సారా తయారీలో వాడే నల్లబెల్లం విక్రయాలపై దృష్టిసారించిన వరంగల్ ఎక్సైజ్ పోలీసులు నగరంలోని బెల్లం దుకాణాలపై శుక్రవారం దాడులు జరిపారు.
సారా తయారీలో వాడే నల్లబెల్లం విక్రయాలపై దృష్టిసారించిన వరంగల్ ఎక్సైజ్ పోలీసులు నగరంలోని బెల్లం దుకాణాలపై శుక్రవారం దాడులు జరిపారు. విక్రయం, నిల్వ లెక్కల్లో తేడాలు తేలటంతో స్థానిక పాత బీట్ బజార్‌లో ఉన్న రెండు దుకాణాలను సీజ్ చేశారు. మొత్తం 16 టన్నుల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు.