జంగారెడ్డిగూడెం: స్థానిక ఎక్సైజ్‌స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న ఆర్.సత్యవతి భర్త పైలా విజయ్‌కుమార్ (43) శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణంలో సూర్య కళాశాల రోడ్డులో ఒక అపార్ట్‌మెంట్‌లో వీరి కుటుంబం నివసిస్తోంది. శనివారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లో భార్యాపిల్లలు లేని సమయంలో డైనింగ్ హాల్‌లో ఫ్యాన్‌హుక్‌కు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విధుల నుంచి మధ్యాహ్న సమయంలో సత్యవతి ఇంటికి వెళ్లి చూసేసరికి భర్త విజయ్‌కుమార్ ఉరివేసుకున్నట్టు గుర్తించారు. జంగారెడ్డిగూడెం సీఐ కె.బాలరాజు, ఎస్సై జీజే విష్ణువర్ధన్, కొ య్యలగూడెం ఎస్సై సూర్యభగవాన్ తదితరులు ఘట నాస్థలానికి వెళ్లి పరిశీలించారు. విజయ్‌కుమార్ పలు చోట్ల ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు.
ఇటీవల వరకు స్థానికంగా ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తుండగా, రోడ్డు ప్రమాదంలో పడిపోగా చేయి విరిగింది. దీంతో ఆ ఉద్యోగాన్ని మానివేశారు. అయితే భార్య సత్యవతి ప్రభుత్వ ఉద్యోగి కాగా, తాను ఖాళీగా ఉండటం తో ఆత్మన్యూనతా భావానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయ్‌కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆస్పత్రి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ బాలరాజు తెలిపారు. ఇదిలా ఉండగా జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సీఐ బి.శ్రీనివాసరావు, ఎస్సై సత్యనారాయణ, ఏలూరు అసిస్టెంట్ ఎౖసజ్ సూపరింటెండెంట్ నాగేంద్ర, భీమవరం, తాడేపల్లిగూడెం ఎౖసజ్ సీఐలు బలరామరాజు, పెద్ది రాజు, ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐలు ధనరాజు, ఎం.శ్రీను, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. విజయ్‌కుమా ర్ మృతదేహానికి నివాళులర్పించారు. ఎౖసజ్ ఎస్సై సత్యవతిని పరామ ర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment