నాణ్యమైన విద్య అందిస్తాం | vision for quality education | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్య అందిస్తాం

Published Wed, Apr 27 2016 4:35 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

నాణ్యమైన విద్య అందిస్తాం - Sakshi

నాణ్యమైన విద్య అందిస్తాం

విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం
అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూసేలా చేసిన ఘనత కేసీఆర్‌దే

డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి

మేడ్చల్ రూరల్ :  రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. మం గళవారం మేడ్చల్ మండలం గిర్మాపూర్‌లో ప్రభుత్వ పాలిటెక్నిక్ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పాకొ ని చెరువులో మిషన్ కాకతీయ రెండో దశ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పాల కుల హయాంలో ధ్వంసం అయిన విద్యావ్యవస్థను సరైన దారిలో పెట్టేం దుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

అంబేద్కర్ 125వ జయుంతి సందర్భంగా ఆయున స్పూర్తిని, ఆశయూలను బావితరాలకు అందించాలని సీఎం హైదరాబాద్‌లో 125అడుగుల ఎత్తుగల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేశాన్నారు. అదే రోజున దళిత,పేద విద్యార్ధుల కోసం ఈ సంవత్సరంనుంచే 240 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయూలని ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికీ చాలా పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని శ్రీహరి అన్నారు. వాటి పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నా రు. మిషన్ కాకతీయు, మిషన్ భగీరథ వంటి ఎన్నో కార్యక్రవూలతో ఇతర రాష్ట్రాలు తెలంగాణవైపు చూసేలా చేసి న ఘనత సీఎంకే దక్కుతుందన్నారు.

జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా: వుంత్రి వుహేందర్‌రెడ్డి
రాష్ట్రంలో ఏ జిల్లాకు రానంతగా రంగారెడ్డి జిల్లాకు ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేశానని వాటితో జిల్లాలో పనులు చేపట్టి జిల్లాను అబివృద్ధిలో ముందుంచుతానని రాష్ట్ర రోడ్డు, రవా ణాశాఖ మంత్రి వుహేందర్‌రెడ్డి అన్నా రు. మిషన్ కాకతీయు,మిషన్ భగీరథ లాంటి కార్యక్రవూలతో సీఎంగా రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా వూర్చుతున్నారన్నారు. మిషన్ భగీర థ ద్వారా మరో నెల రోజుల్లో మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు తాగునీరు అందించనున్నట్లు తెలిపారు.

వురో మూడేళ్లలో జిల్లాలోని అన్ని గ్రావూలకు గోదావరి జలాలు అందేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రవుంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఈ వెంకటేశం, డీఈ వెంకటరవుణ, మేడ్చల్ ఎంపీపీ విజయులక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు శైలజ, వైస్ ఎంపీపీ భవాని, ఘట్‌కేసర్, శామీర్‌పేట్ ఎంపీపీలు శ్రీనివాస్‌గౌడ్, చంద్రశేఖర్‌యూదవ్, ఇరిగేషన్ ఏఈ నర్సయ్యు, ఎంపీడీఓ దేవసహా యుం, తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, ఈఓ పీఆర్డీ జ్యోతిరెడ్డి, సర్పంచ్ నవనీత, ఎంపీటీసీ సభ్యురాలు రజిత, టీఆర్‌ఎస్ నాయకులు భాస్కర్‌యూదవ్, సత్యనారాయుణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement