త్వరలోనే రాష్ట్రానికి కల్లుగీత పరికరాలు | Excise Minister Padma Rao about liquor line workers | Sakshi
Sakshi News home page

త్వరలోనే రాష్ట్రానికి కల్లుగీత పరికరాలు

Published Wed, Jan 18 2017 3:12 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM

త్వరలోనే రాష్ట్రానికి కల్లుగీత పరికరాలు

త్వరలోనే రాష్ట్రానికి కల్లుగీత పరికరాలు

కల్లుగీత కార్మికులకు తోడ్పడే పరికరాలను రాష్ట్రంలో ప్రవేశపె ట్టబోతున్నామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. త్వరలోనే నల్లగొండ జిల్లాకు ఈ పరికరాలను పంపుతామ న్నారు. కల్లు దుకాణాల అంశంపై ఓ ప్రశ్నకు ఆయన సమాధాన మిచ్చారు. కల్లుగీత యంత్రాల కోసం అధికారులు ఇప్పటికే కేరళలో అధ్యయనం చేసి వచ్చారని చెప్పారు.

కల్లు గీత అభివృ ద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, హరితహారంలో ఈ ఏడాది 54 లక్షల తాటి, ఈత చెట్లు నాటామన్నారు. వచ్చే ఏడాది 2 కోట్లు, తర్వాతి ఏడాది 5 కోట్ల చెట్లను నాటాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కల్లు గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. ‘కల్లు మూడు రకాలు. పోద్దాళ్లు, పరుపుదాళ్లు, పందాళ్లు అనే రకాల చెట్ల నుంచి కల్లు వస్తుంది. అందులో పోద్దాళ్లు, పందాళ్ల కల్లులో ఔషధ గుణాలు ఉంటాయి’ అని పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement