ఉత్తర ప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత 'ముఖ్తార్ అన్సారీ' గుండెపోటుతో గురువారం (మార్చి 28) సాయంత్రం మృతి చెందారు. గుండెపోటుతో ఆయన తుది శ్వాస విచినట్లు అధికారులు చెబుతుంటే.. తన తండ్రికి స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారంటూ ముఖ్తార్ కుమారుడు 'ఉమర్' ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై కోర్టును సంప్రదిస్తానని చెప్పారు. ఈ విషయం మీద బీఎస్‌పీ అధ్యక్షురాలు మాయావతి స్పందించారు.
ముఖ్తార్ అన్సారీ మృతిపైన విచారణ జరిపించాలని మాయావతి డిమాండ్ చేశారు. ఈ కేసులో నిజానిజాలు ప్రజల ముందుకు రావాల్సి ఉందన్నారు. అన్సారీ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని భీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ కూడా డిమాండ్ చేశారు.
मुख़्तार अंसारी की जेल में हुई मौत को लेकर उनके परिवार द्वारा जो लगातार आशंकायें व गंभीर आरोप लगाए गए हैं उनकी उच्च-स्तरीय जाँच जरूरी, ताकि उनकी मौत के सही तथ्य सामने आ सकें। ऐसे में उनके परिवार का दुःखी होना स्वाभाविक। कुदरत उन्हें इस दुःख को सहन करने की शक्ति दे।
— Mayawati (@Mayawati) March 29, 2024
మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ అకాల మరణం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ.. ఎక్స్ (ట్విటర్) వేదికగా చంద్రశేఖర్ ఆజాద్ ట్వీట్ చేశారు.
అన్సారీ మౌ సదర్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అతను 2005 నుంచి ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లో జైలులో ఉన్నాడు. అతనిపై 60కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సెప్టెంబరు 2022 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని వివిధ న్యాయస్థానాలు అతనికి ఎనిమిది కేసుల్లో శిక్ష విధించాయి.
पूर्व विधायक मुख्तार अंसारी जी का असामायिक निधन बेहद दुखद, मैं विनम्र श्रद्धांजलि अर्पित करता हूं।
— Chandra Shekhar Aazad (@BhimArmyChief) March 28, 2024
मेरी संवेदनाएं उनके परिजनों और समर्थकों के प्रति हैं, प्रकृति उन्हें यह असीम दुख सहने की शक्ति प्रदान करें।
पूर्व में ही उन्होंने अपनी हत्या की आशंका व्यक्त की थी, मैं माननीय उच्च…
Comments
Please login to add a commentAdd a comment