governament school
-
సర్కారుబడులు.. కార్పొరేట్ హంగులు
పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, యూనిఫామ్‌లు జిల్లాలో 6నుంచి 10వ తరగతి విద్యార్థులకు 2.57 లక్షలు నోట్‌పుస్తకాలు కేటాయించారు. జిల్లాకు 50వేలు నోట్ పుస్తకాలు చేరడంతో బెల్లంపల్లి ప్రభుత్వ పాఠశాల, దండేపల్లి మండలం మామిడిపల్లి, కోటపల్లి మండలం పారిపల్లి పాఠశాలల్లో విద్యార్థులకు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. 4,32,243 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా ఇప్పటివరకు 2,81,160 పుస్తకాలు చేరాయి. జిల్లాలో 50,032 మంది వి ద్యార్థులకు అవసరమైన 2,32,750 మీటర్ల ముడి వస్త్రం చేరింది. ఇందులో 80శాతం మేర యూనిఫామ్‌లు పూర్తయిన వాటిని విద్యార్థులకు అందించనున్నారు. 149 ప్రాథమిక, మూడు ప్రాథమికోన్నత పాఠశాలల్లో లైబ్రరీలు ఏర్పాటు కానున్నాయి. మంచిర్యాలఅర్బన్: మన ఊరు–మన బడి కార్యక్రమంలో భాగంగా సర్కారు బడుల్లో కార్పొరేట్ తరహాలో ఆధునిక అందుబాటులోకి వస్తున్నాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యాదినో త్సవాన్ని పురస్కరించుకుని అన్ని హంగులతో తీర్చి దిద్దిన 12పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఇ ప్పటికే 35 పాఠశాలల్లో 18 మొదలయ్యాయి. రెండు జతల యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు అందించనున్నారు. తెలంగాణ సేట్ టెక్నోలా జికల్ సర్వీసెస్ సాయంతో ఎంపిక చేసిన పాఠశాలల్లో డిజిటల్ బోధన అమలుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఐఎఫ్ ఎస్(ఇంటరాక్టివ్ ఫ్లాట్ స్క్రీన్) టీవీల ద్వారా ఆన్లైన్, ఆఫ్‌లైన్ బోధనకు ఏర్పాట్లు చేశారు. విద్యాది నోత్సవం సందర్భంగా విద్యార్థుల ర్యాలీలు, తల్లి దండ్రులను ఉద్దేశించి ఉత్తరాల పంపిణీ, గ్రామాల్లో వీధి నాటకాలు, జాతీయ జెండా ఆవిష్కరణ, పదేళ్లలోపు పురోగతిపై ప్రసంగం, తెలంగాణలో పాఠశాల విద్య, విజన్ కార్యకలాపాలపై వివరిస్తారు. పాఠశాలలకు సేవలందించిన ముగ్గురు దాతలను సన్మానిస్తారు. 10మంది హెచ్ఎంలు, 15 మంది ఉపాధ్యాయులు, ఐదుగురు ఎస్ఎంసీ చైర్మన్, ఐదుగురు పేరెంట్స్, 12 మంది 10 జీపీఏ సాధించిన విద్యార్థులను సత్కరిస్తారు. జిల్లాలో ఇలా.. మన ఊరు–మనబడిలో 248 పాఠశాలలు ఎంపిక చేశారు. ఇందులో 31 బడులను అన్ని హంగులతో తీర్చిదిద్దగా మరో 12 మంగళవారం ఎమ్మెల్యేలు, అధికారులు ప్రారంభించనున్నారు. మందమర్రి(దీపక్‌నగర్), జైపూర్ మండలం దోరగాపల్లి, పవనూర్(హరిజనవాడ), కోటపల్లి మండలం మల్లంపేట్, పారిపల్లి హైస్కూల్, దండేపల్లి పీఎస్, ఉన్నత పాఠశాలలు, బెల్లంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఎంపీపీఎస్ నీల్వాయి, కుశ్నపల్లి, కాసిపేట మండలం సోనాపూర్, మంచిర్యాల పట్టణంలోని న్యూగర్మిళ్ల పాఠశాలలు లాంఛనంగా ప్రారంభిస్తారు. -
ఈసారీ సర్దుబాటేనా..?
భైంసాటౌన్: బడిగంట మోగింది.. జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో విద్యాశాఖ ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించింది. ఆయా ప్రభుత్వ పాఠశాలల పరిధిలో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలంటూ ప్రచారం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలతో విద్యాబోధన ఎలా చేస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదివరకు ఉపాధ్యాయ ఖాళీల స్థానంలో ప్రభుత్వం ఏటా విద్యావలంటీర్లను నియమించేది. 2020 నుంచి ప్రభుత్వం వీవీలను విధుల్లోకి తీసుకోవడం లేదు. దీంతో గతేడాది ఉపాధ్యాయ ఖాళీలను వర్క్ అడ్జస్ట్మెంట్ పేరిట తక్కువ విద్యార్థులున్న పాఠశాలల నుంచి ఎక్కువ విద్యార్థులున్న పాఠశాలలకు డిప్యూటేషన్‌పై కేటాయించారు. ఈసారి కూడా ఖాళీల్లో సర్దుబాటు చేస్తారా.. అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. బడిబాటలో భారీగా విద్యార్థుల నమోదు.. ఈనెల 3 నుంచి ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం చేపట్టగా, శనివారం నాటికి జిల్లా వ్యాప్తంగా 3,661 మంది విద్యార్థుల నూతన ప్రవేశాలు నమోదయ్యాయి. వీటిలో 1,257 మంది ప్రైవేట్ పాఠశాలల నుంచి నమోదైనవారే ఉన్నారు. మన ఊరు – మన బడి కింద ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించిన సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం కింద అందిస్తున్న పోషకాహారం, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, తదితర ప్రయోజనాలపై వివరిస్తున్న ఉపాధ్యాయులు ఖాళీల విషయమై ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నూతనంగా విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల సంఖ్యకనుగుణంగా ఉపాధ్యాయులు లేని పరిస్థితి నెలకొంది. సబ్జెక్టు టీచర్లేరి..? జిల్లాలో 735 ప్రభుత్వ పాఠశాలల్లో 2022–23 విద్యాసంవత్సరంలో 49,943 మంది విద్యార్థులు ఉండగా, మన ఊరు – మన బడి కింద రూ.120 కోట్లతో 260 పాఠశాలలను ఎంపిక చేసి పనులు చేపట్టారు. వీటిలో 126 పాఠశాలల్లో పనులు పూర్తి చేసుకున్నాయి. కాగా, జిల్లావ్యాప్తంగా మొత్తం 521 ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా, చాలా పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేరు. దీంతో ఒక సబ్జెక్టు టీచర్‌తో మరో సబ్జెక్టు బోధించడం, ఆంగ్ల, తెలుగు మాధ్యమాలకు ఒకే టీచర్ ఉండడంతో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ప్రభావం చూపే అవకాశముంది. గతంలో ప్రభుత్వం ఏటా ఉపాధ్యాయ ఖాళీల్లో విద్యావలంటీర్లను నియమించి విద్యాబోధనలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టేది. 2020 నుంచి ప్రభుత్వం విద్యావలంటీర్లను విధుల్లోకి తీసుకోవడం లేదు. ఇతర పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ నెట్టుకొస్తున్నారు. జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలిలా... సబ్జెక్ట్ మంజూరు ఖాళీలు గణితం (ఎస్ఏ) 191 16 భౌతికశాస్త్రం (ఎస్ఏ) 180 07 జీవశాస్త్రం (ఎస్ఏ) 164 32 సాంఘికశాస్త్రం (ఎస్ఏ) 183 75 తెలుగు (ఎస్ఏ) 67 13 హిందీ (ఎస్ఏ) 42 12 ఇంగ్ల్లిష్ (ఎస్ఏ) 167 01 ఉర్దూ (ఎస్ఏ) 11 05 హిందీ (ఎల్పీ) 96 01 మరాఠీ (ఎల్పీ) 02 02 ఉర్దూ (ఎల్పీ) 07 01 ఎస్జీటీలు 1,478 231 భైంసా పట్టణంలోని పిప్రి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గతేడాది 232 విద్యార్థులు ఉండగా, ఆరుగురు ఉపాధ్యాయులు ఉండాలి. కానీ, ఇద్దరు మాత్రమే రెగ్యులర్ ఉపాధ్యాయులుండగా, మరో ఇద్దరిని డిప్యూటేషన్‌పై కేటాయించారు. మన ఊరు – మనబడిలో భాగంగా ప్రస్తుతం రెండు తరగతి గదులతో నూతన భవన నిర్మాణం చేపడుతున్నారు. భెంసాలోని ఏపీనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దాదాపు 250 మంది విద్యార్థులున్నారు. ఈ పాఠశాలలో ఇద్దరు మాత్రమే రెగ్యులర్ ఉపాధ్యాయులున్నారు. మిగిలిన సబ్జెక్టులకు నలుగురిని డిప్యూటేషన్‌పై కేటాయించారు. గతేడాది ఫిజికల్ సైన్స్ బోధించే ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు తరగతులు నష్టపోయారు. కాగా, ఈసారి కూడా ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తారా.. లేదా.. అన్నది వేచిచూడాలి. ఇబ్బందులు లేకుండా చర్యలు పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో విద్యార్థులు ఉండి, అసలే ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు సర్దుబాటు చేస్తున్నాం. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేని చోట ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ఉపాధ్యాయ ఖాళీల స్థానంలో సర్దుబాటు విషయమై స్పష్టత రావాల్సి ఉంది. – రవీందర్‌రెడ్డి, డీఈవో -
జగనన్న విద్యాకానుక కిట్టు.. విద్యార్థులు అదిరేట్టు
రాప్తాడురూరల్: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ విద్యకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. నాడు–నేడు కార్యక్రమంతో ప్రతి ప్రభుత్వ పాఠశాలకు లక్షలాది రూపాయలు వెచ్చించి మౌలిక వసతులు కల్పించారు. కొత్త భవనాలు, మరుగుదొడ్లు, తరగతి గదులు, పెయింటింగ్, ఫర్నీచర్ ఇలా ఒకసారి పరిశీలిస్తే కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులకు పైసా భారం పడకుండా 9 రకాల వస్తువులతో కూడిన ‘జగనన్న విద్యా కానుక’ కిట్లను 1–10 తరగతుల విద్యార్థులకు అందజేస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్స్, ఆక్స్ఫర్డ్, పిక్టోరియల్ డిక్షనరీలు, బ్యాగు, మూడు జతల యూనిఫాం, షూ, బెల్ట్ కిట్‌లో ఉంటాయి. ఇప్పటికే మూడేళ్లు కిట్లను ఇచ్చారు. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి నాల్గో విడత కిట్లను అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 1–10 తరగతుల విద్యార్థులు 2,22,212 మంది ఉన్నారు. వీరికోసం రూ. 36.66 కోట్లు ఖర్చు చేసి కిట్లు అందజేస్తున్నారు. కార్పొరేట్ విద్యార్థుల్లా.. ప్రభుత్వ విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులు ఎలాగైతే యూనిఫాం, షూ, బెల్ట్ ధరించి వెళతారో మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అదే తరహాలో వారికి ఏమాత్రం తీసిపోని విధంగా పాఠశాలలకు వెళ్తున్నారు. డ్రెస్ కోడ్‌తో పాటు ప్రతి విద్యార్థీ షూ వేసుకుంటున్నారు. ఈసారి యూ‘న్యూ’ఫాం విద్యార్థుల యూనిఫాం ఈసారి రంగు మారింది. గతంలో బాలికలకు పింక్, బ్లూ కాంబినేషన్, బాలురకు లైట్ స్కై, థిక్ బ్లూ కాంబినేషన్లో యూనిఫాం ఇచ్చేవారు. గతంలో ప్లెయిన్లో ఉండే యూనిఫాం ఈసారి బాలికలకు మాత్రం చెక్స్ కల్గినవి ఇస్తున్నారు. బ్యాగులు గతంలో ముందువైపు స్కై బ్లూ, వెనుక వైపు నేవీబ్లూ కలరు ఉండేది. ఈసారి యూనిఫాం, బ్యాగులు రంగులు మారాయి. కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగించే తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపాలంటే ఆర్థిక ఇబ్బందులతో గతంలో వెనుకడుగు వేసేవారు. ఒకవేళ పంపినా ఆ తర్వాత నోట్ పుస్తకాలు, ఇతర సామగ్రి కొనుగోలుకు అరకొర ఖర్చు కూడా భరించలేక చాలామంది డ్రాపౌట్స్‌గా మారేవారు. అయితే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. విద్యార్థులకు పుస్తకాలే కాదు... జగనన్న విద్యాకానుక రూపంలో రూ. 1,650 విలువైన సామగ్రి ఉచితంగా అందిస్తున్నారు. ఇప్పటికే మూడేళ్లు కిట్లు అందజేసిన ప్రభుత్వం.. నాలుగో సారి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేదు ప్రభుత్వ పాఠశాలల పిల్లల యూనిఫాం, షూ క్వాలిటీని ఒక ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించి ఇవ్వడం అనేది దేశంలో ఎక్కడా లేదు. కార్పొరేట్ తరహా డ్రెస్‌కోడ్‌తో తమ పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారనే ఆనందం తల్లిదండ్రుల్లో ఉంది. జగనన్న విద్యా కిట్లు చాలా నాణ్యతగా ఉంటున్నాయి. ప్రభుత్వం పిల్లల చదువు విషయంలో రాజీలేకుండా ఖర్చు చేస్తోంది. - ఎం.సాయిరామ్, ఏపీఓ, సమగ్ర శిక్ష -
బ్రేక్‌ఫాస్ట్‌తో స్కూల్ స్టార్ట్..
ఒంటరిగా ఉన్నప్పుడు కలిగే ఓ మంచి ఆలోచన కొన్ని సమూహాలకు చేరువ చేస్తుంది. అది సమాజానికి మేలు చేసే ఆలోచన అయితే ఎంతో మందికి స్ఫూర్తి సందేశాన్ని అందిస్తుంది. హైదరాబాద్ తిరుమలగిరిలో ఉంటున్న లతా మారవేణి ఆలోచన ఇప్పుడు వందలాది పేద పిల్లల ఉదయాలను ఆరోగ్యకరంగా, ఆనందకరంగా మార్చుతుంది. అదెలాగో తెలియాలంటే ఆమె చెప్పే విషయాలను మనమూ వినాలి.. ఆచరణలో పెట్టిన ఆలోచనలను తప్పక తెలుసుకోవాలి. ఆకలి, ఆనందం, వికాసం సహజంగా సర్కారు బడుల్లోనే పిల్లల ముఖాల్లో లభిస్తుందన్నది అందరికీ తెలిసిన విషయమే. లతా మారవేణి తనకు వచ్చిన చదువును పిల్లలకు పంచేందుకు స్వచ్ఛందంగా స్కూళ్లకు వెళ్లడం మొదలుపెట్టారు. అక్కడ గమనించిన విషయాలు ప్రశ్నగా మదిలో మెదిలితే తనే పరిష్కారం కూడా వెదికారు. హైదరాబాద్‌లోని అల్వాల్, యాప్రాల్‌లోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలోని 500 మంది విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్నారు లత మారవేణి. వాలంటీర్ల సాయంతో పిల్లలకు ప్రత్యేక క్లాసులు కూడా తీసుకుంటున్నారు. మూడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న లత హైదరాబాద్ సీఆర్పీఎఫ్లో సబ్ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శేఖర్ మారవేని అర్ధాంగి. పరిచయమైన పాఠం ‘‘మా స్వస్థలం రాజన్న సిరిసిల్లలోని గంభీరావ్‌పేట. మా వారి ఉద్యోగరీత్యా అస్సామ్‌కి వెళ్లాం. తన డ్యూటీ రోజూ పధ్నాలుగు గంటలపైనే ఉండేది. నాకు రోజంతా ఒంటరిగా అనిపించేది. అప్పుడు దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలకు వెళ్లాను. స్వచ్ఛందంగా చదువు చెబుతానని అనడంతో స్కూల్ వాళ్లు కూడా సంతోషంగా ఆహ్వానించారు. అలా రోజూ కొన్ని గంటలు స్కూల్లోనే గడిపేదాన్ని. మొదట్లో పుస్తకాలు, పెన్నులు పిల్లలకు ఇస్తుండేదాన్ని. రోజూ అలా వెళుతున్నప్పుడు గమనించిన విషయం – పిల్లల్లో చాలా మంది ఉదయం ఏమీ తినకుండానే బడికి వస్తున్నారు. మధ్యాహ్నం స్కూల్లోనే భోజనం ఉంటుంది. కొంతమంది పిల్లలు ఆ భోజనం కోసమే స్కూల్‌కి వస్తున్నారని కూడా తెలిసింది. కొన్నాళ్లు బిస్కెట్లు వంటివి ఇచ్చాను. నాతో పాటు అక్కడ పరిచయం అయినవారితో కలిసి కొంత ఎక్కువ మొత్తంలో ఉదయం పూట పిల్లలకు తినడానికి పండు, బిస్కెట్, ఎగ్ వంటివి ఇస్తుండేదాన్ని. అక్కడ రెండేళ్లు ఉన్న తర్వాత ఛత్తీస్‌గడ్‌కు ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్స్ చూశాను. ఎక్కువ మంది గిరిజన పిల్లలు. పైగా అది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. అయినా నా కార్యక్రమాలూ అక్కడి స్కూళ్లలోనూ కొనసాగించాను. కొన్నిసార్లు బెదిరింపులు కూడా వచ్చాయి. కానీ, ఆపలేదు. పిల్లలకు స్కూల్ అయిపోయాక కూడా చదువులు చెప్పడం కొనసాగించాను. అల్పాహారం తప్పనిసరి నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాం. ఓరోజు అల్వాల్, యాప్రాల్ ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లకు వెళ్లాను. డీఈఓ పర్మిషన్ తీసుకున్నాను. ఇక్కడ కూడా పిల్లల పరిస్థితి గమనించాక ఉదయం అల్పాహారం తప్పనిసరి అనిపించింది. ముందు కొన్ని రోజులు పిల్లలందరికీ పాలు ఇప్పించాను. కానీ, అవి కొందరికి పడేవి కావు. కొందరు పిల్లలు ఇష్టపడటం లేదు. దీంతో రాగి జావ, పాలు, బాదంపప్పు పొడి కలిపి ఒక్కొక్కరికి ఒక గ్లాసు చొప్పున ఇవ్వడం మొదలుపెట్టాను. దీనిని స్కూల్లో పిల్లలకు అప్పటికప్పుడు తయారుచేసి ఇస్తుంటాం. ఇది పిల్లలకు బలవర్ధకం. నాలుగు గంటలసేపు వారి ఆకలికి తట్టుకునే శక్తికూడా ఉంటుంది. ఇది క్రమంగా పెంచుతూ వచ్చాం. స్కూల్ ప్రిన్సిపల్ పిల్లల శారీరక ఎదుగుదల బాగుందని గ్రోత్ రిపోర్ట్ ఇచ్చారు. శారీరక ఎదుగుదల బాగుంటే మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. మేడ్చల్‌లోని కొన్ని స్కూళ్ల నుంచి మా దగ్గర కూడా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించమని అడుగుతున్నారు. నా ఈ ఆలోచన నచ్చిన వారితో కలిసి ‘వైట్’ అనే పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాం. ఇప్పుడు మేడ్చల్‌లోని అన్ని స్కూళ్లకు చేయాలన్న ఆలోచనలో ఉన్నాను. ఈ యేడాది 1500 మందికి ఉదయం పూట బాలామృతం అందించాలని నిర్ణయించుకున్నాను. వాలంటీర్లతో కలిసి పిల్లలకు ఇంగ్లిష్, పెయింటింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం అందించడానికి క్లాసులు తీసుకుంటున్నాం. ఐటి సెక్టార్ నుంచి కూడా కొందరు స్వచ్ఛందంగా వచ్చి మా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీటితో పాటు డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలకు వెళ్లి వ్యసనాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ మా వారూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. స్కూల్ బ్రేక్ ఫాస్ట్ తోనే మొదలవుతుంది... అనే ఈ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వానికి కూడా సబ్మిట్ చేశాం’’ అని వివరించారు లతామారవేణి. – నిర్మలారెడ్డి -
కోవిడ్ నిబంధనలు పాటించకుండా పాఠశాల ఆవరణలో గ్రామసభ
-
తెలంగాణలో తెరచుకున్న బడులు
-
చంద్రబాబు అసలీ జీవో చదివారా?
ఇంగ్లిష్ వచ్చిన వాళ్లు చదివితే ఈ జీవోలో తప్పు కనిపించదు. ఇంగ్లిష్ రాకపోతేనో, అర్థం చేసుకోవడంలో లోపం ఉంటే తప్ప.. తప్పుగా అనిపించదు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే ఈ పెద్ద మనిషికి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏదీ లేదు. సాక్షి, అమరావతి : ప్రజాస్వామ్య హక్కులు కాపాడేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీవోపై చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో గురువారం 2430 జీవో రద్దుకు విపక్షాలు పట్టుబట్టిన నేపథ్యంలో సీఎం స్పందిస్తూ మాట్లాడారు. ‘ప్రభుత్వం ఇచ్చిన 2430 జీవోను రద్దు చేయాలని టీడీపీ అడుగుతున్న ధోరణి చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అసలీ జీవోను చంద్రబాబు నాయుడు చదివారా? ఒకవేళ చదివుంటే ఇంగ్లిష్ భాషను అర్థం చేసుకోవడంలో లోపం ఉందేమో! నేనోసారి జీవోను చదివి విన్పిస్తాను. ఇందులో ఎక్కడైనా, ఏదైనా తప్పుంటే మీరే ఆలోచించి చెప్పండి. (జీవో చదివి విన్పించారు) ఇందులో ఏం తప్పుందని చెబుతున్నారు. ఎక్కడైనా, ఎవరైనా అన్యాయంగా, ఉద్దేశ పూర్వకంగా, ఆధారాలు లేకుండా, తప్పుడు వార్తలు, పరువు తీసే వార్తలు వేస్తే.. అలాంటప్పుడు సంబంధిత విభాగాల కార్యదర్శులు రిజాయిండర్ జారీ చేయడం, ఫిర్యాదు చేయడం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం ఉంది. అవతల వాళ్లు ఏ తప్పులు రాసినా, టీవీల్లో తప్పులు చూపించినా, జరగనివి జరిగినట్టు చూపించినా, రాసినా.. ప్రభుత్వం, అధికారులు ఆ చెడ్డ పేరు మోస్తూ మౌనంగా ఉండాల్సిందేనా? ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్లు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కాబట్టి, వాళ్లు ఇష్టమొచ్చినట్టు చంద్రబాబు నాయుడును భుజానికెత్తుకుని మోస్తూ.. ప్రభుత్వంపై నిందలు మోపినా కూడా పడి ఉండాల్సిందేనా? న్యాయం ఉండదా? ఎవరైనా తప్పు చేస్తే, అబద్ధాలు రాస్తే నా ఇమేజ్ను నేను కాపాడుకునే స్వేచ్ఛ అది. ప్రజాస్వామ్య హక్కు. అందులో భాగంగానే రిజాయిండర్స్ ఇవ్వచ్చు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా కేసులు వేయొచ్చు’ అని సీఎం జగన్ వివరించారు. -
ఇంగ్లిష్ మీడియం మీ పిల్లలకేనా?
సాక్షి ప్రతినిధి, హైదరాబాద్/నెల్లూరు: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శల దాడి చేస్తూ వచ్చారు. ఆయనకు వంతపాడుతూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు వ్యతిరేక కథనాలు ప్రచురించాయి. ఒక రకంగా యుద్ధం ప్రకటించాయి. అయితే ఈ పత్రికల యజమానుల పిల్లలు, మనుమళ్లు మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చదువుకోవడం గమనార్హం. ఈనాడు అధినేత రామోజీరావు కుమారులు సుమన్, కిరణ్‌లు ఇద్దరూ ఇంగ్లిష్ మీడియంలోనే విద్యాభ్యాసం చేశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, లిటిల్ ప్లవర్లో వారి ప్రాథమిక విద్య కొనసాగింది. ఇక ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కుమారుడు ఆదిత్య, కూతురు అనూషలు హైదరాబాద్ ఓబుల్‌రెడ్డి స్కూల్లో ఇంగ్లిష్ మీడియంలోనే చదువుకున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి ఇంగ్లిష్‌లోనే తమ విద్యాభ్యాసం చేశారు. ఇప్పుడు మనుమడు దేవాన్‡్ష కూడా ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నాడు. వెంకయ్య అక్షర ఇంటర్నేషనల్‌లో ఇంగ్లిష్ మీడియమే.. ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడి కుమార్తెకు చెందిన స్వర్ణభారత్ ట్రస్ట్ నేతృత్వంలో నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో అక్షర విద్యాలయ పేరుతో ఇంటర్నేషనల్ స్కూలు నిర్వహిస్తున్నారు. 2011 నుంచి ఈ స్కూలులో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన చేస్తున్నారు. ప్రస్తుతం 2019–20 విద్యా సంవత్సరంలో 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ స్కూల్‌కు వెంకయ్యనాయుడి కుమార్తె దీపా వెంకట్ కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఇంగ్లిష్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కుమారుడు హర్షవర్ధన్, కుమార్తె దీపా వెంకట్ పిల్లలు మొదటి నుంచి ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నారు. హర్షవర్ధన్ కుమార్తెలు వైష్ణవి, నిహారికల ప్రాథమిక విద్యాభ్యాసం ఢిల్లీలోనే సాగింది. వీరిలో ఒకరు ప్రస్తుతం సింగపూర్‌లో చదువుతుండగా, మరొకరు ఢిల్లీలో విద్యాభ్యాసం చేస్తున్నారు. దీపా వెంకట్ కుమారుడు విష్ణు ఆస్ట్రేలియాలో చదువుతుండగా.. కుమార్తె సుష్మ ఢిల్లీలో చదువుతున్నారు. -
ఇంగ్లిష్ మీడియంకు వ్యతిరేకం కాదు : చంద్రబాబు
సాక్షి, అమరావతి : ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడానికి తాము వ్యతిరేకం కాదని, తాము కూడా సమర్థిస్తున్నామని, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీలో గురువారం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 2017లోనే తాము బ్రిటీష్ కౌన్సిల్‌తో అవగాహనా ఒప్పందం చేసుకుని లక్ష మంది విద్యార్థులకు ఇంగ్లిష్‌లో శిక్షణ ఇచ్చామని చెప్పారు. దీనిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కలుగజేసుకుని లక్ష మందికి శిక్షణ పేరుతో ముందుగానే డబ్బు చెల్లించారని, 30 వేల మందికి కూడా శిక్షణ ఇవ్వలేదని, ఇది పెద్ద బోగస్ అని అన్నారు. దీనిపై విచారణ చేయిస్తామని చెప్పారు. తాము ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు సాక్షిలో వ్యతిరేకంగా వార్తలు రాశారని చంద్రబాబు అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. పత్రికల్లో వచ్చిన వార్తలు కాదని, అలా అంటే నీ పాంప్లెట్ పేపర్ ఈనాడులో వచ్చిన వార్తల గురించి చాలా చెప్పాల్సి ఉంటుందన్నారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి పేపరు, చానెల్ (టీవీ) ఉన్నాయని, టీఆర్ఎస్ పార్టీకి పేపరు, చానెల్ ఉందని, శివసేన పార్టీకి సామ్నా పత్రిక ఉందని, తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఒక్క పేపరుగానీ, ఒక్క చానెల్‌గానీ లేదన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా సభ్యులంతా నవ్వుకున్నారు. -
పేదల జీవితాల్లో మార్పు కోసమే ఇంగ్లిష్ మీడియం
సంతోషం.. ఇప్పటికైనా చంద్రబాబు యూటర్న్ తీసుకుని ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. నారా లోకేష్‌ను ఎక్కడ చదివించారు? మనవడిని ఏ మీడియమ్‌లో చదివిస్తున్నారు? అచ్చెన్నాయుడి కొడుకును ఏ మీడియంలో చదివించారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలను అడుగుతున్నా.. వాళ్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు చదువుతున్నది ఇంగ్లిష్ మీడియంలో కాదా? ఈనాడు యాజమాన్యం నడిపే స్కూల్ కూడా ఇంగ్లిష్ మీడియమే.– సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పేదల జీవితాలు మార్చడం కోసమే ఇంగ్లిష్ మీడియం విద్య ప్రవేశపెట్టామని, దేశం మొత్తం గర్వపడేలా ఈ విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. నిరుపేద కుటుంబాల పిల్లలు కూడా బాగా చదువుకుని అన్ని రంగాలలో ఎదగాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు. ‘రైట్ టు ఇంగ్లిష్ మీడియం’ అన్నది ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై అసెంబ్లీలో గురువారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఇంగ్లిష్ మీడియంపై ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు యుద్ధం ప్రకటించిన తీరును, ఆ తర్వాత ప్రజల నుంచి తిరుగుబాటు రావడంతో యూటర్న్ తీసుకున్న తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే.. ఇంగ్లిష్ మీడియం జీవోపై చంద్రబాబు విమర్శలు దేశం మొత్తం గర్వపడేలా మన రాష్ట్రం ఒక్కటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను తీసుకువచ్చే కార్యక్రమం చేసింది. ఇందుకు సంబంధించి గత నెల 5వ తేదీన జీఓ జారీ చేశాం. ఈ జీఓపై విపక్ష నేత చంద్రబాబు పలు విమర్శలు చేశారు. ‘సాక్షి’లో రాస్తే అది మీ మైండ్‌సెట్ కాదా? అంటున్నారు. ఈనాడు పేపర్ చంద్రబాబు నాయుడును ఈ రోజు వరకు కూడా మోస్తూనే ఉంది. ఆంధ్రజ్యోతి, టీవీ ఛానళ్ల గురించి నేను చెప్పాల్సిన పని లేదు. కానీ, మాకు ఏ పేపరూ లేదు.. ఏ టీవీ లేదు.. అంటూ వీళ్లు ఏ రకంగా మోసం చేస్తున్నారన్న సంగతి రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడలేదనుకుంటుందట. అలా వీరు కూడా అంతే. ఇంగ్లిష్ మీడియంపై గత నెల 6వ తేదీ నుంచి ‘ఈనాడు’ యుద్ధం ఇలా.. ► 6వ తేదీన ‘తెలుగు చదువులకు చెల్లు చీటి’ అని రాశారు. ► 7వ తేదీన ఈనాడు, చంద్రబాబు కలిసి యుద్ధం ప్రకటించారు. అది ఒక సామాజికవర్గ దాడి అని కూడా చెప్పవచ్చు. మామూలుగా జరగలేదు ఆ దాడి. అదే రోజు ‘ఇక ఆంగ్లప్రదేశ్’ అని రాశారు. ► 8వ తేదీన ‘తెలుగు జాతి మనుగడకే ముప్పు’ అంటూ.. ‘అశాస్త్రీయం.. అధికార భాష సంఘం ఏం చేస్తోంది? సర్కారు బడుల్లో ఆంగ్ల భాష నిర్ణయంపై గళమెత్తిన భాషావేత్తలు’ అని అక్కకు వెళ్లగక్కారు. ► 9వ తేదీన ‘అంపశయ్యపై అమ్మ భాష’ అని ఎడిటోరియల్. భాషను కాపాడుకోకుంటే తెలుగు జాతి ఉనికిని కోల్పోతుందని చంద్రబాబునాయుడు స్టేట్మెంట్.. ‘తెలుగు మాధ్యమం తప్పనిసరి’ ఇంటూ ఆయన కొడుకు స్టేట్మెంట్. ► 11వ తేదీన ‘మాతృభాషను విస్మరిస్తే అనర్థాలు తప్పవు’. ఇందుకు వెంకయ్యనాయుడు వత్తాసు.. ప్రాంతీయ భాషలోనే విద్యాబోధన జరగాలి.. ఈ విషయంలో ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని. ఇదే రోజు ‘తెలంగాణ సీఎంను చూసి నేర్చుకోండి. తెలుగు విలువ తెలిస్తే వైకాపా నేతలు అలా చేయరు’ అంటూ చంద్రబాబు పార్టీకి సంబంధించిన ఒక యాక్టర్ సపోర్ట్. ► 13వ తేదీన ‘మాధ్యమంపై ఉద్యమం.. 35 సంస్థలతో మాతృభాష మాధ్యమమే వేదిక. దీక్ష ర్యాలీలు. భాషావేత్తల నిర్ణయం’ ► 15వ తేదీన ‘తెలుగుకు దూరం సరి కాదు. మాతృభాషపై పట్టు ఉంటేనే ఏదైనా నేర్చుకోవడం సులువు’ – ఈనాడు హాయి బుజ్జి వెలుగు పోటీల్లో వక్తలు.. అంటూ ఇచ్చారు. ► 16వ తేదీన ‘తుగ్లక్ చర్యలను తూర్పార పట్టండి.. ఆంగ్ల మాధ్యమం, మీడియాపై ఆంక్షలను పార్లమెంటులో ప్రస్తావించండి’ అని చంద్రబాబు స్టేట్మెంట్. ► 17వ తేదీన ‘అన్ని చోట్లా అమ్మ భాషే. ప్రపంచ వ్యాప్తంగా అదే బాట. కొన్ని దేశాల్లోనే ఆంగ్ల మాధ్యమం’ అంటూ బ్యానర్ స్టోరీ. ► 19వ తేదీన ‘తెలుగులో ఇక్కడ కాకపోతే విదేశాల్లో బోధిస్తారా?’ అంటూ బ్యానర్. మరోవైపు చంద్రబాబు స్టేట్మెంట్లు. ► అదే నెల 16వ తేదీన వాళ్లకు సంబంధించిన మరొక పత్రిక ‘ఆంధ్రజ్యోతి’లో (దాన్ని చంద్రజ్యోతి అని కూడా పిలుస్తారు) ‘తెలుగుతోనే ముందడుగు’ అని చంద్రబాబు స్టేట్మెంట్.. మళ్లీ 21న అదే చంద్రజ్యోతిలో ‘ఇది రద్దుల శకం. తెలుగులో చదివితే ఉద్యోగాలు రావా?’ అంటూ రాశారు. చంద్రబాబుకు యూటర్న్ అలవాటే.. వీరంతా ఎంతగా యుద్ధం చేసినా, ప్రజల్లో ఎప్పుడైతే తిరుగుబాటు మొదలైందో.. అప్పుడే, నవంబరు 22న చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. అంత వరకు ఎన్నెన్నో విమర్శలు. తుగ్లక్ పాలన, తుగ్లక్ చర్యలు అన్న చంద్రబాబునాయుడు 22 తర్వాత సన్నాయి నొక్కులు నొక్కడం మొదలు పెట్టారు. టీడీపీ ఆంగ్లానికి వ్యతిరేకం కాదనడం మొదలు పెట్టారు. కనీసం ఆ తర్వాత అయినా చిత్తశుద్ధి చూపారా అంటే.. అదీ లేదు. ఆ వెంటనే 26న మరో మాట. ‘మాతృభాషపై మాట్లాడినందుకు ప్రధానిని తప్పు పడతారేమో?’ అని స్టేట్మెంట్. ప్రజలు తిరగబడినప్పుడు యూటర్న్ తీసుకోవడం వీళ్లకు అలవాటే. గతంలో ప్రత్యేక హోదాపైనా అదే విధంగా వ్యవహరించారు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా? హోదా వల్ల రాష్టŠల్రాలు ఏం బాగుపడ్డాయి? అని ప్రశ్నించలేదా? ఇదీ బాబు నిర్వాకం ఇవాళ నిజంగా పేదలు చదివేది ప్రభుత్వ పాఠశాలల్లోనే. అగ్రవర్ణాలలో పేదలు కూడా ఆ స్కూళ్లలోనే చదువుతారు. కానీ చంద్రబాబు డబుల్ స్టాండర్డ్‌కు నిదర్శనం ఇదే.. 44 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే, వాటిలో 66 శాతం స్కూళ్లలో తెలుగు మీడియం ఉంది. కేవలం 34 శాతం స్కూళ్లు మాత్రమే ఇంగ్లిష్ మీడియంలో ఉన్నాయి. అందుకు సిగ్గుతో తల దించుకోవాలి. ఇది ఎంత దారుణమైన పరిస్థితి. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్లలో 95 శాతం ఇంగ్లిష్ మీడియంలోనే బోధిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చూస్తే, 1 నుంచి 6వ తరగతి వరకు 28 శాతమే ఇంగ్లిష్ మీడియంలో ఉన్నాయి. పద్ధతి ప్రకారం ప్రభుత్వ స్కూళ్ల నిర్వీర్యం పేదలు చదువుకునేది ప్రభుత్వ పాఠశాలలు. 2014 నుంచి 2019 వరకు ఒక పద్ధతి ప్రకారం వాటిని నిర్వీర్యం చేశారు. హేతుబద్ధీకరణ పేరుతో దాదాపు 6 వేల స్కూళ్లు మూసివేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలు కూడా ఉండవు. బాత్రూమ్లు, తాగు నీరుండదు. అక్టోబర్, నవంబర్ వరకు కూడా పుస్తకాలు అందవు. మధ్యాహ్న భోజనం బిల్లులు 6 నెలల నుంచి 8 నెలల వరకు పెండింగ్. ఆ పథకంలో పని చేసే ఆయాల జీతాలు కూడా 8 నెలలు పెండింగ్‌లో పెట్టారు. వారికి ఇచ్చేది కేవలం రూ.1000 మాత్రమే. పిల్లలంతా నారాయణ, చైతన్య స్కూళ్లకు వెళ్లడమే అప్పటి ప్రభుత్వ ఉద్దేశం. అందుకే అలా వ్యవహరించారు. విప్లవాత్మక మార్పునకు శ్రీకారం గత 5 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వ పాఠశాలల బాగు కోసం చేసిన వ్యయం ఏటా కనీసం రూ.50 కోట్లు లేదు. ప్రభుత్వ పాఠశాలల గురించి చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. రైట్ టు ఇంగ్లిష్ మీడియమ్ అన్నది మా లక్ష్యం. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా పనులు చేపట్టాం. ‘నాడు–నేడు’ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 45 వేల స్కూళ్లను బాగు చేస్తున్నాం. తొలి దశలో 15,715 స్కూళ్లు బాగు చేస్తున్నాం. అందు కోసం రూ.3,600 కోట్లు కేటాయించాం. మంచి నీరు, ప్రహరీ, లైట్లు, ఫ్యాన్ల వంటి మొత్తం 9 రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం. మండలానికి ఒక హైస్కూల్ తీసుకుని దాన్ని జూనియర్ కళాశాలగా మారుస్తాం. ‘నాడు–నేడు’తో పాటు, ఇంగ్లిష్ మీడియం, జనవరి 9న ‘అమ్మ ఒడి’తో ఒక విప్లవాత్మక మార్పు రాబోతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ సగటు నిరక్షరాస్యత 27 శాతం ఉంటే, రాష్ట్రంలో అది 33 శాతంగా ఉంది’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్ చేశాం ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు ఒక సబ్జెక్ట్‌గా తప్పనిసరిగా ఉంటుంది. మన పిల్లలు ఇంగ్లిష్‌లో పట్టు సాధించకపోతే, ప్రపంచ పోటీ ఎదుర్కోలేరు. నిరుపేద పిల్లల జీవితాలు మార్చడం కోసమే గట్టిగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ వేదికగా చెబుతున్నాను. ఇందులో మాకు సవాళ్లు ఉంటాయని కూడా తెలుసు. అందుకే 1 నుంచి 6వ తరగతి వరకు మాత్రమే వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్నాం. ఆ తర్వాత ఒక్కో ఏడాది ఒక్కో క్లాస్‌కు పెంచుకుంటూ పోతాం. ఆ విధంగా 10వ తరగతి బోర్డు పరీక్ష ఇంగ్లిష్ మీడియంలో రాసేసరికి ఆ విద్యార్థికి 4 ఏళ్ల సమయం ఉంటుంది. తొలి రెండేళ్లు కొంచెం కష్టం అనిపించినా.. మూడో ఏడాది వచ్చే సరికి అలవాటు పడతాడు. నాలుగో ఏడాది బోర్డు పరీక్ష ఇంగ్లిష్ మీడియంలో రాసే స్థాయికి ఎదుగుతాడు. అత్యుత్తమ నిపుణులతో శిక్షణ ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఒక సవాలే. అందుకే ఒక కరికులమ్ ఏర్పాటు చేశాం. కరికులమ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్నాం. ఇందు కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ నిపుణులను ఎంపిక చేసుకుంటున్నాం. ఉపాధ్యాయుల శిక్షణ కోసం 30 మంది కీలక రీసోర్స్ పర్సన్స్‌ను గుర్తించాం. వారికి అత్యుత్తమ శిక్షణ కూడా ఇప్పించాం. మరో వైపు 6.5 లక్షల మంది విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు నిర్వహించనున్నాం. 1, 2వ తరగతులకు సంబంధించి వచ్చే జూన్ నుంచి ఆగస్టు వరకు 10 వారాలు, 3, 4 తరగతులకు జూన్, జూలైలో 8 వారాలు, 5, 6వ తరగతి విద్యార్థులకు ఇంటెన్సివ్ బ్రిడ్డి కోర్సును ఏప్రిల్, మే లో రెండు నెలల పాటు ఏర్పాటు చేశాం. ఇన్ని గొప్ప కార్యక్రమాలు నిర్వహించేందుకు మంచి అధికారులు కూడా ఉన్నారు. విద్యా శాఖ మంత్రి దళిత సామాజిక వర్గానికి చెందిన వారే. గతంలో ఇతను ఒక ఐఆర్ఎస్ అధికారి. సివిల్ సర్వెంట్‌గా పని చేశారు కాబట్టి పేదలకు మంచి జరుగుతుందని నమ్ముతున్నా. -
‘స్వచ్ఛ’ పాఠశాల
సాక్షి, లింగాల:ప్రధానోపాధ్యాయుడి కృషి, గ్రామస్తుల సహకారంతో మూతపడే దశలో ఉన్న పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో రెండుసార్లు అవార్డులు అందుకున్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. విద్యార్థులు తక్కువగా ఉన్నారు. ఇక మూసివేస్తారని అనుకున్నారు. ఓ ఉపాధ్యాయుడి పట్టుదల, కృషితో పూర్వవైభవం తీసుకొచ్చారు. నేడు మండలంలోని ఆదర్శ పాఠశాలగా వెలుగొందుతుంది. అదే మండలంలోని మగ్ధూంపూర్ ప్రాథమిక పాఠశాల. విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్వచ్ఛ విద్యాలయం పురస్కారాలు అందుకున్నారు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జె.శంకర్. నాడు 6.. నేడు 33 మంది ఈ పాఠశాలలో ఒకటి నుంచి 5వరకు తరగతులు కొనసాగుతున్నాయి. ప్రధానోపాధ్యాయుడిగా శంకర్, విద్యావలంటీర్‌గా లక్ష్మీప్రసన్న పని చేస్తున్నారు. 2015లో ఆయన పాఠశాలకు వచ్చిన సమయంలో కేవలం ఆరుగురు మంది విద్యార్థులు ఉన్నారు. ఆ సమయంలో పాఠశాల మూత పడే అవకాశాలు ఉండేవి. దీంతో ఉపాధ్యాయుడు శంకర్ చేసిన కృషి ఫలించింది. ప్రతి రోజు పాఠశాల ప్రారంభానికి ముందుగా వచ్చి గ్రామంలో ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందిస్తామని, మధ్యాహ్న భోజనం తదితర ప్రభుత్వ పథకాలను వివరించారు. గ్రామం పాఠశాల మూతపడితే తిరిగి పున:ప్రారంభం కావడం కష్టమని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఆయన పట్టుదల, కృషిని శ్లాఘించిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు మాన్పించి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు పంపడం మొదలు పెట్టారు. దీంతో ప్రశ్నార్థకంగా ఉన్న పాఠశాల పరిస్థితి నేడు ఉన్నతంగా మారింది. నేడు 33 మంది విద్యార్థులు ఉన్నారు. రెండు స్వచ్ఛ పురస్కారాలు పాఠశాల హెచ్ఎం శంకర్ శ్రద్ధతో గత సెప్టెబంరు 5న పాఠశాలకు రెండు స్వచ్ఛ పురస్కారాలు వచ్చాయి. జిల్లాకు మొత్తం మూడు పురస్కారాలు రాగా అందులో రెండు ఈ పాఠశాలకు రావడం గర్వంగా ఉందని హెచ్ఎం పేర్కొన్నారు. సొంతంగా ఖర్చు పాఠశాల నేడు పచ్చదనంతో విరాజిల్లుతుంది. ప్ర తి ఏటా పాఠశాలకు ప్రభుత్వం నుంచి వస్తున్న రూ .10 వేలు సౌకర్యాలకు ఏ మాత్రం సరిపోవడం లే దు. ఇప్పటివరకు హెచ్ఎం సొంతంగా రూ.40వేల వరకు ఖర్చు చేసి ప్రొజెక్టర్ ఏర్పాటు చేయించచారు. కలరింగ్‌తో పాటు విద్యార్థులను ఆకర్శించే విధంగా వివిధ జాతీయ నాయకుల చిత్రపటాలను వేయించారు. మరుగుదొడ్లు, మూత్రశాలల సౌకర్యం తదితర పనులు చేయించారు. సంపాదనలో కొంత పాఠశాలకు ఖర్చు ప్రతి నెలా తనకు వస్తున్న వేతనంలో కొంత భాగం పాఠశాలకు ఖర్చు చేయాలని నిర్ణయించాను. గ్రామస్తులు సహకరించడంతో నేడు విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం పాఠశాలకు అదనపు గదులు, ఆటస్థలం కావాల్సి ఉంది. దీనికి కొంత మేరకు దాతల సహకారం కోరుతున్నాను. దాతలు సహకరిస్తే సౌకర్యాలు కల్పించి తనవంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తా. ఉపాధ్యాయులను నియమించాల్సి ఉంది. – జక్కం శంకర్, హెచ్ఎం, పీఎస్ మగ్ధూంపూర్ -
10 రోజులు ప్రైవేట్ పాఠశాలలు బంద్: ట్రాస్మా
సాక్షి, కరీంనగర్ : తెలంగాణలో ప్రైవేట్ స్కూల్స్ వర్సెస్ గవర్నమెంట్ స్కూల్స్ వార్ రోజు రోజుకు ముదురుతోంది. బుధవారం కరీంనగర్లో తెలంగాణ రికగ్నైస్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రాస్మా) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాస్మా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి శేఖర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేట్ స్కూల్స్‌పై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. సమస్యలను పదిరోజుల్లో పరిష్కరించకుంటే ప్రైవేట్ పాఠశాలలను బంద్ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రైవేట్ స్కూల్స్‌ను నడపడమే నేరం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రైవేట్ పాఠశాలలపై దుష్ప్రచారం మానుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోకి ప్రవేట్ పాఠశాలల బస్సులు రాకుండా అడ్డుకుంటున్న ప్రభుత్వ పాఠశాలల టీచర్లు, తమ పిల్లలను ప్రెవేట్ స్కూల్స్‌కు ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. ప్రైవేటు పాఠశాలలకు అనవసరమైన నిబంధనలను ఫైర్ పోలీసులు నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే విద్యార్థుల తల్లిదండ్రుల సమ్మతితో ప్రైవేట్ పాఠశాలలను బంద్ చేస్తామని వారు హెచ్చరించారు. -
ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పండగ..!
విజయనగరం అర్బన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తు ప్రవేశాలకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మన ఊరిలో ఉన్న బడిని మనమే కాపాడుకుందాం.. రూ.వేలు పోసి చదువుల కొనుగోలును మానుకుందాం.. ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేద్దాం అంటూ ప్రచారం ముమ్మరం చేసింది. దీనికోసం సోమవారం నుంచి ‘మన ఊరు.. మనబడి’ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో ప్రభుత్వ, మండల పరిషత్ ఉపాధ్యాయులు, హెచ్ఎంలను భాగస్వాములను చేసింది. ఆరు నుంచి 14 ఏళ్ల వయస్సు లోపు పిల్లలను బడిలో చేర్పించడమే కార్యక్రమ ప్రధాన ఉద్ధేశం. ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలను తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులకు ఉపాధ్యాయులు వివరిస్తారు. పిల్లలందరినీ ప్రభుత్వ బడికి పంపించేలా ప్రజలను చైతన్యవంతం చేస్తారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఈ నెల 23 నుంచి ప్రవేశాలు కల్పిస్తారు. 56,280 మందిని చేర్పించడమే లక్ష్యం జిల్లాలో చేపట్టిన వివిధ సర్వేల ఆధారంగా గుర్తించిన 56,278 మంది విద్యార్థులను ప్రభు త్వ పాఠశాల్లో చేర్పించాలన్నదే విద్యాశాఖ లక్ష్యం. జిల్లాలోని వివిధ యాజమాన్యాల పరిధి లోని 3,418 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలు కల్పిస్తారు. అంగన్వాడీ కేంద్రాల నుంచి ఒకటో తరగతికి 28,882 మందిని, ఐదు నుంచి ఆరో తరగతికి 22,404 మందిని, ఎనిమిది నుంచి తొమ్మిదో తరగతికి 2,463 మందిని చేర్పించాలి. బడిమానేసిన వివిధ వయస్సుల వారు 2,529 మందికి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలి. ప్రత్యేక కమిటీల నియామకం.. సర్కారు బడిలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమ అమలుకు జిల్లా, మండల, పాఠశాల స్థాయిలో కమిటీలను నియమిస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా, డీఈఓ వైస్ చైర్మన్‌గా, ఎస్ఎస్సీ పీఓ కన్వీనర్‌గా, డీపీఓ, జెడ్పీ సీఈఓ, ఐటీడీఏ పీఓ సభ్యులుగా ఉంటారు. మండల స్థాయిలో ఎంపీడీఓ అధ్యక్షుడిగా, ఎంఈఓ ఉపాధ్యక్షుడిగా, ఎస్ఎంసీ సభ్యుడు కన్వీనర్‌గా, క్లస్టర్ ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు సభ్యులుగా ఉంటారు. ఇక పాఠశాల స్థాయిలో అధ్యక్షుడిగా హెచ్ఎం, ఉపాధ్యక్షుడిగా ఎస్ఎంసీ అధ్యక్షుడు, కన్వీనర్‌గా ఉపాధ్యాయుడు, సభ్యురాలిగా అంగన్వాడీ కార్యకర్త ఉంటారు. కార్యాచరణ ఇలా... ఈ నెల 23 నుంచి 30 వరకు రోజువారీ అమలు చేయాల్సిన కార్యాచరణను నాలుగు ప్రక్రియలుగా విభజించి లక్ష్యాలను నిర్దేశించింది. 23న స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి వారి సమక్షంలో ప్రవేశాలు కొన్నైనా కల్పించాలి. ∙24 నుంచి 26వ తేదీ వరకు పాఠశాల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు సర్కార్ బడులను సందర్శించాలి. 25న ఐదో తరగతి విద్యార్థులను 6వ తరగతిలో చేర్పించడంపై దృష్టిపెట్టాలి. 26న ఏడు నుంచి ఎనిమిదికి, ఎనిమిది నుంచి తొమ్మిదో తరగతి ప్రవేశానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. 27న ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలను ప్రచారం చేసి ప్రవేశాలకు ఒప్పించాలి. 28న బడిబయట విద్యార్థుల వద్దకు వెళ్లి ప్రవేశాలు కల్పించాలి. 29న మురికి వాడల్లో పిల్లలను చైతన్యపరిచి ప్రవేశాలు చేపట్టాలి. 29న జ్ఞానధార కార్యక్రమం గురించి తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలి. సమీప కేంద్రాలకు సంబంధిత విద్యార్థులను చేర్పించాలి. 30న వారం రోజుల పాటు చేపట్టిన ప్రవేశాల వివరాలను మండల స్థాయి సీఎస్ఈ లో పొందుపరచాలి. ∙23 నుంచి 30 వరకు ఇద్దరు ఉపాధ్యాయులు విధిగా పాఠశాలల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటూ íపిల్లలను బడిలో చేర్చుకుని వారికి ప్రవేశ ధ్రువపత్రాలను జారీచేయాలి. ఈ ఏడాది నుంచి ఆంగ్లంలో బోధన రానున్న విద్యా సంత్సరం ఒకటో తరగతి నుంచి సమాంతర ఆంగ్ల మాధ్యమ విద్యను 139 మోడల్ ప్రాథమిక పాఠశాలలో ప్రవేశపెడుతున్నాం. ఈ అంశంపై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం. దీంతోపాటు జ్ఞానధార కార్యక్రమ ప్రాధాన్యత చెప్పాలని సూచించాం. ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, సైకిళ్ల పంపిణీ పథకాలను వివరిస్తూ ఎక్కువ మందిని బడిలో చేర్పించాలన్నది విద్యాశాఖ లక్ష్యం. – జీ.నాగమణి, డీఈఓ -
విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు : కడియం
సాక్షి, హైదరాబాద్ : పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి ప్రభుత్వ పాఠశాలల్ని పటిష్టం చేయాలని మంత్రి కడియం శ్రీహరి అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని, అన్ని స్కూళ్లకు మిషన్ భగీరథ ద్వారా నల్లా నీరు అందిస్తామన్నారు. కడియం శ్రీహరి శుక్రవారమిక్కడ మాట్లాడుతూ...విద్యార్థినులకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్‌ను పంపిణీ చేస్తామని, స్కూల్ గ్రాంట్లను 12 నెలలకు పెంచుతామన్నారు. ఉపాధ్యాయుల సంఖ్యను కూడా పెంచే అంశం పరిశీలనలో ఉందని కడియం తెలిపారు. -
ఉత్తీర్ణతపై దృష్టి
శాంతినగర్ : ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన ఉండాలని, వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఉపాధ్యాయులు. ఉమ్మడి వడ్డేపల్లి మండలంలో మొత్తం 630 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వడ్డేపల్లి మండలంలో 5 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 1 ఎయిడెడ్ పాఠశాల, మరో కస్తూర్బా పాఠశాల ఉంది. రాజోలి మండలంలో 3 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఎంపీహెచ్ఎస్, ఉర్దూ మీడియం పాఠశాల ఉంది. ఆయా పాఠశాలల్లో పది చదువుతున్న విద్యార్థులంతా మార్చిలో జరిగే వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించా లని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉండటంతో ప్రత్యేక ప్రణాళికతో ఉపాధ్యాయులు విద్యాబోధన చేపట్టారు. ముగ్గురు విద్యార్థుల చొప్పున ఆయా పాఠశాలల్లో చదువులో వెనుకబ డిన విద్యార్థులను గుర్తించి ఒక్కో ఉపాధ్యాయుడు ముగ్గురు చొప్పున దత్తత తీసుకున్నారు. వారు పాస్అయ్యే బాధ్యతను ఉపాధ్యాయులు చేపట్టారు. వారం రోజులపాటు చెప్పిన పాఠాల్లోని అంశాలపై ప్రతివారం స్లిప్‌టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. అందులో రాయలేని విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సాగిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి అల్పాహారం.. విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు కృషిచేస్తున్నట్లు ఎంఈఓ నర్సింహులు పేర్కొన్నారు. ఈ విషయమై కొందరు దాతలను కలిశామన్నారు. అందుకు వారు సానుకూలంగా ఉన్నారని, ఫిబ్రవరి 1నుంచి అల్పాహారం అందించి ప్రత్యేక తరగతులు కొనసాగిస్తామన్నారు. సక్రమంగా పాఠశాలకు విద్యార్థులను తల్లిదండ్రులు పాఠశాలకు సక్రమంగా పంపాలి. పనులున్న సమయంలో పాఠశాలకు పంపకపోవడంతో పాఠాలు అర్థంగాక వెనుకబడి పోతున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ప్రోత్సాహక బహుమతులు విద్యార్థులను ప్రోత్సహించే దిశగా 9.5 గ్రేడ్ సాధించిన వారికి శాంతినగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు హరుణ్రషీద్ రూ.516, సామేల్ రూ.1,116, ఊశన్న రూ.2,116, నాగేంద్రం రూ.5,116, 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు సాయిరాం రూ.10,116 ప్రోత్సాహక బహుమతులు ప్రకటించారు. పట్టుదలతో చదువుతున్నాను.. పదిలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని మమ్మల్ని ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు. పాఠశాల వదిలిన అనంతరం ప్రత్యేక తరగతులు పెట్టి పాఠాలు చెబుతున్నారు. పదిలో ఎలాగైనా 9.5 జీపీఏకు పైగా మార్కులు తెచ్చుకోవాలని, పాఠశాలకు, ఉపాధ్యాయులకు మా తల్లిదండ్రులకు పేరు రావాలని పట్టుదలతో చదువుతున్నాను. – స్వప్న, విద్యార్థి, జెడ్పీహెచ్ఎస్ శాంతినగర్ టాప్ మార్కులు సాధించే దిశగా బోధన అత్యధిక మార్కులు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషిచేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. మా టాపర్లంతా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేరారు. అయినా ఉన్నవారిని వందశాతం పాస్చేయించి అత్యధిక మార్కులు సాధించేదిశగా అడుగులు వేస్తున్నాం. – నర్సింహులు, ఎంఈఓ, వడ్డేపల్లి ప్రత్యేక తరగతులు.. ఆయా గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు ప్రారంభిచారు. ఉదయం గంట, సాయంత్రం గంటపాటు తరగతులు నిర్వహిస్తూ.. విద్యాబోధన చేస్తున్నారు. -
అర్హులందరికీ ఉపకారవేతనాలు
సర్కారు బడిలో చదివే ఎస్సీ విద్యార్థులకు లబ్ధి ► 5 నుంచి 8 తరగతి చదివే బాలురకు రూ. 1,000, బాలికలకు రూ.1,500 ► 9, 10 తరగతి విద్యార్థులకు రూ.2,250 ► దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ఎస్సీ అభివృద్ధి శాఖ ► ఈ–పాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు ► అర్హులందరికీ మంజూరు చేసేలా భారీ బడ్జెట్ కేటాయింపు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న ఎస్సీ విద్యార్థులకు శుభవార్త. 5వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలకు ఎస్సీ అభివృద్ధి శాఖ ఉపకారవేతనాలు అందించేందుకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. ప్రీ–మెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాల కోసం ఆ శాఖ 2017–18 వార్షిక సంవత్సరానికి రూ.41 కోట్లు కేటాయించింది. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా అర్హులైన వారందరికీ ఉపకార వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్లైన్లో దరఖాస్తులు.. ప్రస్తుతం కాలేజీ విద్యార్థుల ఉపకారవేతనాల దరఖాస్తు మాదిరిగానే పాఠశాల విద్యార్థుల దరఖాస్తులను కూడా ఈ–పాస్ వెబ్సైట్ నుంచే స్వీకరిస్తోంది. 2017–18 విద్యాసంవత్సరానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించింది. దరఖాస్తుపై విద్యార్థులకు పెద్దగా అవగాహన లేకపోవడంతో కీలక బాధ్యత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపైనే ఉంది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతూ.. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2లక్షల లోపు ఉన్నవారు మాత్రమే అర్హులు. విద్యార్థులు ముందుగా ఈ–పాస్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలి. అలా నమోదు చేసి, సబ్మిట్ చేసిన దరఖాస్తును ప్రింట్అవుట్ తీసి వాటికి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జత చేసి డివిజన్ సంక్షేమాధికారికి సమర్పించాలి. అలా వచ్చిన దరఖాస్తులు డివిజన్ సంక్షేమాధికారి పరిశీలించి ఉపకారవేతన మంజూరు కోసం జిల్లా సంక్షేమాధికారికి సిఫార్సు చేయాలి. వెబ్సైట్లో వివరాల నమోదు, ప్రింట్అవుట్లను సంక్షేమాధికారులకు సమర్పించే బాధ్యతను ఉపాధ్యాయులు నిర్వహిస్తే లబ్ధిదారులకు ఉపకార మవుతుందని అధికారులు చెబుతున్నారు. రూ. 20 కోట్లు విడుదల.. ప్రీ–మెట్రిక్ కేటగిరీ కింద 5 నుంచి 10వ తరగతి వరకు ఇస్తున్న ఉపకారవేతనాలకు సంబంధించి ఎస్సీ అభివృద్ధి శాఖ రూ.20 కోట్లు విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న వెంటనే పరిశీలన పూర్తిచేసి ఉపకారవేతనాలిచ్చేలా చర్యలు చేపట్టింది. అంతేకాకుండా గత రెండేళ్ల కింద ప్రీ–మెట్రిక్ స్కాలర్షిప్ కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సంబంధించిన బకాయిలు సైతం ఇవ్వాలని నిర్ణయించింది. కేటగిరీల వారీ వివరాలు... తరగతి ఉపకారవేతనం (రూపాయల్లో) 5–8 (బాలురు) 1,000 5–8 (బాలికలు) 1,500 9–10 2,250. -
నాణ్యమైన విద్యనందించాలి
బోధన్ : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన అందించాలని డీఈవో లింగయ్య ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు. శనివారం బోధన్ మండలంలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన.. ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అమలు చేయాలన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయా పాఠశాలలో విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సామర్థ్యాలను పరిశీలించారు. జాడిజమాల్‌పూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల హజరు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. రాంపూర్ ప్రాథమిక పాఠశాల, కల్దుర్కి జెడ్పీ హైస్కూళ్లను పరిశీలించారు. తరగతి గదుల తీర్చాలని కల్దుర్కి వాసులు డీఈవోను కోరారు. అనారోగ్యానికి గురైన టెన్త్ విద్యార్థి శ్రీకాంత్ వైద్య ఖర్చుల కోసం ఉపాధ్యాయ బృందం, పూర్వ విద్యార్థులు పోగు చేసిన రూ.21 వేల నగదును డీఈవో విద్యార్థికి అందజేశారు. ఆయన వెంట ఎంఈవో కందారే శంకర్, సర్పంచ్ మరయ్య, విశ్రాంత హెచ్ఎం గోపాల్‌రెడ్డి తదితరులున్నారు. ‘మీలాగే డీఈవోనవుతా..’ ఖండ్గాం యూపీఎస్‌ను తనిఖీ చేసిన డీఈవో అక్కడి నుంచి బిక్నెల్లి తెలుగు మీడియం ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. అక్కడి విద్యార్థులతో ముచ్చటించిన డీఈవో.. బడికి ఎందుకు వస్తున్నారని ప్రశ్నించగా, చదువుకునేందుకు వస్తున్నామని సమాధానమిచ్చారు. చదువుకుని ఏమి కావాలనుకుంటున్నారని అడిగితే.. మీలాగే డీఈవోనవుతానని ఓ బాలిక సమాధానం ఇవ్వడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆమెకు తన పెన్నును బహుమతిగా ఇచ్చారు. -
సర్కారు బడికి స్పందన కొంతే..
కొత్తగా చేరిన విద్యార్థులు 57,974 మంది వివిధ కారణాలతో వెళ్లిపోయిన విద్యార్థుల సంఖ్య 53వేలకు పైగానే మెుత్తంగా గత సంవత్సరం కంటే పెరిగిన విద్యార్థులు 4311 తెరుచుకున్న 42 పాఠశాలలు.. 44 పాఠశాలల్లో అడ్మిషన్లు నిల్ విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది కొత్తగా చేరిన విద్యార్థుల సంఖ్య చాలా స్పల్పంగా ఉంది. జిల్లాలో 2049 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 360 యూపీఎస్‌లు, 510 ఉన్నత పాఠశాలలున్నాయి. వాటిల్లో 2015–2016 విద్యాసంవత్సరం 1నుంచి పదో తరగతి వరకు మొత్తంగా 2,42,413 మంది విద్యార్థులుండగా ఈ సంవత్సరం ( 2016–2017) బడిబాట తరువాత 2,46,724 మంది విద్యార్థులున్నారు. గత ఏడాదితో పోలిస్తే 4,311 మంది విద్యార్థులు పెరిగారు. గత ఏడాది ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులతోపాటు మిగతా తరగతుల్లో విద్యార్థులు సుమారు 53వేల మందికి పైగానే అవుట్గోయింగ్ విద్యార్థులుగా గుర్తించారు. ఈసారి బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాగస్వాములై ఎక్కువగా విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రయత్నించారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగినా మరికొన్ని చోట్ల తగ్గినట్లు కూడా తెలుస్తోంది. బడిబాట ద్వారా ఈ విద్యా సంవత్సరంలో ఒకటవ తరగతిలో కొత్తగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులు 24,581మంది ఉండగా అందులో బాలురు 12,539మంది, బాలికలు 12,042 ప్రవేశాలు పొందారు. ఇక 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కొత్తగా 33,393మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందగా అందులో బాలురు 16,303మంది, బాలికలు 17,090 మంది ఉన్నారు. మొత్తంగా జిల్లాలో 1నుంచి 10వ తరగతి వరకు కొత్తగా అడ్మిషన్లు పొందిన విద్యార్థుల సంఖ్య 57,974. పెరిగిన విద్యార్థుల సంఖ్య ఇలా.. జిల్లాలో బడిబాట ద్వారా అక్కడక్కడ పాఠశాలల్లో విద్యార్థులు పెరిగారు. నెల్లికుదరు మండలం జామతండాలో ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది 30మంది ఉండగా ప్రస్తుతం 100మంది విద్యార్థులున్నారు. నర్సంపేటలోని హనుమాన్దేవ్ ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో గత ఏడాది 390మంది ఉండగా ఈఏడాది 426 మంది ఉన్నారు. నర్సంపేట మండలం సర్వాపురం ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది 42మంది ఉంటే.. ప్రస్తుతం 73మంది ఉన్నారు. జీడయ్యపల్లి ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది 70 మంది విద్యార్థులుంటే ప్రస్తుతం 133 మంది ఉన్నారు. గూడూరు మండలం అయోధ్యపురం ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది 165మంది ఉంటే ప్రస్తుతం 331మంది. అదే మండలం గాజులగట్టు యూపీఎస్‌లో గత ఏడాది 72మంది ఉంటే ప్రస్తుతం 140మంది, సీతానాగారం పీఎస్‌లో గత ఏడాది 26మంది ఉంటే ప్రస్తుతం 52మంది ఉన్నారు. అలాగే కొమ్ములవంచ ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది ఆరుగురు ఉంటే ప్రస్తుతం 26 మంది విద్యార్థులున్నారు. మహబూబాబాద్ జీపీఎస్‌లో గత ఏడాది 172మంది విద్యార్థులుంటే ప్రస్తుతం 233 మంది విద్యార్థులున్నారు. అదేమండలం కొత్తరెడ్యాల యూపీఎస్‌లో గత ఏడాది 104మంది ఉంటే ప్రస్తుతం 132మంది విద్యార్థులున్నారు. చేర్యాల మండలం ముస్త్యాలపల్లి జెడ్పీఎస్‌ఎస్‌లో గత ఏడాది 166మంది ఉంటే విద్యార్థుల సంఖ్యపెరిగి ప్రస్తుతం 304 మంది ఉన్నారు. తెరుచుకున్న 42పాఠశాలలు జిల్లాలో అసలే విద్యార్థులు లేని ప్రాథమిక పాఠశాలలు 86 ఉండగా ఈ విద్యాసంవత్సరంలో 42 పాఠశాలలు తెరుచుకున్నాయి. కానీ చాలా తక్కువ మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. మొత్తంగా అయా పాఠశాలలు అన్నీ కలిపితే 368మంది విద్యార్థులే చేరినట్లు రికార్డులను బట్టితెలుస్తోంది. మిగతా 44 పాఠశాలలకు అడ్మిషన్లు లేవు. ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులను వర్క్అడ్జస్ట్మెంట్కింద అవసరం ఉన్నచోటుకు పంపాల్సిందే.