నాటుసారా రహిత జిల్లాగా మారుస్తాం | Kamareddy District changing.. | Sakshi
Sakshi News home page

నాటుసారా రహిత జిల్లాగా మారుస్తాం

Published Fri, Apr 21 2017 2:00 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

నాటుసారా రహిత జిల్లాగా మారుస్తాం - Sakshi

నాటుసారా రహిత జిల్లాగా మారుస్తాం

కామారెడ్డి ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌

గాంధారి(ఎల్లారెడ్డి): వచ్చే జూన్‌ వరకు కామారెడ్డిని నాటుసారా రహిత జిల్లా గా మార్చడమే తమ లక్ష్యమని కామారెడ్డి జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌ అన్నారు. మండలంలోని బూర్గుల్‌ జీపీ పరిధిలోని సోమ్లానాయ క్‌ తండా, పంతులు నాయక్‌ తండా, దుర్గం జీపీ పరిధిలోని పలుతండాల్లో గురువారం దాడులు చేశామన్నారు. అనంతరం తండా వాసులతో సమావేశం ఏర్పాటు చేసి నాటుసారా తయారీ వలన కలిగే అనర్థాలను వివరించినట్లు తెలిపారు. గతంలో నాటుసారా పట్టుపడితే ఒక్కరిపైనే కేసులు నమోదు చేసేవాళ్లమని, ప్రస్తుతం నాటుసారా తయా రు చేసే కుటుంబసభ్యులందరినీ బా ధ్యులను చేస్తూ కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు.

ఈ విధానంతో అ ధికశాతం నాటుసారా తయారీ మా నుకుంటున్నారని పేర్కొన్నారు. జిల్లా లో లింగంపేట్, గాంధారి మండలాల పరిధిలోని తండాల్లో మాత్రమే రెండుశాతం గిరిజనులు నాటుసారా తయా రు చేస్తున్నారన్నారు. తండాల్లో తరచూ దాడులు చేస్తూ నాటుసారా తయారీని పూర్తిగా నివారిస్తామని పేర్కొన్నారు. ఎక్సైజ్‌ శాఖ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఆదేశాలిచ్చామన్నారు. నాటుసారా తయారీకి వినియోగించే ముడిసరుకులు నల్లబెల్లం, స్పటిక తది తర సరుకులు లభించకుండా తండాల్లో నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు.

అయినా మారుమూల తండాల్లో నాటుసారా తయారుచేస్తున్నారని, వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి నాటుసారా తయారీని నివారించడానికి చ ర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా పరిధిలో ఎక్కడైనా నాటుసా రా తయా రు చేస్తే టోల్‌ఫ్రీ నంబరు 11800 4252523తో పాటు ఎక్సైజ్‌ జిల్లా కార్యాలయం నంబరు 08468 22013, 9440902737కు సమాచారం ఇవ్వాలని సూపరింటెండెంట్‌ కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సత్యం, ఎక్సైజ్‌ సీఐలు ఏఎల్‌ఎన్‌ స్వామి, పీర్‌సింగ్, ఎస్‌ఐలు సృజన, నాగభూషణం, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement