అశ్వరావుపేట: ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు పలు దుకాణాలలో సోదాలు నిర్వహించారు. దుకాణాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 2 క్వింటాళ్ల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. నల్లబెల్లన్ని అమ్ముతున్న ముగ్గురు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. పట్టు బడిన బెల్లాన్ని ఎక్సైజ్ అధికారులకు అప్పగించనున్నట్టు పోలీసులు తెలిపారు.