నల్గొండ అత్యాచారాల ఘటనపై విచారణకు ఆదేశం | CM Kiran Kumar Reddy orders magisterial enquiry into schedule tribes girls rape in nalgonda district | Sakshi
Sakshi News home page

నల్గొండ అత్యాచారాల ఘటనపై విచారణకు ఆదేశం

Published Sat, Jan 4 2014 12:06 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

CM Kiran Kumar Reddy orders magisterial enquiry into schedule tribes girls rape in nalgonda district

నల్గొండ జిల్లాలోని  11 మంది గిరిజన బాలికలపై ట్యూటర్ అత్యాచార ఘటనపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఆ ఘటనపై తక్షణం విచారణ జరపాలని నల్గొండ జిల్లా కలెక్టర్కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక అందించాలని ఆయన ఆదేశాలలో పేర్కన్నారు.  నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాని ఆయన ఆ ఆదేశాలలో పేర్కొన్నారు.


నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని  తండాలో ఓ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమంలో ఉంటున్న అభం శుభం తెలియని పదకొండేళ్లలోపు  11 మంది బాలికలపై ట్యూటర్ హరీష్ మూడు మాసాలుగా అత్యాచారం చేస్తున్నాడు. ఆ ఘటనపై ఓ బాలిక ఉపాధ్యాయుడి ఫిర్యాదు చేసింది. దాంతో ఆ ఘటన వెలుగులోకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement