతిపై ఉన్న అభ్యంతరాలు లేదా సాక్ష్యాలను సమర్పించడానికి కొంత గడువు ఇచ్చారు. అయితే కుటుంబ సభ్యులెవరూ ఇంతవరకూ స్పందించలేదు. విచారణ నివేదికను 10 రోజుల క్రితమే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించారు.
గతంలో జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ ఆరోగ్యం మార్చి 28న క్షీణించింది. దీంతో జైలు నిర్వాహకులు అతన్ని బండా మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతిచెందాడు. నాడు ఆసుపత్రి విడుదల చేసిన వైద్య నివేదికలో అతని మరణానికి కారణం గుండెపోటు అని పేర్కొంది. అయితే ముఖ్తార్ కుటుంబ సభ్యులు, ప్రతిపక్షాలు ముక్తార్‌కు స్లో పాయిజన్ ఇచ్చారని ఆరోపించారు. ఈ నేపధ్యంలో బండా జిల్లా మేజిస్ట్రేట్ ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Uttar Pradesh: మెట్రో స్టేషన్ వద్ద కాల్పులు.. యువకుని మృతి
Comments
Please login to add a commentAdd a comment