Mukhtar Ansari
-
‘అన్సారీకి విషమివ్వలేదు.. గుండెపోటుతోనే మృతి’
బండా: ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతిపై తలెత్తుతున్న అనుమానాలకు ఎట్టకేలకు తెరపడింది. అన్సారీ మృతిపై మెజిస్టీరియల్ విచారణ ముగిసింది. జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఈ విచారణ నివేదికను సమర్పించారు. ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందినట్లు మెజిస్టీరియల్ విచారణలో వెల్లడయ్యింది.ముఖ్తార్ అన్సారీ మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్న నేపధ్యంలో వీటికి చెక్ పెట్టేందుకు జిల్లా మేజిస్ట్రేట్ అధ్యక్షతన విచారణ చేపట్టారు. దర్యాప్తు నివేదిక వచ్చిన దరిమిలా ముఖ్తార్ అన్సారీ కుటుంబ సభ్యులకు దీనికి సంబంధించిన వివరాలు పంపారు. అయితే దీనిపై వారి వైపు నుండి ఎటువంటి స్పందన రాలేదు. ముఖ్తార్ కుటుంబానికి పంపిన నోటీసులో ఆయన మృతిపై ఉన్న అభ్యంతరాలు లేదా సాక్ష్యాలను సమర్పించడానికి కొంత గడువు ఇచ్చారు. అయితే కుటుంబ సభ్యులెవరూ ఇంతవరకూ స్పందించలేదు. విచారణ నివేదికను 10 రోజుల క్రితమే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించారు.గతంలో జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ ఆరోగ్యం మార్చి 28న క్షీణించింది. దీంతో జైలు నిర్వాహకులు అతన్ని బండా మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతిచెందాడు. నాడు ఆసుపత్రి విడుదల చేసిన వైద్య నివేదికలో అతని మరణానికి కారణం గుండెపోటు అని పేర్కొంది. అయితే ముఖ్తార్ కుటుంబ సభ్యులు, ప్రతిపక్షాలు ముక్తార్‌కు స్లో పాయిజన్ ఇచ్చారని ఆరోపించారు. ఈ నేపధ్యంలో బండా జిల్లా మేజిస్ట్రేట్ ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు.ఇది కూడా చదవండి: Uttar Pradesh: మెట్రో స్టేషన్ వద్ద కాల్పులు.. యువకుని మృతి -
అన్సారీ అంత్యక్రియలు పూర్తి
లక్నో: గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలు శనివారం యూపీలోని గాజీపూర్‌లో ముగిశాయి. వేలాది మంది అన్సారీకి మద్దతుగా నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. పట్టణంలో 144 సెక్షన్ అమలు చేశారు. కొందరు శ్మశాన వాటికలోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించగా అడ్డుకున్నారు. అన్సారీ సోదరుడు, ఎంపీ అఫ్జల్ అన్సారీ, ఘాజీపూర్ జిల్లా మేజిస్ట్రేట్ ఆర్యక అఖౌరీ మధ్య ఈ సందర్భంగా కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. -
ముఖ్తార్ అన్సారీ మృతిపై విచారణ జరిపించాలి: మాయావతి
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత 'ముఖ్తార్ అన్సారీ' గుండెపోటుతో గురువారం (మార్చి 28) సాయంత్రం మృతి చెందారు. గుండెపోటుతో ఆయన తుది శ్వాస విచినట్లు అధికారులు చెబుతుంటే.. తన తండ్రికి స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారంటూ ముఖ్తార్ కుమారుడు 'ఉమర్' ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై కోర్టును సంప్రదిస్తానని చెప్పారు. ఈ విషయం మీద బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి స్పందించారు. ముఖ్తార్ అన్సారీ మృతిపైన విచారణ జరిపించాలని మాయావతి డిమాండ్ చేశారు. ఈ కేసులో నిజానిజాలు ప్రజల ముందుకు రావాల్సి ఉందన్నారు. అన్సారీ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని భీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ కూడా డిమాండ్ చేశారు. मुख़्तार अंसारी की जेल में हुई मौत को लेकर उनके परिवार द्वारा जो लगातार आशंकायें व गंभीर आरोप लगाए गए हैं उनकी उच्च-स्तरीय जाँच जरूरी, ताकि उनकी मौत के सही तथ्य सामने आ सकें। ऐसे में उनके परिवार का दुःखी होना स्वाभाविक। कुदरत उन्हें इस दुःख को सहन करने की शक्ति दे। — Mayawati (@Mayawati) March 29, 2024 మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ అకాల మరణం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ.. ఎక్స్ (ట్విటర్) వేదికగా చంద్రశేఖర్ ఆజాద్ ట్వీట్ చేశారు. అన్సారీ మౌ సదర్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అతను 2005 నుంచి ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లో జైలులో ఉన్నాడు. అతనిపై 60కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సెప్టెంబరు 2022 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని వివిధ న్యాయస్థానాలు అతనికి ఎనిమిది కేసుల్లో శిక్ష విధించాయి. पूर्व विधायक मुख्तार अंसारी जी का असामायिक निधन बेहद दुखद, मैं विनम्र श्रद्धांजलि अर्पित करता हूं। मेरी संवेदनाएं उनके परिजनों और समर्थकों के प्रति हैं, प्रकृति उन्हें यह असीम दुख सहने की शक्ति प्रदान करें। पूर्व में ही उन्होंने अपनी हत्या की आशंका व्यक्त की थी, मैं माननीय उच्च… — Chandra Shekhar Aazad (@BhimArmyChief) March 28, 2024 -
Mukhtar Ansari: అన్సారీపై విష ప్రయోగం?
లక్నో: బాందా జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్, ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ (63) గురువారం కన్నుమూశారు. అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరిన ఆయనకు చికిత్స అందుతుండగానే.. గుండెపోటుకు గురై చనిపోయినట్లు దుర్గావతి మెడికల్ కాలేజీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అయితే.. కుటుంబ సభ్యులు మాత్రం అన్సారీ మృతిపై సంచలన ఆరోపణలకు దిగారు. ముఖ్తార్ అన్సారీపై విషప్రయోగం జరిగిందని.. 2005 నుంచి బాందా జైలులో ఉన్న ఆయనపై విషప్రయోగం జరగడం ఇప్పుడు రెండోసారి ఆయన సోదరుడు, ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ ఆరోపించారు. ‘జైలులో అన్సారీకి ఆహారంలో విషం కలిపి ఇచ్చారు. సుమారు 40 రోజుల పాటు ఆహారంలో విషం కలిపారు. మార్చి 19వ తేదీన ఆయన తిన్న ఆహారంలో విషం కలిసింది. అందుకే ఆయన ఆరోగ్యం ఆందోళనకంగా మారి ఆస్పత్రిలో చేరారు’ అని అఫ్జల్ అన్సారీ అంటున్నారు. తన తండ్రికి స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారంటూ ముఖ్తార్ కుమారుడు ఉమర్ ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై కోర్టును సంప్రదిస్తానని చెప్పారు. ‘ మా నాన్న(ముఖ్తార్)పై విష ప్రయోగం జరుగుతోందన్న విషయాన్ని మేము గతంలో కూడా చెప్పాం. ఇప్పుడూ కూడా అదే చెబుతున్నాం. మార్చి 19న మా నాన్న( ముఖ్తార్)కు రాత్రి భోజనంలో విషం కలిపారు. మేము ఈ విషయంలో కోర్టును సంప్రదిస్తాం. మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’ అని ఉమర్ తెలిపారు. బందా జైలులో ఉన్న ముఖ్తార్ అన్సారీ ఆరోగ్యం విషయమించటంతో ఆయన్ను మంగళవారం బాందాలోని దుర్గావతి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు ఆయనపై విష ప్రయోగం జరిగిందా? అనేదానిపై వైద్యులు స్పందించలేదు. బందా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఇవాళ ముఖ్తార్ అన్సారీ మృతదేహానికి శవపరీక్ష జరగనుంది. ఆపై ఈ ఆరోపణలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గ్యాంగ్‌స్టర్ పొలిటీషియన్ యూపీలోని మౌకు చెందిన అన్సారీపై గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్సారీ 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనపై మొత్తం 61 కేసులు నమోదయ్యాయి. అందులో 15 హత్య కేసులు ఉన్నాయి. 1980ల్లో గ్యాంగ్ సభ్యుడిగా చేరిన అన్సారీ 1990ల్లో సొంతంగా గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మౌ, ఘాజీపుర్, వారణాసి ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ దోపిడీలు, కిడ్నాపులకు పాల్పడేది. 2004లో అన్సారీ వద్ద మెషిన్ గన్ బయటపడడంతో పోలీసులు అప్పటి ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. భాజపా ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో గతేడాది ఏప్రిల్‌లో కోర్టు ఆయనకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 1990లో నకిలీ తుపాకీ లైసెన్స్ కలిగి ఉన్నారన్న అభియోగాల నేపథ్యంలో ఈ నెల 13న కోర్టు జీవితఖైదు విధించింది. ఐదుసార్లు మౌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖ్తార్ రెండు సార్లు బీఎస్పీ తరఫున ఎన్నికయ్యారు. ఆయన మృతికి ఆ పార్టీ ఎక్స్(ట్విటర్)లో సంతాపం ప్రకటించింది. అన్సారీ మృతితో యూపీ మొత్తంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. బాందా, మౌ, ఘాజీపుర్, వారణాసి జిల్లాల్లో అదనపు పోలీసు బలగాలతో పాటు, సెంట్రల్ రిజర్వ్ బలగాలను మోహరించినట్లు యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ముఖ్తార్ అన్సారీ మృతిపై దర్యాప్తు జరగాలి: మాయావతి జైలులో ముఖ్తార్ అన్సారీపై మృతిపై ఆయన కుటుంబం వ్యక్తం చేస్తున్న భయాలు, విష ప్రయోగానికి సంబంధించి ఆరోపణలపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్’ వేదిక స్పందించారు. ‘ ముఖ్తార్ మృతి దార్యప్తు జరగాలి. మృతికి సంబంధించిన వాస్తవాలు బయటకు రావాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు. मुख़्तार अंसारी की जेल में हुई मौत को लेकर उनके परिवार द्वारा जो लगातार आशंकायें व गंभीर आरोप लगाए गए हैं उनकी उच्च-स्तरीय जाँच जरूरी, ताकि उनकी मौत के सही तथ्य सामने आ सकें। ऐसे में उनके परिवार का दुःखी होना स्वाभाविक। कुदरत उन्हें इस दुःख को सहन करने की शक्ति दे। — Mayawati (@Mayawati) March 29, 2024 -
గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
లక్నో: జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్, ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ(63) గురువారం గుండెపోటుకు గురై బందా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో మృతి చెందారు. అంతకుముందు, రాత్రి 8.25 గంటల సమయంలో అన్సారీ ఆరోగ్యం విషమించడంతో అధికారులు బందా జిల్లా జైలు నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల బృందం చికిత్సలు చేస్తుండగానే ఆయన గుండెపోటుకు గురై చనిపోయినట్లు బందా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ పీటీఐకి తెలిపారు. దీంతో, ఉన్నతాధికారులు ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. రాష్ట్రవ్యాప్తంగా సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. బందా, మౌ, గాజీపూర్, వారణాసి జిల్లాల్లో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. పొట్టలో నొప్పిగా ఉందని చెప్పడంతో మంగళవారం కూడా ఆస్పత్రిలో 14 గంటలపాటు ఉంచినట్లు అధికారులు చెప్పారు. జైలులో ఆయనపై విష ప్రయోగం జరిగిందని ఇతడి సోద రుడు, ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ ఆరోపించారు. 5సార్లు ఎమ్మెల్యే.. 60కిపైగా కేసులు మౌ సదర్ స్థానం నుంచి రెండుసార్లు బీఎస్పీ తరఫున, రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా, ఒకసారి సొంతపార్టీ క్వామీ ఏక్తా దళ్ తరఫున మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వివిధ ఆరోపణలపై యూపీ, పంజాబ్ జైళ్లలో 2005 నుంచి శిక్ష అనుభవిస్తున్నారు. ఈయనపై 60కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. యూపీలోని వివిధ కోర్టులో 2022 నుంచి ఇతడిపై ఉన్న 8 కేసుల్లో తీర్పులు వెలువరించాయి. ప్రస్తుతం బందా జైలులో ఉన్నారు. -
గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి అస్వస్థత.. ఐసీయూలో చికిత్స!
ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతనికి చికిత్స అందించేందుకు జైలు నుంచి బందా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అన్సారీకి ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపధ్యంలో పోలీసులు మెడికల్ కాలేజీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కొద్ది రోజుల క్రితం ముఖ్తార్ అన్సారీ తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నాడు. ముక్తార్ అన్సారీ తనపై విషం ప్రయోగించేందుకు కుట్ర జరుగుతున్నదంటూ కోర్టుకు విన్నవించుకున్నాడు. ఈ ఉదంతంలో స్పందించిన కోర్టు అన్సారీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బందా జైలులోని జైలర్, ఇద్దరు డిప్యూటీ జైలర్లను సస్పెండ్ చేసింది. ఒక కేసులో ముఖ్తార్ అన్సారీ గత గురువారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే అదే సమయంలో అన్సారీ తనకు ప్రాణహాని ఉందంటూ న్యాయవాది ద్వారా న్యాయమూర్తికి లేఖ పంపారు. మార్చి 19న తనకు ఇచ్చిన ఆహారంలో విషపూరితమైన పదార్థాలు కలిశాయని ముఖ్తార్ అన్సారీ ఆ లేఖలో రాశాడు. ఆ ఆహారం తిన్న తర్వాత తాను అస్వస్థతకు గురయ్యానని, తనకు చేతులు, కాళ్ల నరాల్లో విపరీతమైన నొప్పి వచ్చిందని ముఖ్తార్ అన్సారీ ఆ లేఖలో పేర్కొన్నాడు. ఆరోజు తాను చనిపోతానేమోనని భయపడ్డానని లేఖలో పేర్కొన్నాడు. ఘాజీపూర్ నకిలీ ఆయుధాల లైసెన్స్ కేసులో ముఖ్తార్ అన్సారీకి కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రత్యేక న్యాయమూర్తి (ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు) అవ్నీష్ గౌతమ్ ముఖ్తార్ అన్సారీకి ఈ శిక్ష విధించారు. 2023లో జరిగిన ఒక హత్య కేసులో ముఖ్తార్ అన్సారీకి కోర్టు జీవిత ఖైదు విధించింది. ముక్తార్‌కు ఇప్పటివరకు ఏడు కేసుల్లో శిక్ష పడింది. ఎనిమిదో కేసులో దోషిగా తేలాడు. -
గ్యాంగ్‌స్టర్, మాజీ ఎమ్మెల్యే అన్సారీకి షాక్, పదేళ్ల జైలు, భారీ జరిమానా
Mukhtar Ansari: యూపీకి చెందిన గ్యాంగ్‌స్టర్ టర్న్డ్ పొలిటీషియన్,మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ మరోసారి భారీ షాక్ తగిలింది. ముఖ్తార్ అన్సారీ హత్య, హత్యాయత్నం కేసుల్లో దోషిగా తేల్చిన ఘాజీపూర్ కోర్టు శుక్రవారం పదేళ్ల జైలుశిక్ష, భారీ జరిమానా విధించింది. 2009 గ్యాంగ్స్టర్స్ యాక్ట్ కేసులో అన్సారీని గురువారం ఘాజీపూర్ జిల్లా ప్రత్యేక న్యాయమూర్తి (ఎంపీ-ఎమ్మెల్యే) అరవింద్ మిశ్రా అన్సారీని దోషిగా ప్రకటించారు. బందా జైలులో ఉన్న ముఖ్తార్ అన్సారీ విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన కోర్టు శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. అన్సారీ అనుచరుడు, సోనూ యాదవ్‌ను కూడా దోషి తేల్చింది. సోనుకు 5 సంవత్సరాల జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల జరిమానా విధించింది. అయితే దీనిపై హైకోర్టులో అప్పీలు చేస్తామనీ, తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని ముఖ్తార్ అన్సారీ తరఫు న్యాయవాది లియాఖత్ తెలిపారు. 