సాక్షి, హైదరాబాద్ : పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి ప్రభుత్వ పాఠశాలల్ని పటిష్టం చేయాలని మంత్రి కడియం శ్రీహరి అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని, అన్ని స్కూళ్లకు మిషన్ భగీరథ ద్వారా నల్లా నీరు అందిస్తామన్నారు.
కడియం శ్రీహరి శుక్రవారమిక్కడ మాట్లాడుతూ...విద్యార్థినులకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్‌ను పంపిణీ చేస్తామని, స్కూల్ గ్రాంట్లను 12 నెలలకు పెంచుతామన్నారు. ఉపాధ్యాయుల సంఖ్యను కూడా పెంచే అంశం పరిశీలనలో ఉందని కడియం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment