4500 లీటర్ల పానకం,85 లీటర్ల నాటుసార ధ్వంసం
ఖిల్లాఘనపురం : ఖిల్లాఘనపురం మండలంలోని పలు తండాలు,గ్రామాలలో దాడులు నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు నాటుసారా, బెల్లం పానకం ధ్వంసం చేశారు. అప్పారెడ్డిపల్లి, మామిడిమాడతం డా, జంగమాయపల్లి ఎర్రగట్టుతండాలలో వనపర్తి సీఐ నారాయణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహిం చి నట్లు ఎక్సైజ్ ఎస్సై బాల్‌రాజు తెలిపారు. బెల్లం బట్ల కుండలు,డ్రమ్ముల్లో ఉంచిన పానకం ఇ ండ్లలో దాచిన నాటుసారాను ధ్వంసం చేశామన్నారు.
మొత్తం 4500 లీటర్ల బెల్లం పానకం, 85 లీటర్ల నాటుసారను పారబోసి 9 కేసులు నమోదు చేశామన్నారు. అప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఈడిగి లలిత,ఎర్రగట్టుతండాకు చెందిన పిక్లీ పై కేసులు నమోదు చేశామని వివరించారు. నాటుసార తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ దాడులలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది నాగేశ్వర్‌రెడ్డి, తిరుపతి, బంతిలాల్, శ్రీనునాయక్, వహీదాబేగం తదితరులు పాల్గొన్నా రు.
కొనసాగుతున్న ఎక్సైజ్ దాడులు
Published Wed, Sep 9 2015 11:43 PM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement
Advertisement