ఇటీవల కేసముద్రం రైల్వే స్టేషన్‌లో పట్టుబడిన బెల్లం బస్తాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పల్లెల్లో మళ్లీ గుడుంబా గుప్పుమంటోంది. పునరావాసం అందనివారు పొరుగు రాష్ట్రాల నుంచి నల్లబెల్లం, పటిక దిగుమతి చేసుకుని సారా బట్టీలు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వరుసగా పట్టుబడుతున్న టన్నుల కొద్దీ నల్లబెల్లం, పటిక నిల్వలు గుడుంబా మళ్లీ విజృంభిస్తోందన్న వాస్తవాన్ని బయటపె డుతున్నాయి. ఏపీ నుంచి రైళ్లలో, మహారాష్ట్ర నుంచి రోడ్డు మార్గంతో నల్లబెల్లం రాష్ట్రంలోకి వస్తోందని అధికారవర్గాలు గుర్తించాయి.
గట్టి చర్యలు చేపట్టినా..
రాష్ట్రాన్ని గుడుంబా రహితం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టి చర్యలే తీసుకు న్నారు. నాటుసారా తయారీపై ఎక్సైజ్, పోలీ సు సిబ్బంది దాడులు చేశారు. చాలా మంది గుడుంబా తయారీదారులను పట్టుకుని కేసు లు పెట్టారు. నల్లబెల్లం సరఫరాను నియం త్రించారు. గుడుంబా జీవనాధారంగా బతికే కుటుంబాల వారికి పునరావాసంగా ప్రత్యా మ్నాయ ఉపాధి కోసం రూ.2 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించే కార్యక్రమా న్నీ చేప ట్టారు. ఐదారు నెలల్లోనే గుడుంబా నియం త్రణలోకి వచ్చింది. కానీ, రాష్ట్రంలో చాలా మందిని పునరావాస సాయం కోసం ఎంపిక చేయలేదు, ఎంపికైనవారిలో పలు వురికి సా యం అందకపోవడంతో మళ్లీ గుడుంబా తయారీవైపు మరలినట్టు తెలుస్తోంది.
రైలు, రోడ్డు మార్గాల్లో నల్లబెల్లం..
పొరుగు రాష్ట్రాల్లో నిషేధం లేక పోవడంతో తక్కువ ధరకే నల్లబెల్లంపై అందుబాటులో ఉంది. ఏపీలోని గుంటూరు, నెల్లూరు, గోదా వరి జిల్లాల నుంచి ఉమ్మడి ఖమ్మం, వరం గల్, నల్లగొండ జిల్లాలకు అక్రమంగా రవాణా అవుతోంది. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు రోడ్డు మార్గంలో నల్లబెల్లం వస్తోంది. ఏపీ నుంచి రైళ్లలో రోజూ 50 టన్నుల వరకు నల్ల బెల్లం అక్రమరవాణా అవుతున్నట్టు నిఘా వర్గాల అంచనా. ఇటీవలే మహారాష్ట్ర నుంచి 11 క్వింటాళ్ల నల్లబెల్లం, 50 కేజీల పటికను తరలిస్తున్న వాహనాన్ని ఆదిలాబాద్ జిల్లా సిర్పూరు(టి)–కౌటాల రహదారిపై ఎౖMð్సజ్ అధికారులు పట్టుకోవడం గమనార్హం. గుం టూరు జిల్లా బాపట్ల నుంచి పద్మావతి ఎక్స్ ప్రెస్‌లో తీసుకువస్తున్న 10 టన్నుల బెల్లాన్ని కేసముద్రం వద్ద రైల్లోనే పట్టుకున్నారు.
యువకులు బృందాలుగా మారి..
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల వారు కొందరు బృందాలుగా ఏర్పడి నల్లబెల్లాన్ని తీసుకువస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో తక్కువ ధరకు బెల్లం కొంటు న్నారు. ఒక్కొక్కరు ఒక్కో క్వింటాల్ బెల్లాన్ని బస్తాల్లో తీసుకుని సాధారణ ప్రయాణీకుల్లా రైలు ఎక్కుతున్నారు. తమ గమ్యస్థానం సమీపించగానే రైల్లోంచి బెల్లం మూటలను కిందికి తోసేస్తున్నారు. అప్పటికే అక్కడ వేచి ఉండే మరికొందరు.. ఆ బెల్లాన్ని ఆటోలు, ఇతర వాహనాల ద్వారా గ్రామాలకు తీసుకెళ్లి రెండింతల ధరకు విక్రయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment