గ్యాంగ్‌స్టర్ కు మాయావతి రెడ్ కార్పెట్!
లక్నో: సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)లో తనకు టికెట్ ఇవ్వలేదని సీఎం అఖిలేశ్ యాదవ్‌కు షాక్ ఇస్తూ ముఖ్తార్ అన్సారీ బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)లో చేరారు. ముఖ్తార్ అన్సారీతో పాటు ఆయన సోదరుడు సిబఖతుల్లా అన్సారీ, అఫ్జల్, అన్సారీ తనయుడు అబ్బాస్ అన్సారీలు బీఎస్పీలో చేరినట్లు పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. బీఎస్పీ చీఫ్ మాయావతి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్తార్ అన్సారీపై క్రిమినల్ కేసులున్నాయి.. కానీ ఏ కేసులోనూ ఆయన దోషిగా నిరూపితం కాలేదన్నారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసిన ముఖ్తార్‌పై తమకు మాకు పూర్తి నమ్మకం ఉందని, మౌ సదర్ నుంచి టికెట్ కేటాయించినట్లు తెలిపారు.
ముఖ్తార్ సోదరుడు సిబఖతుల్లాకు మహమ్మదాబాద్ నుంచి, ఆయన కుమారుడు అబ్బాస్ అన్సారీలను గోసి నుంచి బరిలోకి దించుతున్నామని చెప్పారు. ఖ్తార్ అన్సారీపై అనవసరంగా రాద్ధాంతం చేయవద్దని, మా పార్టీలో క్రిమినల్స్ ఎవరు లేరు.. ఒకవేళ పార్టీలో అలాంటి వారు ఉన్నట్లయితే మారేందుకు చివరి అవకాశం ఇస్తున్నట్లు మాయావతి హెచ్చరించారు. జైలు పాలైన రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీకి అఖిలేశ్ ఇటీవల టికెట్ నిరాకరించారు. దీంతో బీఎస్పీలో టికెట్లు కన్ఫామ్ కావడంతో పార్టీ మారి తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు.