డిప్యూటీ సీఎం కడియం ఇంటి ముట్టడి
ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు నియంత్రించాలని డిమాండ్
హన్మకొండ: ప్రైవేటు విద్యా సంస్థల్లో అధిక ఫీజులను నియం త్రించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడి యం శ్రీహరి ఇంటిని ముట్టడిం చారు. హన్మకొండ సుబేదారి నుంచి టీచర్స్ కాలనీలోని కడి యం శ్రీహరి ఇంటికి పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీగా వెళ్లగా, పోలీసులు అడ్డుకున్నారు. వారిని ప్రతిఘటిం చి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిం చారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి, ధర్నా చేశారు. అనంతరం విద్యార్థి నాయకులను అరెస్టు చేసి తీసుకెళ్లారు. కాగా, విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రించాలని, అధికఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ వరంగల్ జిల్లా అధ్యక్షుడు పైండ్ల యాకయ్య, కార్యదర్శి బి.నరసింహారావు డిమాండ్ చేశారు.
పోచారం ఇల్లు ముట్టడికి యత్నం
బాన్సువాడటౌన్: ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇల్లును పీడీఎస్‌యూ కార్యకర్త లు ముట్టడించేందుకు యత్నించారు. అంత కుముందు మంత్రి ఇల్లు ముట్టడికి ర్యాలీగా వెళ్లారు. ర్యాలీని రోడ్డుపైనే పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు రోడ్డుపైనే బఠాయిం చిన నాయకులు పోలీసులను తప్పించుకుని మంత్రి ఇంటి వైపు పరుగులు తీశారు. మం త్రి ఇంటి ఎదుట నినాదాలు చేస్తూ ధర్నా చేయగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయిన 20 మంది పీడీఎస్‌యూ నాయకులను వ్యక్తిగత పూచీపై విడుదల చేశారు.