liquor line workers
-
త్వరలోనే రాష్ట్రానికి కల్లుగీత పరికరాలు
కల్లుగీత కార్మికులకు తోడ్పడే పరికరాలను రాష్ట్రంలో ప్రవేశపె ట్టబోతున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. త్వరలోనే నల్లగొండ జిల్లాకు ఈ పరికరాలను పంపుతామ న్నారు. కల్లు దుకాణాల అంశంపై ఓ ప్రశ్నకు ఆయన సమాధాన మిచ్చారు. కల్లుగీత యంత్రాల కోసం అధికారులు ఇప్పటికే కేరళలో అధ్యయనం చేసి వచ్చారని చెప్పారు. కల్లు గీత అభివృ ద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, హరితహారంలో ఈ ఏడాది 54 లక్షల తాటి, ఈత చెట్లు నాటామన్నారు. వచ్చే ఏడాది 2 కోట్లు, తర్వాతి ఏడాది 5 కోట్ల చెట్లను నాటాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కల్లు గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. ‘కల్లు మూడు రకాలు. పోద్దాళ్లు, పరుపుదాళ్లు, పందాళ్లు అనే రకాల చెట్ల నుంచి కల్లు వస్తుంది. అందులో పోద్దాళ్లు, పందాళ్ల కల్లులో ఔషధ గుణాలు ఉంటాయి’ అని పేర్కొన్నారు. -
‘కల్లు’కు కొత్త టెక్నిక్
వినూత్న విధానం కల్లు గీత కార్మికుల నుదుట లాభాల ‘గీత’ రాస్తోంది. కల్లు తీసేందుకు ఎక్కిన చెట్టు దిగకుండానే మరోదానిపైకి వెళ్లేందుకు టెంకాయ తాళ్లను వారధిగా వినియోగిస్తున్నారు. చెట్టు నుంచి మరో చెట్టుకు తాళ్లు కట్టి వాటిపై నడుస్తూ వెళ్లి వందలాది చెట్ల నుంచి కల్లు తీస్తున్నారు. శ్రీలంకలో అవలంబిస్తున్న ఈ విధానం చెన్నైకి విస్తరించింది. అక్కడ పనిచేసే కొందర్లు గీత కార్మికులు తర్ఫీదు పొంది ప్రస్తుతం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడులోని టెంకాయ తోపులో ఈ పద్ధతిలో కల్లుతీస్తున్నారు. తమిళనాడుకు చెందిన గీత కార్మికుడు రాజా వాకాడులో టెంకాయ తోపును లీజుకు తీసుకుని కల్లు గీస్తున్నారు. ఆయన మాట్లాడుతూ చెట్లకు తాళ్లు కట్టి దానిపై నడిచి వెళ్లడంతో శ్రమ తగ్గుతోందన్నారు. గతంలో ఒకరు పది చెట్లు ఎక్కేవారని, ఇప్పుడు ఒకొక్కరు సులువుగా 30 చెట్ల నుంచి కల్లు తీయవచ్చన్నారు. - వాకాడు