నల్లబెల్లం పక్కదారి పట్టకుండా చూడండి
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: నల్లబెల్లం పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఉద్దేశించిన మార్గదర్శకాలను తప్పక అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లబెల్లం విక్రయాలు పక్కదారి పడుతున్నాయని, దీంతో సారా తయారీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన స్వామిదాస్ హైకోర్టులో గత ఏడాది పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం విచారించిన ధర్మాసనం ప్రభుత్వానికి పై మేరకు ఆదేశాలు జారీచేసింది.