బహిరంగసభకు భారీ బందోబస్తు | Arrangements for TRS Bahiranga Sabha | Sakshi
Sakshi News home page

బహిరంగసభకు భారీ బందోబస్తు

Published Sun, Apr 26 2015 2:06 AM | Last Updated on Sun, Sep 3 2017 12:52 AM

బహిరంగసభకు భారీ బందోబస్తు

బహిరంగసభకు భారీ బందోబస్తు

సాక్షి, సిటీబ్యూరో: జింఖానా గ్రౌండ్‌లో సోమవారం నిర్వహించనున్న టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభకు పటిష్ట భద్రత కల్పిస్తున్నారు. 4వేల మంది పోలీసులతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వీఐపీల వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలు కేటాయించారు.  అలాగే జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు పార్కింగ్ ప్రదేశాలు కేటాయించారు. ఏ జిల్లా వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేయాలో ఇప్పటికే నాయకులకు తెలియజేశారు.

ఈ మేరకు ట్రాఫిక్ చీఫ్ జితేందర్, డీసీపీలు రంగనాథ్, చౌహాన్, అదనపు పోలీసు కమిషనర్ అంజనీకుమార్, డీసీపీలు కమలాసన్‌రెడ్డి, డాక్టర్ రవిందర్, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, సుధీర్‌బాబు, రవి వర్మ, స్పెషల్ బ్రాంచ్ జాయింట్ పోలీసు కమిషనర్ వై.నాగిరెడ్డిలతో కమిషనర్ శనివారం ప్రత్యేకంగా సమావేశమై ఆరా తీశారు.  ముందు జాగ్రత్త గా జింఖానా గ్రౌండ్స్‌లో బాంబ్ స్క్వాడ్  పోలీసులు అణువణువు తనిఖీ చేపట్టారు.
 
రంగారెడ్డి, మహబూబ్‌నగర జిల్లాలోని శంకర్‌పల్లి, చేవేళ్ల, తాండూర్, వికారాబాద్, మహబూబ్‌నగర్ నుంచి వచ్చే వాహనాలు మెహదీపట్నం, మాసాబ్‌ట్యాంక్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1, పంజగుట్ట, బేగంపేట మీదు గా రసూల్‌పురాకు చేరుకోవాలి. ఈ వాహనాలను ఎయిర్ కార్గో వద్ద పార్క్ చేయాలి.
మెదక్,  రంగారెడ్డిలోని పటాన్‌చెరువు, సదాశివపేట్, జహిరాబాద్, కూకట్‌పల్లి నుంచి వచ్చే వాహనాలు బీహెచ్‌ఈఎల్, కూకట్‌పల్లి, అమీర్‌పేట, బేగంపేట మీదుగా పీజీ కాలేజ్‌కు చేరుకోవాలి. పీజీ కాలేజ్, క్లాసిక్ గార్డెన్, బాలమ్‌రాయ్, ఈద్గా ప్రాంతాల్లో పార్క్ చేయాలి.
మెదక్, రంగారెడ్డిలోని మెదక్, నర్సాపూర్, జీడిమెట్ల, బాలనగర్ నుంచి వచ్చే వాహనాలు నర్సాపూర్ చౌరస్తా, బోయిన్‌పల్లి జం క్షన్, తాడ్‌బండ్ మీదుగా బాలమ్‌రాయ్‌కు చేరుకోవాలి. ఇక్కడ మల్లారెడ్డి గార్డెన్, చందనాగార్డెన్, సేఫ్ ఎక్స్‌ప్రెస్, సీఎంఆర్ స్కూల్, అషిస్ గార్డెన్‌లో వాహనాలు పార్క్ చేయాలి.
నిజామాబాద్, నిర్మల్, మేడ్చల్, కామారెడ్డి, కుత్బుల్లాపూర్ నుంచి వచ్చే వాహనాలు మేడ్చల్, బోయిన్‌పల్లి, తాడ్‌బండ్ మీదుగా బాలమ్‌రాయ్‌కి చేరుకోవాలి.
మెదక్, కరీంనగర్, అదిలాబాద్, వరంగల్, రంగారెడ్డి  నుంచి కరీంనగర్ హైవే పై నుంచి వాహనాలు శామీర్‌పేట్, బొల్లారం, కార్ఖానా, ఎన్‌సీసీ గేట్, డైమండ్ పాయింట్ మీదుగా చేరుకుని ధోబీఘాట్, ఇంపిరయల్ గార్డెన్, రాజరాజేశ్వరీ గార్డెన్, గాయిత్రి గార్డెన్, అశోక్‌గార్డెన్, బోయిన్‌పల్లి మార్కెట్, ముడాపోర్టులో  పార్కింగ్ చేయాలి.
భువనగిరి, వరంగల్, ఘట్‌కేసర్, మల్కాజ్‌గిరి, కీసర నుంచి వచ్చే వాహనాలు ఉప్పల్, తార్నక, మెట్టుగడ్డ మీదుగా హైదరాబాద్ భవన్ సంగీత్‌కు చేరుకోవాలి. రైల్వే డిగ్రీ కాలేజ్, ఆర్‌సీసీ  గ్రౌండ్స్, సీఎస్‌ఐ, పీజీ కాలేజ్, కీస్ హై స్కూల్, ఓపెన్ గ్రౌండ్, ఎల్‌అండ్‌ఓ పీఎస్ వద్ద పార్క్ చేయాలి.
ఖమ్మం, నల్లగొండ నుంచి విజయవాడ హైవే మీదుగా వచ్చే వాహనాలు ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు, మలక్ పేట్, ఛాదర్‌ఘాట్, ఎంజే మార్కెట్, నాంపల్లి, తెలుగుతల్లి ఫ్లైవర్, లోయర్ ట్యాంక్‌బండ్, కవాడి గూడ మీదుగా బైబిల్ హౌస్‌కు చేరుకుని వాహనాలను మాత్రం ఎన్టీఆర్‌గార్డెన్, పబ్లిక్ గార్డెన్‌లో పార్క్ చే యాలి.
నల్లగొండ, మహబూబ్‌నగర్ లోని కొంత భాగం, యాచారం, యంచాల్, ఇబ్రహీంపట్నం నుంచి నాగార్జునసాగర్ హైవే నుంచి వాహనాలు సాగర్ రింగ్‌రోడ్డు, సైదాబాద్, చంచల్‌గూడ, మలక్‌పేట్, ఎంజే మార్కెట్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీదుగా బైబిల్ హౌస్‌కు చేరుకుని అక్కడ కార్యర్తలను దించివేసి వాహనాలు మాత్రం నిజాం కాలేజీలో పార్క్ చేయాలి.
కందుకూర్, మహేశ్వరం, మహబూబ్‌నగర్‌లోని కొంత భాగం నుంచి శ్రీశైలం హైవే మీదుగా వచ్చే వాహనాలు కందుకూర్, పహాడిషరీఫ్, సంతోష్‌నగర్ మీదుగా వచ్చి కర్బలా మైదానంలో కార్యకర్తలను దించివేసి వాహనాలను నెక్లెస్‌రోడ్‌లో పార్క్ చేయాలి.
మహబూబ్‌నగర్, శంషాబాద్, రాజేంద్రనగర్ నుంచి  కర్నూల్ హైవేపై నుంచి వచ్చే వాహనాలు అరాంఘర్ చౌరాస్తా, పీవీఎన్‌ఆర్ ఫ్లైఓ వర్, మాసాబ్‌ట్యాంక్, పంజగుట్ట, బేగంపేట మీదుగా రసూల్‌పురాకు చేరుకుని అక్కడ కార్యకర్తలను దించివేసి నెక్లెస్‌రోడ్డులో వాహనాలను పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
 
వీఐపీ కార్ల పార్కింగ్...
జింఖానా గ్రౌండ్, లంబారోడ్, ఆర్‌జీఆర్ సిద్ధాంతి కాలేజ్ , వెస్లీ డిగ్రీ కాలేజ్, లీ రాయల్ ప్యాలస్, చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయం, మహబూబియా కాలేజ్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్, సెంటనరీ హై స్కూల్, హరి హర కళా భవన్, ఎస్‌బీహెచ్ చౌరస్తా నుంచి ప్యాట్నీ చౌరస్తా వరకు, ఎస్‌బీహెచ్ చౌరస్తా నుంచి ప్లాజా చౌరస్తా వరకు, కె.యస్.బాలికల ఉన్నత పాఠశాలలో వీఐపీ కార్ల పార్కింగ్‌ను కేటాయించారు. ఆయా ప్రాంతాల్లో కేవలం 830 కార్లు మాత్రమే పార్క్ చేస్తారు.
 
డైవర్షన్ పాయింట్లు..
సురభి గార్డన్, టివోలి జంక్షన్ హాల్ దగ్గర- సాధారణ ట్రాఫిక్‌ను ప్లాజా వైపు వెళ్లడానికి అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను జూబ్లీ బస్టాండ్, స్వీకార్ ఉపకార్, వైఎంసీఏ, జెయింట్ జోస్ రోటరీ, బ్రూక్ బాండ్, సీటీఓ వైపు పంపిస్తారు.
సీటీఓ జంక్షన్-సాధారణ ట్రాఫిక్‌ను ప్లాజా వైపు వెళ్లడానికి అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను రాజీవ్‌గాధీ విగ్రహం, లీరాయల్, బ్రూక్‌బాండ్, టీవోలీ, స్వీకార్ ఉపకార్, వైఎంసీఏ, ప్యారడైజ్, ఎస్డీరోడ్, ప్యాట్నీ, క్లాక్‌టవర్ వైపు మళ్లిస్తారు.
 
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

కూకట్‌పల్లి: పరేడ్ గ్రౌండ్‌లో టీఆర్‌ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు కె. తారకరామారావు, పద్మారావు,  శ్రీనివాస్‌యాదవ్‌లు, కర్నె ప్రభాకర్, కూకట్‌పల్లి టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ పద్మారావులు శనివారం పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరిగే పార్టీ ఆవిర్భావ సభ ను విజయవంతం చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement