టి.సుండుపల్లి మండలం కుప్పగుట్టపల్లి శివార్లలోని నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు.
టి.సుండుపల్లి మండలం కుప్పగుట్టపల్లి శివార్లలోని నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 1200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారీదారులు అధికారుల రాకతో పరారయ్యారు. ఈ దాడుల్లో రాయచోటి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, ఈఎస్‌టీఎఫ్ కడప ఇన్‌స్పెక్టర్ వెంకట రమణలు తమ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు.