పుస్తెలు తెంపుతున్న గుడుంబా రక్కసి
ఏజెన్సీలో ఏరులై పారుతున్న నాటు సారా
విచ్చలవిడిగా బెల్లం వ్యాపారం
మాముళ్ల మత్తులో జోగుతున్న చెక్‌పోస్టుల అధికారులు
ములుగు/ఏటూర్‌నాగారం :గుడుంబా రక్కసి పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతోంది. ఆడపడచుల పుస్తెలు తెంపుతోంది. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తోం ది. కొంపలు కూలుస్తున్న నాటుసారాను అరికట్టాల్సిన ఎక్సైజ్, పోలీస్ అధికారులు మామూ ళ్ల మత్తులో జోగుతున్నారు. గుడుంబా తయూరీకి ఉపయోగించే నల్లబెల్లం, పటిక సరఫరా చే సే లారీలకు చెక్‌పోస్టుల వద్ద గేట్లు ఎత్తేస్తున్నా రు. ఫలితంగా గుడుంబా వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది.
టార్గెట్ల కోసమే ఎక్సైజ్ దాడులు..?
బెల్లం రవాణా, గుడుంబాను అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గుడుంబా వ్యాపారుల నుంచి మాముళ్లు తీసుకుని అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఏడాదిలో వారికుండే టార్గెట్లను పూర్తి చేసుకోవడానికి మాత్రమే అడపాదడపా గ్రామాల్లో దాడులు నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నారుు. అందులోనే కొందరిని మాత్రమే పదేపదే అరెస్ట్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నారుు.
విచ్ఛలవిడిగా బెల్లం సరఫరా..
చిత్తూరు, కామారెడ్డి, అనకాపల్లి, సంగారెడ్డి రకాల బెల్లం ప్రస్తుతం జిల్లాకు సరఫరా అవుతోంది. చిత్తురు నుంచి వయా ఖమ్మం జిల్లా మణుగూరు మీదుగా వరంగల్ జిల్లా ఏటూరునాగారం, మంగపేట, కొత్తగూడ మండలాలకు సరఫరా చేస్తున్నారు. ఇక్కడి నుంచి వివిధ పల్లెలు, పట్టణాలకు పంపుతున్నారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నుంచి వచ్చే లారీలు కరీంనగర్ జిల్లా కాటారం మీదుగా భూపాలపల్లి, పరకాల, తాడ్వాయి, గోవిందరావుపేట, హసన్‌పర్తి మండలాలకు చేరుకుంటున్నారుు. అలాగే అనకాపల్లి నుంచి జిల్లాలోని వివిధ పట్టణాలకు బెల్లం రవాణా చేస్తున్నారు. సంగారెడ్డి నుంచి వచ్చే లారీలు జనగామ మీదుగా వచ్చి రఘునాథపల్లి, పాలకుర్తి, మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్, వర్ధన్నపేట మండలాలకు బెల్లాన్ని సరఫరా చేస్తున్నారుు. అలాగే కరీంనగర్ జిల్లా బోర్లగూడెం నుంచి ఎడ్లబండ్లతో నల్లబెల్లాన్ని ఏటూరునాగారం, మండపేట, తాడ్వాయి, బుట్టాయిగూడెంకు తీసుకొచ్చి అక్కడ నుంచి గుడుంబా తయారీదారులకు విక్రయిస్తున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా 30 నుంచి 35 మంది బడా వ్యాపారులు బెల్లం సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. వారిలో కొందరు పశువుల దాణా కోసం బెల్లం పర్మిషన్లు ఉండగా మిగతావారు ఎలాంటి అనుమతులు లేకుండా విచ్ఛవిడిగా వ్యాపారం చేస్తున్నారు. అనుమతి ఉన్న ఒక్కో వ్యాపారి పది రోజులకు రెండు లోడ్లు(400 టన్నుల) బెల్లం దిగుమతి చేసుకుంటున్నాడు. అంటే జిల్లాలో కేవలం పది రోజుల్లో అధికారికంగా 15000 టన్నుల బెల్లం వ్యాపారం జరుగుతోంది.
నామమాత్రంగా చెక్‌పోస్టులు..
ఇతర జిల్లాల నుంచి వచ్చే బెల్లం రవాణాను పరిశీలించేందుకు జిల్లాలో ప్రవేశించే అన్ని గ్రా మాల్లో చెక్‌పోస్టులు ఉన్నాయి. గణపురం మం డలం చెల్పూరు, భూపాలపల్లి, మంగపేట మండలం రాజుపేట, కొత్తగూడ మండలం గంగారం, రఘునాథపల్లి, మరిపెడ, హసన్‌పర్తి, కరీంనగర్ జిల్లా కాటారాంలో చెక్‌పోస్టులు ఉన్నాయి. వారానికి సుమారు పదుల సంఖ్యలో బెల్లం లోడ్లు చెక్‌పోస్టులను దాటి లోపలికి వస్తున్నాయి. ఒక్కో చెక్‌పోస్టుకు ముందే రూ.5 వేలు చెల్లించి రాచమార్గంలో రవాణా కొనసాగిస్తున్నట్లు తెలిసింది.
నాయకుల కనుసన్నల్లో వ్యాపారం
వివిధ పార్టీలకు చెందిన కొందరు మండల నా యకుల కనుసన్నల్లో వ్యాపారం విచ్ఛలవిడిగా సాగుతున్నట్లు సమాచారం. బెల్లం వ్యాపారం చేసిన వీరికి ఎలాంటి ఆపద వచ్చిన పెద్దతలల నుంచి ఫోన్లు చేరుుంచుకుని క్షణాల్లో సమస్యను పరిష్కరించుకుంటున్నారని తెలిసింది.
వీధినపడిన కుటుంబాలు
గుడుంబా తాగితాగి ప్రాణాలు కోల్పోరుున వారి సంఖ్య ఏజెన్సీలో వందల సంఖ్యలో ఉం ది. గుడుంబా రక్కసితో ఎంపెల్లి రాంబాయి, చెన్నం లాలమ్మ, మామిడి నర్సమ్మ, దేపాక శాంత, దేపాక అనసూర్య, కర్ణ సుశీల, వావిలా ల రాములమ్మ, కుమ్మరి ఆదిలక్ష్మి, ఇల్లందు ప్రమీల, దేపాక సారమ్మ, చిట్యాల వెంకట మ్మ, దేపాక స్వరూప, వావిలాల జయమ్మ, ఎంపెల్లి సావిత్రి, తిప్పనపల్లి పోషమ్మ, వావి లాల అనసూర్య, కొండాయి మణి, జరుడు జ్యోతి, జాడి మాణిక్యం తదితరుల భర్తలు గు డుంబాకు బానిసలు మారి ప్రాణాలు కోల్పోయూరు. ఇంటిపెద్ద దిక్కును కోల్పోరుు వితంతువులుగా మారిన వారంతా కుటుంబ భారా న్ని మోస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికైనా పోలీస్, ఎక్సైజ్‌శాఖ అధికారులు గుడుం బాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.