గోవిందరావుపేట, న్యూస్‌లైన్ :
దట్టమైన అటవీ ప్రాంతంలో గుడుంబా గుప్పుమంటోంది. మేడారం జాతర సమీపిస్తుండడంతో గుడుంబా తయూరీదారులు భారీగా సారా ఉత్పత్తి చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇలా వందకుపైగా కుండల్లో బెల్లం పాన కం పులియబెట్టి, గుడుంబా బట్టీలతో సారా కాస్తున్న దృశ్యం గౌరారం చెరువు కట్ట నుంచి మచ్చాపూర్ మధ్య ఉన్న దట్టమైన అడవిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నారుు. మద్యపాన వ్యతిరేక పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రేండ్ల సంతోష్ ఇచ్చిన సమాచారంతో విలేకరుల బృందం బట్టీలను కనుగొనేందుకు బయల్దేరింది. గౌరారం చెరువు కట్ట నుంచి మచ్చాపూర్ మధ్య ఉన్న దట్టమైన అడవిలో సుమారు 5 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాక వట్టివాగు పక్కనే బట్టీలు కనిపించాయి. ఈ బృందాన్ని చూసినతయూరీదారులు పరారయ్యారు. అక్కడ నాలుగు బట్టీలు, వందకుపైగా బెల్లం ఊటల కుండలు కనిపించాయి. 10 టిన్నుల్లో గుడుంబా కనిపించింది. వెంటనే తహసీల్దార్ బండి నాగేశ్వర్‌రావుకు సమాచారమివ్వడంతో ఆయన ఎక్సైజ్ అధికారులతో కలిసి సుమారు రెండు గంటల తర్వాత సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ఎక్సైజ్ సీఐ ఇంద్రప్రసాద్, ఎస్సై మాన్‌సింగ్, హెడ్ కానిస్టేబుల్ రాములు, సారంగపాణి, కానిస్టేబుల్ హరినాథ్, శ్రీరాములు, నిజాముద్దీన్ మార్గమధ్యంలో మరో గుడుంబా తయూరీ కేంద్రాన్ని కూడా గుర్తించి కుండలను ధ్వంసం చేశారు. కాగా చల్వాయికి చెందిన కొంతమంది కూలీలను పెట్టి బట్టీలను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా సీఐ ఇంద్రప్రసాద్ మాట్లాడుతూ మొత్తం 10 బట్టీల్లో తాము 5వేల లీటర్ల బెల్లం పానకం, 5 వందల లీటర్ల గుడుంబాను ధ్వంసం చేసినట్లు తెలిపారు. పక్కా సమాచారం ఇస్తే దాడులు నిర్వహిస్తామని తెలిపారు.
నాకు ప్రాణభయం ఉంది : సంతోష్
మద్యపాన వ్యతిరేక పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రజల మేలు కోరి తాను ఉద్యమం చేస్తుంటే గుడుం బా వ్యాపారులు నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. బెల్లం, పటిక, ఇతర వస్తువులు విచ్ఛలవిడిగా లభిస్తున్నాయి. బెల్లాన్ని నియంత్రిస్తే గుడుంబా అదే తగ్గిపోతుంది. అధికారులు సరైన చర్య లు తీసుకోవాలి.
జాతరకు.. గుట్టుగా గుడుంబా
Published Tue, Jan 21 2014 2:02 AM | Last Updated on Thu, Apr 4 2019 5:53 PM
Advertisement
Advertisement