Magisterial enquiry
-
‘అన్సారీకి విషమివ్వలేదు.. గుండెపోటుతోనే మృతి’
బండా: ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతిపై తలెత్తుతున్న అనుమానాలకు ఎట్టకేలకు తెరపడింది. అన్సారీ మృతిపై మెజిస్టీరియల్ విచారణ ముగిసింది. జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఈ విచారణ నివేదికను సమర్పించారు. ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందినట్లు మెజిస్టీరియల్ విచారణలో వెల్లడయ్యింది.ముఖ్తార్ అన్సారీ మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్న నేపధ్యంలో వీటికి చెక్ పెట్టేందుకు జిల్లా మేజిస్ట్రేట్ అధ్యక్షతన విచారణ చేపట్టారు. దర్యాప్తు నివేదిక వచ్చిన దరిమిలా ముఖ్తార్ అన్సారీ కుటుంబ సభ్యులకు దీనికి సంబంధించిన వివరాలు పంపారు. అయితే దీనిపై వారి వైపు నుండి ఎటువంటి స్పందన రాలేదు. ముఖ్తార్ కుటుంబానికి పంపిన నోటీసులో ఆయన మృతిపై ఉన్న అభ్యంతరాలు లేదా సాక్ష్యాలను సమర్పించడానికి కొంత గడువు ఇచ్చారు. అయితే కుటుంబ సభ్యులెవరూ ఇంతవరకూ స్పందించలేదు. విచారణ నివేదికను 10 రోజుల క్రితమే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించారు.గతంలో జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ ఆరోగ్యం మార్చి 28న క్షీణించింది. దీంతో జైలు నిర్వాహకులు అతన్ని బండా మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతిచెందాడు. నాడు ఆసుపత్రి విడుదల చేసిన వైద్య నివేదికలో అతని మరణానికి కారణం గుండెపోటు అని పేర్కొంది. అయితే ముఖ్తార్ కుటుంబ సభ్యులు, ప్రతిపక్షాలు ముక్తార్‌కు స్లో పాయిజన్ ఇచ్చారని ఆరోపించారు. ఈ నేపధ్యంలో బండా జిల్లా మేజిస్ట్రేట్ ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు.ఇది కూడా చదవండి: Uttar Pradesh: మెట్రో స్టేషన్ వద్ద కాల్పులు.. యువకుని మృతి -
కల్తీ మద్యం ఘటనపై మెజిస్టీరియల్ విచారణ
విజయవాడ: బెజవాడ కల్తీ మద్యం ఘటనపై విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. దీనిపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. సబ్‌కలెక్టర్ సృజనను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఎక్సైజ్ అధికారులు దూకుడును పెంచారు. ఘటనపై పలు సెక్షన్ల కింది పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 304 ఏ, 328, ఎకై్సజ్‌యాక్ట్ సెక్షన్ డీ(1),(2) కింద భాగవతుల శరత్ చంద్ర, కావూరి పూర్ణచంద్రశర్మ, కె.లక్ష్మీ సరస్వతీ, మల్లాది బాల త్రిపుర సుందరీలపై కేసు నమోదు చేశారు. కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందగా, మరో 29మంది తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వారిలో మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. -
కల్తీ మద్యం ఘటనపై మెజిస్టీరియల్ విచారణ
-
నల్గొండ అత్యాచారాల ఘటనపై విచారణకు ఆదేశం
నల్గొండ జిల్లాలోని 11 మంది గిరిజన బాలికలపై ట్యూటర్ అత్యాచార ఘటనపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఆ ఘటనపై తక్షణం విచారణ జరపాలని నల్గొండ జిల్లా కలెక్టర్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక అందించాలని ఆయన ఆదేశాలలో పేర్కన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాని ఆయన ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని తండాలో ఓ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమంలో ఉంటున్న అభం శుభం తెలియని పదకొండేళ్లలోపు 11 మంది బాలికలపై ట్యూటర్ హరీష్ మూడు మాసాలుగా అత్యాచారం చేస్తున్నాడు. ఆ ఘటనపై ఓ బాలిక ఉపాధ్యాయుడి ఫిర్యాదు చేసింది. దాంతో ఆ ఘటన వెలుగులోకి వచ్చింది. -
భూమయ్య మృతిపై న్యాయ విచారణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజా ప్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య మృతిపై పలు సంఘాలు, నేతలు సందేహాలు వ్యక్తం చేశారు. భూమయ్య మరణంపై వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి నల్లమాస కృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. నగరంలో రాత్రి 10 గంటల తర్వాతే బయలుదేరాల్సిన జీహెచ్ఎంసీ పారిశుధ్య వాహనాలు, 9.45 గంటలకే అతివేగంతో రోడ్డుపైకొచ్చి భూమయ్యను పొట్టనబెట్టుకున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. 1996 నుండి భూమయ్యను చంపుతామని బెదిరిస్తున్న శక్తులే ఈ ఘటన వెనక ఉండి ఉంటారని తాము భావిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు.. భూమయ్య మృతిపై సందేహాలు ఉన్నాయని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.నారాయణరెడ్డి, ఎం.ఎన్.కిష్టప్ప అన్నారు. ఇది కుట్రపూరిత హత్యగా వారు ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి చంద్రన్న కూడా ఇదే డిమాండ్ చేశారు. కాగా, భూమయ్య మరణం టిప్పర్ ప్రమాదం ముసుగులో ప్రభుత్వం పాల్పడిన పిరికిపంద చర్య అని సీపీఐ మావోయిస్టు కేంద్ర రీజినల్ బ్యూరో కార్యదర్శి ఆనంద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ దీనిని ఖండించాలన్నారు. అమరవీరుల స్తూపం వద్ద నేతల నివాళి: ఆకుల భూమయ్య మృతదేహాన్ని వందలాది మంది తెలంగాణవాదులు బుధవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ క్లాక్‌టవర్ వద్ద గల అమరవీరుల స్తూపం వద్దకు తీసుకువచ్చారు. తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరామ్, గద్దర్, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ నేతలు కేశవరావు జాదవ్, విమలక్క, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేతలు వేదకుమార్, ప్రొ. హరగోపాల్, బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, నాగం జనార్దన్‌రెడ్డి, టీఆర్ఎస్ నేత నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, చుక్కా రామయ్య, మల్లేపల్లి లక్ష్మయ్య, వరవరరావు, దేశపతి శ్రీనివాస్, నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ, బెల్లయ్యనాయక్, రాపోలు ఆనందభాస్కర్, దేవీప్రసాద్, పిట్టల రవీందర్, రత్నమాల నివాళులు అర్పించారు. కాగా, కరీంనగర్ జిల్లా జూలపల్లి మండల ం కాచాపూర్‌లో గురువారం ఉ.11 గంటలకు భూమయ్యకు అంత్యక్రియలు నిర్వహిస్తామని నల్లమాస కృష్ణ తెలిపారు.