
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుట్కా అమ్మకంపై నిషేధమున్నా.. విచ్చలవిడిగా వాటి విక్రయం జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ సూర్యాపేటకు చెందిన గృహిణి సీహెచ్ ప్రమీల రాసిన లేఖపై హైకోర్టు స్పందించింది. లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణిస్తూ పిల్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కమిటీలోని న్యాయమూర్తులందరూ లేఖను పిల్‌గా పరిగణించేందుకు పూర్తి అర్హమైనదని ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో హైకోర్టు రిజిస్ట్రీ ఈ లేఖను పిల్‌గా మలిచింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య శాఖల ముఖ్య కార్యదర్శులు, డీజీపీని ప్రతివాదులుగా చేర్చారు. మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) నేతృత్వంలోని ధర్మాసనం విచారించే అవకాశముంది. రాష్ట్రంలో గుట్కా, గుడుంబా విక్రయంపై నిషేధం అమలు కావట్లేదని, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటూ ప్రమీల గత నెల 10న హైకోర్టుకు లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment