Husband committed suicide
-
నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని.. చివరికి భర్త షాకింగ్ నిర్ణయం
భవానీపురం(విజయవాడ పశ్చిమ): భార్య తన మాట వినటం లేదని మనస్తాపం చెందిన భర్త ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్లెం దుర్గమ్మ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం నులకపేట ప్రకాష్‌నగర్‌లో తన కుమార్తె దగ్గర ఉంటుంది. మార్బుల్ పని చేస్తూ జీవనం సాగించే ఆమె పెద్ద కుమారుడు కల్లెం లక్ష్మీప్రసాద్ (37)కి వివాహమయ్యి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయితే లక్ష్మీప్రసాద్ ఎనిమిదేళ్ల క్రితం మొదటి భార్యను వదిలేసి భవానీ అనే మహిళను రెండో పెళ్లి చేసుకుని చిట్టినగర్ సాయిరాం సెంటర్ నాగమ్మ సత్రం ఎదురుగా ఉన్న అద్దాలవారి వీధిలో కొండపై ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో లక్ష్మీప్రసాద్ తల్లి దుర్గమ్మకు ఫోన్ చేసి తన రెండో భార్య భవానీ తన మాట వినటం లేదని, తాను వద్దంటున్నా పనికి వెళుతోందని చెప్పి బాధపడ్డాడు. ఆ సమయంలో అతను మద్యం సేవించి మాట్లాడినట్లు తల్లి భావించింది. మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో భవానీ అత్త దుర్గమ్మకు ఫోన్ చేసి లక్ష్మీప్రసాద్ ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడని చెప్పింది. దీంతో దుర్గమ్మ వెంటనే లక్ష్మీప్రసాద్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి చూడగా ముందు గది అయిన బెడ్ రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయి ఉన్నాడు. చూడాలని ఉందన్నాడు.. కోడలు భవానీని ఏం జరిగిందని అత్త అడుగగా ఉదయం 9.30 గంటలకు తాను పనిచేసే చోట దింపి ఇంటికి వెళ్లిపోతానని భర్త చెప్పాడని, మధ్యాహ్నం 12.45 గంటలకు ఫోన్ చేసి నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని అన్నాడని తెలిపింది. అయితే పనిలో ఉండగా ఫోన్ మాట్లాడితే ఓనర్ ఊరుకోడని, ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని ఫోన్ పెట్టేశానని అత్త దుర్గమ్మకు చెప్పింది. తిరిగి ఒంటి గంట సమయంలో పని నుంచి బయటకు వచ్చి భర్తకు ఫోన్ చేయగా ఫోన్ ఎత్తకపోవడంతో తమ ఇంటి పక్కనే నివసించే గంగ అనే మహిళకు ఫోన్ చేసి తన భర్త ఫోన్ ఎత్తడం లేదని ఒక సారి వెళ్లి చూడమని కోరానని తెలిపింది. ఆమె వెళ్లి చూడగా బెడ్ రూమ్‌లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని చనిపోయి ఉన్నాడని చెప్పింది. భార్య తన మాట వినడం లేదని తాగిన మత్తులో క్షణికావేశంతో ఉరేసుకుని చనిపోయి ఉంటాడని భావిస్తున్నానని మృతుడి తల్లి దుర్గమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: శ్రద్ధా హత్య కేసు: అంతుపట్టని మరో ట్విస్ట్....నివ్వెరపోయిన పోలీసులు -
ఎక్సైజ్ ఎస్సై భర్త ఆత్మహత్య
జంగారెడ్డిగూడెం: స్థానిక ఎక్సైజ్స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న ఆర్.సత్యవతి భర్త పైలా విజయ్‌కుమార్ (43) శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణంలో సూర్య కళాశాల రోడ్డులో ఒక అపార్ట్మెంట్లో వీరి కుటుంబం నివసిస్తోంది. శనివారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లో భార్యాపిల్లలు లేని సమయంలో డైనింగ్ హాల్లో ఫ్యాన్‌హుక్‌కు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విధుల నుంచి మధ్యాహ్న సమయంలో సత్యవతి ఇంటికి వెళ్లి చూసేసరికి భర్త విజయ్‌కుమార్ ఉరివేసుకున్నట్టు గుర్తించారు. జంగారెడ్డిగూడెం సీఐ కె.బాలరాజు, ఎస్సై జీజే విష్ణువర్ధన్, కొ య్యలగూడెం ఎస్సై సూర్యభగవాన్ తదితరులు ఘట నాస్థలానికి వెళ్లి పరిశీలించారు. విజయ్‌కుమార్ పలు చోట్ల ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు. ఇటీవల వరకు స్థానికంగా ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తుండగా, రోడ్డు ప్రమాదంలో పడిపోగా చేయి విరిగింది. దీంతో ఆ ఉద్యోగాన్ని మానివేశారు. అయితే భార్య సత్యవతి ప్రభుత్వ ఉద్యోగి కాగా, తాను ఖాళీగా ఉండటం తో ఆత్మన్యూనతా భావానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయ్‌కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆస్పత్రి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ బాలరాజు తెలిపారు. ఇదిలా ఉండగా జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సీఐ బి.శ్రీనివాసరావు, ఎస్సై సత్యనారాయణ, ఏలూరు అసిస్టెంట్ ఎౖసజ్ సూపరింటెండెంట్ నాగేంద్ర, భీమవరం, తాడేపల్లిగూడెం ఎౖసజ్ సీఐలు బలరామరాజు, పెద్ది రాజు, ఎన్ఫోర్స్మెంట్ సీఐలు ధనరాజు, ఎం.శ్రీను, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. విజయ్‌కుమా ర్ మృతదేహానికి నివాళులర్పించారు. ఎౖసజ్ ఎస్సై సత్యవతిని పరామ ర్శించారు. -
ఉద్యోగం చేయమన్నందుకు ప్రాణం తీశాడు
భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య అనాథ అయినా ఇష్టపడి వివాహం చేసుకున్నందుకు.. పనీపాటా లేకుండా అతను ఖాళీగా తిరుగుతున్నాడు. కనీసం నలుగురిలో చెప్పుకోవటానికైనా ఉద్యోగం చేయమని ఆమె అతన్ని కోరింది. దానికి అతను ససేమిరా అన్నాడు. భార్య మాత్రం పదేపదే ఈ విషయాన్ని గుర్తు చేస్తుండటంతో భర్తకు ఆగ్రహం వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య రోజు గొడవలు, వివాదాలు ముదిరి చివరకు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. విజయవాడ(పూర్ణానందంపేట) : పట్టరాని కోపంతో భర్త భార్యను హతమార్చి చివరకు అతను ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం స్థానిక ఆర్ట్పేటలో చోటు చేసుకుంది. స్థానికంగా కలకలం సృష్టించిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్ట్పేటకు చెందిన తాటి ఉమాదేవి(30)కి పెజ్జోనిపేటకు చెందిన మునిజేటి రాజు(35)తో రెండేళ్ల కిత్రం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి వివాహంకాక ముందే కొన్నేళ్లపాటు ఆర్ట్పేటలోని ఒక ఇంట్లో కలిసి ఉన్నారు. అయితే ఐదేళ్ల క్రితం ఉమాదేవి తండ్రి రామరాజు మరణించటంతో ఆయన ఉద్యోగం కుమార్తెకు వచ్చింది. రాజు ప్రైవేటు ఎలక్ట్రిషియన్‌గా పని చేశాడు. అయితే భార్య రైల్వేలో ఉద్యోగి కావటంతో రాజు జల్సాలకు అలవాటుపడి పనిపాట లేకుండా తిరుగుతున్నాడు. ఈక్రమంలో భర్త ఖాళీ తిరుగుతున్నావని భార్య పదేపదే అడుగుతుండటంతో రాజు తరచూ ఆమెతో గొడవ పడేవాడు. ఇటీవల రాజు కుడి కాలికి దెబ్బతగిలి సెప్టిక్ అయింది. గత రెండు నెలలుగా ఆస్పత్రిలో చికిత్స పొంది నాలుగు రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యాడు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి భార్య, కుటుంబ సభ్యులు తనను పట్టించుకోవడం లేదని గొడవపడి ఉమాదేవిని కొడుతుండేవాడు. గురువారం రాత్రి వారి ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో రాజు ఉమాదేవి తలను గోడకేసి మోది కిరాతకంగా హత్య చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై రక్తపు మడుగులో మృతి చెంది ఉంది. ఈ ఘటనతో భయపడిన రాజు ఇంటి సీలింగ్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం ఎంతసేపటికి కూతురు, అల్లుడు బయటకు రాకపోవడంతో ఉమాదేవి తల్లి రత్తమ్మ పైకి వెళ్లి తలుపు తట్టి లేపినా తలుపు తియకపోడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించింది. 5వ టౌన్ పోలీస్‌స్టేషన్ సీఐ సత్యనారాయణ సిబ్బందితో అక్కడకు చేరుకుని తలుపుతు పగులకొట్టి చూడగా మంచంపై ఉమాదేవి విగత జీవిగా పడిఉండగా రాజు సీలింగ్‌కు వేలాడుతు కనిపించాడు. దీనిపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంలో.. అనాథగా ఉన్న రాజును ఇష్టపడి కలిసి ఉండి వివాహం చేసుకున్నందుకు చివరికి ఆమె అతని చేతుల్లోనే బలి అయింది. డబ్బులు కోసం కాకుండా ఏదైనా పని చేయమని భర్తను అడిగినందుకు రాజు క్షణికావేశంలో పట్టరాని కోపంతో భార్యను హత్య చేశాడని తెలుస్తోంది. సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ అనుమానాస్పద కేసుగా నమోదు చేశామని పూర్తిస్థాయిలో దర్యాపు నిర్వహించి వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పారు. -
భార్యను చంపి భర్త ఆత్మహత్య
శాంతిపురం: వుండలంలోని కాలిగానూరు వద్ద సోవువారం రాత్రి గుర్తించిన వుహిళ శవం కేసు కొత్తవులుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా భావించిన వుృతురాలి భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాళ్లబూదగూరు ఎస్ఐ గోపి, వుృతురాలి బంధువుల సవూచారం మేరకు.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా వరటనపల్లెకు చెందిన చిన్నస్వామి కువూరుడు అయ్యుప్ప(26)తో వీ.కోట ఈశ్వర్‌నగర్‌కు చెందిన సుబ్రవుణ్యం, యుశోదవ్ము కువూర్తె వనిక(21)కు 13 నెలల క్రితం వివాహమైంది. పెళ్లయిన ఐదు నెలలకు అయ్యుప్ప బతుకు తెరువు కోసం సింగపూరుకు వెళ్లాడు. అప్పట్లో భార్యను పుట్టింట్లో ఉంచి వెళ్లడంతో ఆమె వి.కోటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తున్నారు. ఇటీవల తిరిగి వచ్చిన అయ్యుప్ప భార్యతో పాటు వి.కోటలోనే ఉంటూ గతనెల 29న వరటనపల్లెకు వెళ్లివచ్చారు. ఇరువురి వుద్య చిన్నపాటి వివాదాలు నడుస్తున్నాయి. వనికకు తరచూ కడుపునొప్పి వస్తుండటంతో పరీక్షల కోసం సోవువారం కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి వెళ్లేందుకు వి.కోట నుంచి ద్విచక్ర వాహనంపై బయులుదేరారు. అయితే కాలిగానూరు సమీపంలో సోవువారం రాత్రి వనిక శవమై కనిపించింది. సవూచారం ఆందుకున్న రాళ్లబూదగూరు ఎస్ఐ గోపి సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి రాత్రే వుృతురాలి వివరాలు సేకరించారు. వుృతురాలి నోరు నొక్కి, గొంతు నులిమి హత్య చేసినట్టు గుర్తించారు. భర్తే నిందితుడన్న అనువూనంతో విచారణ ప్రారంభించారు. వుంగళవారం వనిక వుృతదేహానికి కుప్పం వంద పడకల ఆస్పత్రిలో పోస్టువూర్టం అనంతరం ఆమె బంధువులకు అప్పగించారు. ఈ సందర్బంగా కుప్పం సీఐ రాజశేఖర్ వుృతురాలి బంధువుల నుంచి వివరాలు సేకరించారు. అయితే భార్యను కడదేర్చిన అయ్యుప్ప స్వగ్రావూనికి వెళ్లి సోవువారం రాత్రి ఉరి వేసుకుని వుృతి చెందాడు. దీనిపై తమిళనాడులోని బరుగూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వుృతుడి వద్ద నుంచి అక్క డి పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ వెలు గు చూస్తే వురిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. మూడో వ్యక్తి ఎవరు? సోవువారం సాయుంత్రం వుృతురాలు, ఆమె భర్తతో పాటుగా 50 ఏళ్లకు పైగా వయుస్సున్న ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్లినట్టు స్థానికులు తెలిపారు. ఆయితే కొంతసేపటి తరువాత అయ్యుప్పతో పాటు తెల్లపంచె, చొక్కాతో ఉన్న సదరు వ్యక్తి వూత్రమే తిరిగి వచ్చాడని వారు చెబుతున్నారు. దీంతో ఈ మూడోవ వ్యక్తి ఎవరన్నది సందేహంగా మిగిలింది. భార్యను కడదేర్చాలని మూడో పథకం పన్నిన అయ్యుప్ప సాయుంగా ఎవరినైనా ఏర్పాటు చేసుకున్నాడా? లేదా క్షణికావేశంలో భార్యను హ త్య చేస్తే అక్కడే ఉన్న మూడో వ్యక్తి ఏమి చేస్తున్నాడు? ఇంతకీ ఆ వ్యక్తి ఎవరన్నదీ పోలీసుల విచారణలో వెలుగు చూడాల్సింది.