గుడుంబాను నిర్మూలించాలి | remove to gudumba in rural said kadiyam | Sakshi
Sakshi News home page

గుడుంబాను నిర్మూలించాలి

Published Wed, Jul 19 2017 2:00 AM | Last Updated on Tue, Sep 5 2017 4:19 PM

గుడుంబాను నిర్మూలించాలి

గుడుంబాను నిర్మూలించాలి

తయారీ, అమ్మకందారులకు రూ.2లక్షలతో
ప్రత్యామ్నాయ ఉపాధి
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి


వరంగల్‌ రూరల్‌: గుడుంబాను సమూలంగా నిర్మూలించాలని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం గుడుంబా బాధిత కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కింద వివిధ యూనిట్లను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ వేలాది కుటుంబాలు రోడ్డు పాలవడానికి కారణమైన గుడుంబా తయారీ, విక్రయం, వినియోగాన్ని అరికట్టాలన్నారు. గతంలో గుడుంబా నిర్మూలనకు చర్యలు తీసుకున్నామని, పలు ప్రాంతాలను గుర్తించి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టినట్టు పేర్కొన్నారు. గుడుంబా ఆధారిత కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధికి రూ.2లక్షల విలువైన ఒక్కో యూనిట్‌ మంజూరు చేశామని చెప్పా రు.

లబ్ధిదారులు మళ్లీ ఆ వ్యాపారానికి మరలకుండా పర్యవేక్షించాలని ఎక్సైజ్‌ అధికారులు, కలెక్టర్‌కు  సూచించారు. రాష్ట్రంలో 90శాతం పేద, బడు గు, బలహీన వర్గాలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. ఇందుకుగాను రూ.40వేల కోట్లు, వెచ్చిస్తున్నదని పేర్కొన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఎంపిక చేసిన 123 మంది ఎస్సీ గుడుంబా ఆధారిత కుటుంబాలలో 50 మందికి మంగళవారం గొర్రెలు, బర్రెలు, ఆటోట్రాలీలు, ఆటోలు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో గ్రేటర్‌ వరంగల్‌ నగరపాలక సంస్థ మేయర్‌ నరేంద ర్, జెడ్పీ చైర్‌పర్సన్‌ గద్దల పద్మ, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, టి.రాజయ్య, రూరల్, అర్బన్‌ కలెక్టర్లు వరంగ ల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటి ల్, అమ్రపాలి కాట, నగర పోలీస్‌ కమిషనర్‌ జి.సుధీర్‌బాబు, గ్రేటర్‌ వరంగల్‌ నగరపాలక సంస్థ కమిషనర్‌ శృతి ఓజా, మాజీ ఎంపీ గుండు సుధారాణి, రూరల్‌ జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement