Black jaggery
-
మళ్లీ గుప్పుమంటున్న గుడుంబా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పల్లెల్లో మళ్లీ గుడుంబా గుప్పుమంటోంది. పునరావాసం అందనివారు పొరుగు రాష్ట్రాల నుంచి నల్లబెల్లం, పటిక దిగుమతి చేసుకుని సారా బట్టీలు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వరుసగా పట్టుబడుతున్న టన్నుల కొద్దీ నల్లబెల్లం, పటిక నిల్వలు గుడుంబా మళ్లీ విజృంభిస్తోందన్న వాస్తవాన్ని బయటపె డుతున్నాయి. ఏపీ నుంచి రైళ్లలో, మహారాష్ట్ర నుంచి రోడ్డు మార్గంతో నల్లబెల్లం రాష్ట్రంలోకి వస్తోందని అధికారవర్గాలు గుర్తించాయి. గట్టి చర్యలు చేపట్టినా.. రాష్ట్రాన్ని గుడుంబా రహితం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టి చర్యలే తీసుకు న్నారు. నాటుసారా తయారీపై ఎక్సైజ్, పోలీ సు సిబ్బంది దాడులు చేశారు. చాలా మంది గుడుంబా తయారీదారులను పట్టుకుని కేసు లు పెట్టారు. నల్లబెల్లం సరఫరాను నియం త్రించారు. గుడుంబా జీవనాధారంగా బతికే కుటుంబాల వారికి పునరావాసంగా ప్రత్యా మ్నాయ ఉపాధి కోసం రూ.2 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించే కార్యక్రమా న్నీ చేప ట్టారు. ఐదారు నెలల్లోనే గుడుంబా నియం త్రణలోకి వచ్చింది. కానీ, రాష్ట్రంలో చాలా మందిని పునరావాస సాయం కోసం ఎంపిక చేయలేదు, ఎంపికైనవారిలో పలు వురికి సా యం అందకపోవడంతో మళ్లీ గుడుంబా తయారీవైపు మరలినట్టు తెలుస్తోంది. రైలు, రోడ్డు మార్గాల్లో నల్లబెల్లం.. పొరుగు రాష్ట్రాల్లో నిషేధం లేక పోవడంతో తక్కువ ధరకే నల్లబెల్లంపై అందుబాటులో ఉంది. ఏపీలోని గుంటూరు, నెల్లూరు, గోదా వరి జిల్లాల నుంచి ఉమ్మడి ఖమ్మం, వరం గల్, నల్లగొండ జిల్లాలకు అక్రమంగా రవాణా అవుతోంది. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు రోడ్డు మార్గంలో నల్లబెల్లం వస్తోంది. ఏపీ నుంచి రైళ్లలో రోజూ 50 టన్నుల వరకు నల్ల బెల్లం అక్రమరవాణా అవుతున్నట్టు నిఘా వర్గాల అంచనా. ఇటీవలే మహారాష్ట్ర నుంచి 11 క్వింటాళ్ల నల్లబెల్లం, 50 కేజీల పటికను తరలిస్తున్న వాహనాన్ని ఆదిలాబాద్ జిల్లా సిర్పూరు(టి)–కౌటాల రహదారిపై ఎౖMð్సజ్ అధికారులు పట్టుకోవడం గమనార్హం. గుం టూరు జిల్లా బాపట్ల నుంచి పద్మావతి ఎక్స్ ప్రెస్‌లో తీసుకువస్తున్న 10 టన్నుల బెల్లాన్ని కేసముద్రం వద్ద రైల్లోనే పట్టుకున్నారు. యువకులు బృందాలుగా మారి.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల వారు కొందరు బృందాలుగా ఏర్పడి నల్లబెల్లాన్ని తీసుకువస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో తక్కువ ధరకు బెల్లం కొంటు న్నారు. ఒక్కొక్కరు ఒక్కో క్వింటాల్ బెల్లాన్ని బస్తాల్లో తీసుకుని సాధారణ ప్రయాణీకుల్లా రైలు ఎక్కుతున్నారు. తమ గమ్యస్థానం సమీపించగానే రైల్లోంచి బెల్లం మూటలను కిందికి తోసేస్తున్నారు. అప్పటికే అక్కడ వేచి ఉండే మరికొందరు.. ఆ బెల్లాన్ని ఆటోలు, ఇతర వాహనాల ద్వారా గ్రామాలకు తీసుకెళ్లి రెండింతల ధరకు విక్రయిస్తున్నారు. -
250 కిలోల నల్లబెల్లం పట్టివేత
సూర్యాపేట మున్సిపాలిటీ : అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లాన్ని సూర్యాపేట ఎక్సైజ్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. వివరాల ప్రకారం.. ఆత్మకూర్.ఎస్ మండలం కోటినాయక్‌తండాకు చెందిన ధరావత్ పూర్ణ హైదరాబాద్ నుంచి టాటా ఏసీ వాహనంలో 250 కేజీల బెల్లం, 50 కేజీల పటికను అక్రమంగా తీసుకొస్తున్నాడు. సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు పట్టణంలోని కుడకుడ రోడ్డులో పట్టుకున్నారు. వాహనంలో ఉన్న బెల్లం, పట్టికను స్వాధీనం చేసుకొని వాహనాన్ని సీజ్ చేశారు. వ్యాపారి పూర్ణపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. దాడుల్లో సీఐ శ్రీధర్, ఎస్ఐ హనుమంతు, సిబ్బంది రాములు, బాలాజీ, వీరయ్య, రాంమూర్తి తదితరులు ఉన్నారు. -
25 క్వింటాళ్ల నల్లబెల్లం స్వాధీనం
ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలంలో ఎక్సైజ్ దాడులు నిర్వహించిన అధికారులు 25 క్వింటాళ్ల నల్లబెల్లం, 5 క్వింటాళ్ల పట్టికను స్వాధీనం చేసుక్నురు. ఆటోలో తరలిస్తున్న నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. -
70బస్తాల నల్లబెల్లం పట్టివేత
నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో 70కిలోల నల్లబెల్లాన్ని పోలీసులు శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. వ్యాపారి గుండా శ్రీనివాస్ ఇంటిపై దాడి చేయగా నల్లబెల్లం నిల్వలు బయటపడ్డాయి. సరుకును సీజ్ చేసి కేసు నమోదు చేశారు. -
నమ్మించి.. ముంచి
నల్లబెల్లం కొనుగోలులో మాటమార్చిన మార్క్‌ఫెడ్ ఎక్సైజ్‌శాఖ నిధులివ్వలేదంటూ తప్పించుకునే యత్నం కొనుగోలు కేంద్రం ప్రారంభించి మిన్నకుంటున్న వైనం గగ్గోలు పెడుతున్న బెల్లం రైతులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్క్‌ఫెడ్ 60 మంది రైతులకు అమ్మకపు టోకెన్లిచ్చి ఒక్క బెల్లం ముద్దనూ కొనకుండానే దుకాణం కట్టేసింది. పక్షం రోజులు దాటుతున్నా బెల్లం కొనకపోవడం పై మార్క్‌ఫెడ్‌ను ప్రశ్నిస్తే, ఎక్సైజ్ శాఖ నిధులివ్వలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో బెల్లం అమ్మకంపై ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మార్క్‌ఫెడ్ మాయజాలం మార్క్‌ఫెడ్ జిల్లాలో నల్లబెల్లం కొనుగోలు కేంద్రాన్ని చిత్తూరులోని మార్కెట్ యార్డులో ఏప్రిల్ 2న ప్రారంభించింది. పాలసముద్రం, వెదురుకుప్పం, ఎస్ఆర్పురం, కార్వేటినగరం ప్రాంతాల్లో మరో నాలుగు కొనుగోలు కేంద్రాలు త్వరలోనే ప్రారంభించనున్నట్లు మార్క్‌ఫెడ్ అధికారులు చెప్పారు. కిలో బెల్లం రూ.27 వంతున కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఈ ఏడాది 700 నుంచి వెయ్యి టన్నుల వరకు బెల్లం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు రైతుల వద్ద ఎంత మోతాదులో బెల్లం ఉన్నా కొంటామన్నారు. రైతులు పట్టాదారు పాసుబుక్కులతోపాటు ఆధార్ కార్డు, రేషన్‌కార్డు లేదా ఓటరు కార్డు తీసుకురావాలన్నారు. దీంతో మార్క్‌ఫెడ్ ప్రకటనతో ఆర్థిక ఇబ్బందులతో బెల్లం అమ్ముకున్న రైతులు తప్ప.. అప్పటి వరకు బెల్లం నిల్వ ఉంచుకున్న రైతుల్లో ఆనందం వెల్లివెరిసింది. మార్క్‌ఫెడ్ గిట్టుబాటు ధరకు బెల్లం కొంటే పెట్టుబడులు పోను అంతోఇంతో చేతికి వస్తుందని ఆశించారు. కానీ ఆ ఆశలు ఎన్నో రోజులు నిలవలేదు. ఒక్కరోజుకే.. బంద్ తొలిరోజు 60 మంది బెల్లం రైతులకు అమ్మకపు టోకెన్లు మంజూరు చేసిన మార్క్‌ఫెడ్ అధికారులు సాయంత్రానికే దుకాణం కట్టేశారు. మరుసటి రోజు నుంచే ఇప్పట్లో బెల్లం కొనుగోలు చేయడం లేదంటూ రైతులకు అమ్మకపు టొకెన్లు ఇవ్వడం నిలిపేశారు. ఇదేమని ప్రశ్నిస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నల్లబెల్లం కొనుగోలు నిలిపివేశామని చెప్పారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని ఖరాకండిగా చెప్పేశారు. ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే నల్లబెల్లం కొనుగోలుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నిధులివ్వాల్సి ఉందని, ఆ నిధులు వస్తేనే బెల్లం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. నిధులివ్వని ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వుల మేరకు మార్క్‌ఫెడ్ జిల్లాలో 700 టన్నుల నల్లబెల్లం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.2 కోట్లు నిధులు అవసరమవుతాయి. ఎక్సైజ్ శాఖ నిధులిస్తేనే మార్క్‌ఫెడ్ బెల్లం రైతులకు ఆ మొత్తాన్ని చెల్లించాల్సిఉంది. అయితే గత ఏడాది సైతం ఎక్సైజ్ శాఖ ఉత్తర్వుల మేరకు మార్క్‌ఫెడ్ 627 టన్నుల బెల్లాన్ని కొనుగోలుచేసింది. దీనికి సంబంధించి దాదాపు రూ.2 కోట్ల నిధులు రైతులకు చెల్లించాల్సి ఉండగా ఎక్సైజ్ శాఖ కేవలం కోటి రూపాయలు మాత్రమే నిధులిచ్చి చేతులు దులుపుకుంది. ఇంకా కోటి రూపాయలు రావాల్సి ఉండడంతో మార్క్‌ఫెడ్ నల్లబెల్లం కొనుగోలును అర్థాంతరంగా నిలిపివేసినట్లు సమాచారం. చిత్తశుద్ధిలేని ప్రభుత్వం.. నల్లబెల్లం కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని ఆశలు కల్పించిన ప్రభుత్వం ఆ మేరకు నిధులు ఇవ్వడంలో మాత్రం సీత కన్నేసింది. ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో స్పందించపోవడంపై రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. -
బెల్లం దుకాణాలపై ఎక్సైజ్ దాడులు
సారా తయారీలో వాడే నల్లబెల్లం విక్రయాలపై దృష్టిసారించిన వరంగల్ ఎక్సైజ్ పోలీసులు నగరంలోని బెల్లం దుకాణాలపై శుక్రవారం దాడులు జరిపారు. విక్రయం, నిల్వ లెక్కల్లో తేడాలు తేలటంతో స్థానిక పాత బీట్ బజార్లో ఉన్న రెండు దుకాణాలను సీజ్ చేశారు. మొత్తం 16 టన్నుల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
గిరిజన గ్రామాల్లో ఎక్సైజ్ దాడులు
భారీ ఎత్తున్న నల్లబెల్లం పట్టివేత బెల్ల ఊట ధ్వంసం 15మంది అరెస్ట్ పాడేరు రూరల్: నల్లబెలం,అమ్మోనియా సరఫరా, సారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు మెరుపు దాడులు చేసి, పెద్ద మొత్తంలో నల్లబెలం, అమ్మోనియా, సారాను పట్టుకున్నారు. ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హుకుంపేట మండలం భీమవరం పంచాయతీ గుమ్మడిగుండువాల గ్రామంలో కొన్నాళ్లుగా యథేచ్ఛగా సారా తయారీ, అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం ఎక్సైజ్ అధికారులకు తెలిసింది. దీంతో బుధవారం సిబ్బంది గ్రామానికి చేరుకుని దాడులు నిర్వహించి 300 లీటర్ల సారను స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీకి వినియోగించే వెయ్యి కిలోల నల్లబెల్లం, 200 కిలోల అమ్మోనియాను కూడా పట్టుకున్నారు. నల్లబెల్లం, అమ్మోనియా సరఫరా చేస్తున్న చీడికాడ మండలం తుంగటపల్లి గ్రామానికి చెందిన జెర్రిపోతుల దేముడు, హుకుంపేటకు చెందిన బి.రమణ మ్మలతో పాటు సారా తయారు చేస్తున్న గుమ్మడిగుండువా గ్రామానికి చెందిన మర్రి రత్తు, కిల్లో సురేష్, మర్రి గోపాలరావు, మర్రి కొములు, మర్రి శ్రీను, మర్రి నాగేశ్వరరావు, మర్రి కాంతమ్మ, మర్రి సుబ్బారావులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్ఐ ఎరుకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. జి.మాడుగుల మండలంలో.. జి.మాడుగుల: మండలంలో భీరం పంచాయతీ కేంద్రానికి సమీపంలో సారా తయారీ కేం ద్రాలపై బుధవారం పోలీసులు దాడి చేసి, సుమారు వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా విక్రయిస్తున్న కె చిట్టమ్మ, కె కృష్ణారావు, బి భాస్కరరావు, ఎస్ పంతులుబాబు, బి సంజీవరావును అరెస్టు చేసి, వారి వద్ద 40 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు ఆయన మాట్లాడుతూ మండలంలో సారా తయారీ, విక్రయాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడిలో అదనపు ఎస్ఐ శ్రీనివాసరావు, సీఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు. డుంబ్రిగుడ మండలంలో డుంబ్రిగుడ: మండలంలోని కండ్రుం పంచాయతీ ఒంబి గ్రామంలో ఎక్స్‌జ్ సీఐ కె.వి.ఎస్.ఎస్. కుమారి ఆధ్వర్యంలో సారా బట్టీలపై దాడి చేసి, పది వేల లీటర్ల బెల్లం పులును ధ్వంసం చేశారు. అలాగే ఆంధ్రా ఒడిశా సరిహద్దులో ఉన్న రాయిపాడు గ్రామంలో డుంబ్రిగుడ ఎస్ఐ బి రామకృష్ణ ఆధ్వర్యంలో సారా బట్టీలపై దాడులు జరిపి రెండువేల లీటర్ల సారా, ఐదు వేల లీటర్ల బెల్లం పులుపును ధ్వంసం చేశారు. -
భారీగా నల్ల బెల్లం పట్టివేత
విశాఖ జిల్లాలో ఎక్సైజ్ పోలీసులు బుధవారం భారీ మొత్తంలో బెల్లం, అమ్మోనియాను స్వాధీనం చేసుకున్నారు. హుకుంపేట మండలంలోని పలు గ్రామాల నుంచి నల్ల బెల్లం, అమ్మోనియా రవాణా జరుగుతున్నట్టు సమాచారం అందడంతో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. వ్యాన్‌లో తరలిస్తున్న 1500 కిలోల నల్లబెల్లం, అమ్మోనియా స్వాధీనం చేసుకున్నారు. -
ఎక్సైజ్ అధికారుల దాడులు
ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఎక్సైజ్ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. మండల పరిధిలో జోరుగా సారా తయారి జరుగుతుందనే సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు భారీగా బెల్లం ఊటలను ధ్వంసం చేశారు. సారా తయారు చేస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. -
15 టన్నుల నల్లబెల్లం స్వాధీనం
గుడుంబా తయారి కోసం ఉపయోగించే నల్లబెల్లం నిల్వలను గురువారం ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వాసవీభవన్ రోడ్డులో ఉన్న లక్ష్మీ రాజ్యం అనే వ్యాపారికి చెందిన గొడౌన్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 15 టన్నుల నల్లబెల్లం నిల్వలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో ఈ రోజు ఉదయం నుంచే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఇప్పటికే పది టన్నుల పట్టికను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సుధాకర్ తెలిపారు. -
2 క్వింటాళ్ల నల్ల బెల్లం స్వాధీనం
అశ్వరావుపేట: ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు పలు దుకాణాలలో సోదాలు నిర్వహించారు. దుకాణాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 2 క్వింటాళ్ల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. నల్లబెల్లన్ని అమ్ముతున్న ముగ్గురు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. పట్టు బడిన బెల్లాన్ని ఎక్సైజ్ అధికారులకు అప్పగించనున్నట్టు పోలీసులు తెలిపారు. -
తాండూరులో 8 క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత
తాండూరు(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా తాండూరులో సారా తయారీకి ఉపయోగించే 8 క్వింటాళ్ల నల్లబెల్లాన్ని పోలీసులు పట్టుకున్నారు. మండల కేంద్రంలోని కూరగాయల బజారులో ఓ దుకాణంలో పోలీసులు సోమవారం తనిఖీలు చేయగా 8 క్వింటాళ్ల నల్లబెల్లంతో పాటు 10కేజీల నమసారం బయటపడింది. దీంతో దుకాణం యాజమాని శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
నల్లబెల్లం పక్కదారి పట్టకుండా చూడండి
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: నల్లబెల్లం పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఉద్దేశించిన మార్గదర్శకాలను తప్పక అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లబెల్లం విక్రయాలు పక్కదారి పడుతున్నాయని, దీంతో సారా తయారీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన స్వామిదాస్ హైకోర్టులో గత ఏడాది పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం విచారించిన ధర్మాసనం ప్రభుత్వానికి పై మేరకు ఆదేశాలు జారీచేసింది. -
ఎక్సైజ్ అధికారులు దాడులు: భారీగా నల్లబెల్లం స్వాధీనం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా 7 వేల కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నల్లబెల్లం విక్రయిస్తే రౌడీషీట్