2009లో కపిల్ దేవ్ సింగ్ హత్యకు కుట్ర పన్నిన ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు మీర్ హసన్ అనే వ్యక్తిపై దాడికి సంబంధించిన మరో కేసు కూడా ఉంది. ఘాజీపూర్‌లోని కరంద పోలీస్ స్టేషన్లో ముఖ్తార్‌పై గ్యాంగ్‌స్టర్ కేసు నమోదైంది. అయితే 2011, 2023లో ఈ రెండు కేసుల్లో అన్సారీని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అన్సారీకి 1996లో విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి) నాయకుడు నందకిషోర్ రుంగ్తా, 2005లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్‌ను హత్య చేసిన కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ముఖ్తార్ అన్సారీ మౌ సదర్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. #WATCH | Ghazipur additional district government counsel (criminal) Neeraj Srivastava says, "A case was registered against Mukhtar Ansari and his aide Sonu Yadav in 2010. In connection with that case, both the accused were pronounced guilty yesterday and today arguments on the… https://t.co/hVsOHFXn9a pic.twitter.com/fK2QZq71Ii — ANI UP/Uttarakhand (@ANINewsUP) October 27, 2023 -
గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు
లక్నో: ముప్పై ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ నేత సోదరుడి హత్య కేసులో గ్యాంగ్‌స్టర్– రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీకి వారణాసి కోర్టు జీవిత ఖైదు విధించింది. 1991 ఆగస్ట్ 3వ తేదీన కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ సోదరుడు అవధేశ్ రాయ్ వారణాసిలోని ఆయన ఇంటిగేటు వద్దే హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి అన్సారీతోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అవధేశ్ రాయ్ హత్య కేసును విచారించిన ఎంపీ–ఎమ్మెల్యే కోర్టు ప్రత్యేక జడ్జి అవనీశ్ గౌతమ్ అన్సారీకి జీవిత ఖైదుతోపాటు రూ.1.20 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు లాయర్ ఒకరు చెప్పారు. బందా జైలులో ఉన్న అన్సారీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు హాజరయ్యారు. వేర్వేరు రాష్ట్రాల్లో 61కి పైగా క్రిమినల్ కేసులను అన్సారీ ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకు ఆరు కేసుల్లో దోషిగా తేలింది. ఒక కేసుకు సంబంధించి ఏప్రిల్‌లో ఘాజీపూర్ కోర్టు అన్సారీకి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. యూపీలోని మౌసదర్ స్థానం నుంచి అయిదు పర్యాయాలు అన్సారీ ఎమ్మెల్యే అయ్యాడు. 2022 ఎన్నికల్లో ఆయన కొడుకు అబ్బాస్ అన్సారీ సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. -
ముఖ్యమంత్రి మమ్మల్ని మోసం చేశారు
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దాదాపు ముగింపు దశకు కూడా వస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మీద ఆరోపణలు వస్తున్నాయి. తమ సాయం కోరి కూడా ముఖ్యమంత్రి తమను మోసం చేశారని క్వామీ ఏక్తా దళ్ నాయకుడు, మాజీ మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ కుమారుడు అబ్బాస్ బిన్ ముఖ్తార్ అన్సారీ ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీ మీద, ఎన్నికల గుర్తు మీద పట్పటు కోసం ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లేటప్పుడు ముఖ్యమంత్రి తన తండ్రి మద్దతు అడిగారని, పార్టీ నాయకులను తీసుకురావాల్సిందిగా కోరారని అబ్బాస్ చెప్పారు. ఇప్పుడు ఎందుకు మోసం చేశారో తెలియదు గానీ.. అప్పట్లో తన ఎదురుగానే తన తండ్రితో సీఎం మాట్లాడారని, తన తండ్రిని అసెంబ్లీలో కలిసి, రాజకీయంగా మద్దతు ఇస్తామని చెప్పారని, కావాలంటే ఎన్నికల కమిషన్‌కు ఎవరైనా ఆర్టీఐ దరఖాస్తు చేస్తే తన తండ్రి, ఇతరులు పార్టీ కోసం పోరాడిన విషయం తెలుస్తుందని అబ్బాస్ అన్నారు. ముఖ్తార్ అన్సారీకి చెందిన క్వామీ ఏక్తా దళ్ (క్యూఈడీ)ని గత సంవత్సరం సమాజ్‌వాదీ పార్టీలో విలీనం చేయడంపై తీవ్ర వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అప్పట్లో పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ దీన్ని ఆహ్వానించగా.. ఆయన కుమారుడు అఖిలేష్ మాత్రం గట్టిగా వ్యతిరేకించారు. అన్సారీకి రాష్ట్రంలోని తూర్పు ప్రాంతాల్లో ఉండే చేనేత వర్గంలో గట్టి పట్టుంది. దాదాపు 12 వరకు అసెంబ్లీ సీట్లలో ఆయన ప్రభావం చూపగలరు. తన తండ్రిని టార్గెట్‌గా చేసుకున్నారు గానీ గాయత్రి ప్రజాపతి, రాజా భయ్యా, పండిట్ సింగ్ లాంటి వాళ్లు మాత్రం సమాజ్‌వాదీలోనే ఉంటున్నారని అబ్బాస్ మండిపడ్డారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఆశించిన మద్దతు రాకపోవడంతో ఒకప్పుడు మాఫియా డాన్‌గా ఉండి తర్వాత రాజకీయ నాయకుడైన ముఖ్తార్ అన్సారీ తన కొడుకు, సోదరుడితో కలిసి బీఎస్పీలో చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ముఖ్తార్ అన్సారీ యూపీలోని మావు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కుమారుడు అబ్బాస్ ఘోసి నుంచి ముఖ్తార్ సోదరుడు సిబగతుల్లా మహ్మదాబాద్ నుంచి బరిలో ఉన్నారు. అఖిలేష్ మైనారిటీలకు వ్యతిరేకమని ములాయం ఎప్పుడో చెప్పారని, ఇలాగే ఉంటే సమాజ్‌వాదీ పాలనలో ముస్లింల భవిష్యత్తుపై తమకు అనుమానాలున్నాయని అబ్బాస్ అన్నారు. -
గ్యాంగ్‌స్టర్ కు మాయావతి రెడ్ కార్పెట్!
లక్నో: సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)లో తనకు టికెట్ ఇవ్వలేదని సీఎం అఖిలేశ్ యాదవ్‌కు షాక్ ఇస్తూ ముఖ్తార్ అన్సారీ బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)లో చేరారు. ముఖ్తార్ అన్సారీతో పాటు ఆయన సోదరుడు సిబఖతుల్లా అన్సారీ, అఫ్జల్, అన్సారీ తనయుడు అబ్బాస్ అన్సారీలు బీఎస్పీలో చేరినట్లు పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. బీఎస్పీ చీఫ్ మాయావతి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్తార్ అన్సారీపై క్రిమినల్ కేసులున్నాయి.. కానీ ఏ కేసులోనూ ఆయన దోషిగా నిరూపితం కాలేదన్నారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసిన ముఖ్తార్‌పై తమకు మాకు పూర్తి నమ్మకం ఉందని, మౌ సదర్ నుంచి టికెట్ కేటాయించినట్లు తెలిపారు. ముఖ్తార్ సోదరుడు సిబఖతుల్లాకు మహమ్మదాబాద్ నుంచి, ఆయన కుమారుడు అబ్బాస్ అన్సారీలను గోసి నుంచి బరిలోకి దించుతున్నామని చెప్పారు. ఖ్తార్ అన్సారీపై అనవసరంగా రాద్ధాంతం చేయవద్దని, మా పార్టీలో క్రిమినల్స్ ఎవరు లేరు.. ఒకవేళ పార్టీలో అలాంటి వారు ఉన్నట్లయితే మారేందుకు చివరి అవకాశం ఇస్తున్నట్లు మాయావతి హెచ్చరించారు. జైలు పాలైన రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీకి అఖిలేశ్ ఇటీవల టికెట్ నిరాకరించారు. దీంతో బీఎస్పీలో టికెట్లు కన్ఫామ్ కావడంతో పార్టీ మారి తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. -
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఝలక్!
తండ్రి టికెట్ నిరాకరించిన వారికి పెద్దపీట మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన అఖిలేశ్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఖరారైన నేపథ్యంలో అధికార సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ 77 మంది అభ్యర్థులతో మరో జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడం గమనార్హం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న రాయ్‌బరేలీలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, అమేథిలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆయన టికెట్లు ఖరారు చేశారు. పొత్తులో భాగంగా ఎస్పీ 298 స్థానాల్లో పోటీచేయనుండగా.. ఇప్పటివరకు 287 స్థానాలకు అఖిలేశ్ అభ్యర్థులను ఖరారు చేశారు. పొత్తులో భాగంగా తమ ప్రాబల్య జిల్లాలైన రాయ్ బరేలీ, అమేథిలో అత్యధిక సీట్లు తమకే కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా పట్టుపడుతోంది. అయినా అమేథి జిల్లాలోని అమేథి నియోజకవర్గం నుంచి గాయత్రి ప్రసాద్ ప్రజాపతి, గరురిగంజ్ నుంచి రాకేష్ ప్రతాప్ సింగ్లతోపాటు రాయ్‌బరేలీలోని పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆశా కిషోర్, దేవేంద్రప్రతాప్ సింగ్, మనోజ్‌కుమార్ పాండే తదితరులకు అఖిలేశ్ టికెట్లు ఖరారు చేశారు. ఇక జైలు పాలైన రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీకి అఖిలేశ్ టికెట్ నిరాకరించారు. బాబాయ్ శివ్‌పాల్ ప్రోద్బలంతో అన్సారీ తన ఖ్వామీ ఎక్తా దళ్ పార్టీని గత ఏడాది ఎస్పీలో విలీనం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆయన స్థానంలో మరో ముస్లిం అభ్యర్థి అల్తాఫ్ అన్సారీకి అవకాశమిచ్చారు. అదేవిధంగా తండ్రి ములాయం గతంలో టికెట్ నిరాకరించిన అరుణ్‌కుమార్ వర్మకు కూడా అఖిలేశ్ టికెట్ ఇచ్చారు. గత ఏడాది ఎస్పీలో చేరిన అలహాబాద్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ ప్రెసిడెంట్ రిచా సింగ్‌ను కూడా ఆయన బరిలోకి దింపారు. -
వారణాసిలో మోడీపై పోటికి మాఫియా డాన్!
కొద్ది రోజుల క్రితం వరకు వారణాసి ఓ పుణ్యక్షేత్రంగానే తెలిసి ఉండేది. కాని ఎన్నికల పుణ్యమా అని ప్రస్తుతం వారణాసి రాజకీయ రణక్షేత్రంగా మారనుంది. అందుకు కారణం బీజేపీ అభ్యర్థి వారణాసి ఎన్నికల బరిలో దిగడమే. ఇప్పటికే వారణాసి ఎన్నికల బరిలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ ఉండగా, మోడీని ఓడించేందుకు మరో నేత రంగంలోకి దిగనున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన మాఫియా డాన్ ముఖ్తర్ అన్సారీ వారణాసి ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నారు. ఓ హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న ఆయన క్వామీ ఏక్తా దళ్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటి చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2 లక్షల 50 వేల ముస్లీం ఓట్లు ఉన్న వారణాసి లోకసభ నియోజకవర్గంలో 2009లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషికి ముచ్చెమటలు పట్టించారు. గత ఎన్నికల్లో 20 వేల ఓట్ల తేడాతో ముఖ్తర్ ఓటమి పాలైనారు. ప్రస్తుతం మావ్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు.