అశ్వారావుపేట : ఖమ్మం జిల్లాలో అక్రమంగా గుడుంబా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 100 లీటర్ల గుడుంబా, ఓ ఆటో, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. అశ్వారావుపేటలో రోజూ వారీ చేసే తనిఖీల్లో గుడుంబా అక్రమ రవాణా బయటపడింది. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.