వరంగల్ క్రైం : జిల్లాలో ఇకపై నల్లబెల్లం విక్రయించినా, రవాణా చేసినా అటువంటి వారిపై రౌడీషీట్ నమోదు చేస్తామని వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. వరంగల్ రూరల్, అర్బన్ పరిధిలో నిరుపేద కుటుంబాలను వీధిపాలు చేస్తూ వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న గుడుంబాను నియంత్రించే ఉద్దేశంతో ఆదివారం వరంగల్ రూరల్ ఎస్పీ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇకపై గుడుంబా తయారీకి ఉపయోగించే ముడి సరుకులైన నల్లబెల్లం, పటికను అమ్మిన, రవాణా చేసిన వారిపట్ల కఠినంగా వ్యవహరించడంతోపాటు స్థానిక పోలీస్స్టేషన్లలో వారిపై రౌడీ షీట్ తెరుస్తామన్నారు. రూరల్ పరిధిలోని పరకాల, రేగొండ, ఏటూరునాగారం మండలాలకు చెందిన బెల్లం శివుడు, పోరుళ్ల సంతోష్, వలీబాబాతో పాటు అర్బన్ జిల్లా మిల్స్‌కాలనీ పోలీసు స్టేషన్ పరిధిలోని మహేందర్‌పై ఆయా పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసులు నమోదు చేయడంతోపాటు వారిపై రౌడీషీట్ తెరిచినట్టు పేర్కొన్నారు. నల్లబెల్లం నియంత్రణ కోసం పోలీసు శాఖ తరపున ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. గతంలో ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై నిఘా పెట్టడంతోపాటు గ్రామాల్లో గుడుంబా త యారీ కేంద్రాలపై దాడులు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ప్రజలు కూడా తమవంతు సహకారం అందించాలని కోరారు. ఎవరైనా నల్లబెల్లం విక్రయిస్తున్నా, రవాణా చేస్తున్నా ఆ విషయాన్ని సమీప పోలీస్ స్టేషన్లో తెలియజేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. 100 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ పేర్కొన్నారు. -
పేదలపై కేసులు.. పెద్దల వద్ద మామూళ్లా?
వేమనపల్లి : అక్రమంగా నల్లబెల్లం, పటిక, అమ్మోనియా, అధిక ధరలకు మద్యం అమ్మతున్నా పట్టించుకోవడం లేదని ఎస్సీ కాలనీవాసులు ఎక్సైజ్ అధికారులను నిలదీశారు. పేదలు గుడుంబా కాస్తే కేసులు పెడతామంటూ భయభ్రాంతులకు గురిచేయడం ఏమిటని ప్రశ్నించారు. మండలంలోని ఎస్సీ కాలనీలో ఎక్సైజ్ ఎస్సై కిశోర్ ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించి కుమ్మరిమల్లక్క ఇంట్లో చొరబడి హైరానా చేశారు. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడవేసి బెల్లం నాన పోసి ఉంచిన కుండలను ధ్వంసం చేశారు. దీంతో కాలనీవాసులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. గుడంబా కాస్తే కేసులు పెట్టే మీరు గ్రామంలో విచ్ఛలవిడిగా అధిక ధరలకు మద్యం అమ్ముతున్నా పట్టించుకోరెందుకని నిలదీశారు. పాఠశాలల ముందు అక్రమంగా బెల్ట్‌షాపులు, సిట్టింగ్‌లు పెట్టి అధిక ధరలకు మద్యం అమ్ముతున్నా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వాగ్వాదానికి దిగారు. మహారాష్ట్రకు రోజుకు లక్షల విలువ చేసే మద్యం అక్రమంగా రవాణా చేస్తున్నా.. మామాళ్లు తీసుకుని వదిలివేస్తున్నారని ఆరోపించారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
మింగుడుపడని నల్ల బెల్లం
=ముసురుకున్న వివాదాలు =వ్యాపారులపై ఎక్సైజ్ పోలీసులుహడావుడి =అనకాపల్లి మార్కెట్లో నిలిచిపోయిన లావాదేవీలు =శాశ్వత పరిష్కారానికి రైతుల డిమాండ్ అనకాపల్లి,న్యూస్‌లైన్: నల్లబెల్లం వివాదం మళ్లీ తెరమీదకు వచ్చింది. ప్రశాంతంగా సాగుతున్న దీని లావాదేవీలపై ప్రభావం కనిపిస్తోంది. దీంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి మార్కెట్లో సోమవారం అమ్మకాలు,కొనుగోలు నిలిచిపోయాయి. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న ఈ సమస్య పరిష్కారంలో పాలకుల్లో చిత్తశుద్ధికొరవడి రైతులు నష్టపోతున్నారు. వాస్తవానికి బెల్లం రంగును ఎవరూ నిర్ధారించలేరు. వాతావరణం, వంగడం,ఎరువుల వినియోగం, భూసారం, బెల్లం వండే విధానాలు రంగును ప్రభావితం చేస్తాయి. కావాలని ఏ రైతూ నల్లబెల్లాన్ని తయారు చేయడు. ఇక్కడి మార్కెట్లో బెల్లాన్ని రంగునుబట్టి కేటగిరి వారీగా క్రయ విక్రయాలు జరుపుతారు. నల్లబెల్లాన్ని మూడోరకంగా గుర్తిస్తారు. గతంలో ఈ రకంపై ఎక్సైజ్ పోలీసులు ఆంక్షలు విధించినప్పుడు, దాని రవాణాను అడ్డుకున్నప్పుడు వర్తకులు సంఘటితంగా పోరాడిన సందర్భాలున్నాయి. మళ్లీ ఇప్పుడు ఇదే అంశం వివాదస్పదమవుతోంది. నల్లబెల్లం వివరాలు చెప్పాలని, ఎవరికి అమ్ముతున్నారో తెలపాలంటూ ఎక్సైజ్ అధికారులు వివిధ జిల్లాల్లోని బెల్లం మార్కెట్‌యార్డులలో లావాదేవీలు జరిపే వర్తకులకు తాఖీదులు పంపారు. దీనికి తోడు నల్లబెల్లంతో తయారుచేసే సారాను సాకుగా చూపి వర్తకులపై సైతం కేసులు నమోదుకు అత్యుత్సాహం చూపడంతో వర్తకులు మండిపడుతున్నారు. ఈమేరకు అనకాపల్లి మార్కెట్లో సుమారు రెండువేల క్వింటాళ్ల బెల్లం లావాదేవీలు సోమవారం నిలిపివేశారు. యార్డు అంతా వెలవెలబోయింది. ఇప్పటికే భారీ వర్షాలు, వరదలు కారణంగా ఈ మార్కెట్లో పలుమార్లు లావాదేవీలకు ఆటంకం ఏర్పడింది. ఇదిలా ఉండగా అనకాపల్లి మార్కెట్‌యార్డులో గతేడాది నుంచి నల్లబెల్లం కొనుగోలుకు మార్క్‌ఫెడ్ నిర్ణయించింది. క్వింటా రూ.2700లకు కొనుగోలు చేస్తే మార్క్‌ఫెడ్‌కు కోనుగోలు ధర తగ్గుతుంది. రైతులకు గిట్టుబాటు ధరతో మేలు చేసినట్లు ఖ్యాతి దక్కుతుంది. తక్షణం మార్క్‌ఫెడ్ అధికారులు స్పందించి నల్లబెల్లం సమస్యను పరిష్కారించాలని వర్తకులు, రైతులు కోరుతున్నారు. నల్లబెల్లం మొత్తం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి... అనకాపల్లి అగ్రికల్చరల్ మార్కెట్‌యార్డుకు వచ్చిన నల్లబెల్లం మొత్తం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని వర్తకుల సంఘం ప్రతినిధులు ఏఎంసీ అధికారులకు సోమవారం లేఖ అందజేశారు. రైతుల నుంచి రెండు శాతం లోపే నల్లబెల్లం సేకరిస్తున్నామని,ఎక్సైజ్ అధికారుల పోకడలతో లావాదేవీలు నిలిచిపోయి రైతులు నష్టపోయే ప్రమాదముందని అందులో పేర్కొన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నల్లబెల్లం కొనుగోలు చేస్తే భవిష్యత్‌లో లాభం చేకూరుతుందన్నారు. ఈ లేఖను హైదరాబాద్‌లోని ఎక్సైజ్ కమిషనర్, మార్క్‌ఫెడ్ అధికారులు, జిల్లా కలెక్టర్,అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఫెడరేషన్ ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ వారికి పంపుతున్నట్టు ఏఎంసీ అధికారులు తెలిపారు.