parking places
-
సాగితే ప్రయాణం.. ఆగితే ప్రమాదం
కొత్తూరు: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు అధికారులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. స్థానిక ట్రాఫిక్, సివిల్ పోలీసులు, హైవే సిబ్బంది రోడ్డుపక్కన ఇష్టారాజ్యంగా నిలుపుతున్న వాహనాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో విలువైన ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ప్రమాదాలు నిత్యకృత్యం మండల పరిధిలోని తిమ్మాపూర్ శివారులోని ఐఓసీఎల్(ఇండేన్ ఆయిల్ బాట్లింగ్ ప్లాంట్)కు చెందిన భారీ గ్యాస్ బుల్లెట్ వాహనాలను రోడ్డు పక్కనే నిలుపుతున్నారు. ఈ రహదారిపై వాహనాలు గంటకు దాదాపు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటాయి. వీవీఐపీలు, రాజకీయ ప్రముఖులతో పాటు ఆర్టీసీ, స్కూల్, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటోంది. అయితే, రోడ్డు పక్కనే నిలిపిన గ్యాస్ బుల్లెట్ వాహనాలను ఢీకొంటే.. ఆ ప్రమాద పరిస్థితిని ఊహించడం, నష్టాన్ని అంచనా వేయడం కష్టమే. వాహనాలను నిలుపుతున్న ప్రాంతానికి దగ్గరలో భారీగా గ్యాస్ నిల్వ ఉండే ప్రదేశం, పెట్రోల్ బంకులు ఉన్నాయి. అయినప్పటికీ రోడ్డు పక్కన నిలుపుతున్న గ్యాస్ బుల్లెట్ వాహనాల గురించి అటు పోలీసులు ఇటు ప్లాంట్ ప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగితే.. ఇక అంతే సంగతి కొత్తూరు మండల పరిధి తిమ్మాపూరు చెక్‌పోస్టు మొదలు షాద్‌నగర్ టోల్‌ప్లాజా వరకు విస్తరించి ఉంది. ఈ జాతీయ రహదారి కొత్తూరు, షాద్‌నగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఉంది. సుమారు 20 కిమీ మేర పొడవున్న ఈ రహదారిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే, అక్కడక్కడా పరిశ్రమల సమీపంలో భారీ వాహనాలు ఇష్టానుసారంగా నిలుపుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. టోల్‌ప్లాజా సిబ్బంది, పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా ఫలితం శూన్యం. రాత్రుల్లో ప్రమాదకరంగా నిలిపి ఉంచిన వాహనాలను వెనుక నుంచి ఢీకొన్న ఘటనల్లో అనేక మంది మృత్యువాత పడ్డారు. పరిశ్రమల సమీపంలో.. తిమ్మాపూరు, కొత్తూరు, నందిగామ, షాద్‌నగర్ ప్రాంతాల్లో పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. జాతీయ రహదారిపై ఎక్కువగా కొలువుదీరడంతో సరుకుల లోడింగ్, అన్ లోడింగ్‌కు భారీ లారీలు వస్తాయి. ఈ వాహనాలను నిర్వాహకులు రహదారిపైనే నిలుపుతున్నారు. కొన్నిసార్లు ఆర్డర్లు రాకపోవడంతో రోజుల తరబడి అవి అలాగే నిలిపి ఉంటున్నాయి. తిమ్మాపూరు ఐఓసీఎల్ పరిశ్రమకు వచ్చే భారీ గ్యాస్ బుల్లెట్ వాహనాలను పదుల సంఖ్యలో జాతీయ రహదారి పైనే పార్కింగ్ చేస్తున్నారు. జరిగిన ప్రమాదాలు ఇవీ.. జాతీయ రహదారిపై లారీలను నిలిపి ఉంచడంతో గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో పోలీసులు కూడా దుర్మరణం పాలయ్యారు. నందిగామ శివారులో ట్రాక్టర్, లారీ ఢీకొన్న ఘటనలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం వెల్లిన ఓ ఏఎస్సై, కానిస్టేబుల్‌ను వెనుక నుంచి మరో లారీ ఢీకొంది ఈ ప్రమాదంలో ఏఎస్సై చనిపోగా.. కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. సాంకేతిక లోపంతో తిమ్మాపూరు శివారులో ఆగిన కంటెయినర్‌ను వెనుక నుంచి వచ్చిన పదుల సంఖ్యలో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎంఎస్ఎన్ పరిశ్రమ ఎదురుగా నిలిపిన లారీని వెనక నుంచి వచ్చిన కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఇలాంటి ప్రమాదాలు పార్కింగ్‌ల ఇష్టారాజ్య పార్కింగ్తో జరుగుతున్నా పోలీసులు పరిష్కార చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. చర్యలు తీసుకుంటాం రహదారులపై వాహనాలను పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటాం. ఐఓసీఎల్‌తో పాటు ఇతర పరిశ్రమల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి పరిశ్రమల పరిధిలోనే పార్కింగ్ ఏర్పాట్లు చేసుకునేలా చూస్తాం. అయినప్పటికీ మార్పు రాకుంటే ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటాం. – రామకృష్ణ, రూరల్ సీఐ. షాద్‌నగర్ -
దోపిడీ టాకీస్!
కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్(పేరుమార్చాం) దసరా సెలువులకు కాస్త విశ్రాంతి దొరికిందని శుక్రవారం నగరంలోని ఓ ప్రముఖ సినిమాహాల్కు సినిమా చూసేందుకు వెళ్లాడు. బైక్‌ను పార్కింగ్‌స్థలంలో నిలిపి లోపలికి వెళ్తుండగా.. నిర్వాహకులు అడ్డుకున్నారు. ‘మీ బైక్‌కు పార్కింగ్ రుసుం చెల్లించాలి’ అని రశీదు చించి ఇచ్చారు. ఆశ్చర్యానికి గురైన శ్రీనివాస్ ‘ సుప్రీంకోర్టు పార్కింగ్ రుసుం వసూలు చెయొద్దంది కదా..?’ అని నిలదీశాడు. దానికి ‘ఇక్కడ వసూలు చేస్తాం. మాకు రూల్స్ వర్తించవు.. రుసుం కట్టే వెళ్లండి’ అని సినిమాహాల్ నిర్వాహకులు హుకుం జారీ చేశారు. ససేమీర అన్న శ్రీనివాస్‌పై ఒకింత దాడికి దిగారు. కోపోద్రిక్తుడైన శ్రీనివాస్ ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తానని అక్కడి నుంచి వెళ్లాడు. కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లోని పలు సిని మాహాళ్లలో నిర్వాహకులు ‘అంతా తమ ఇష్టం’గా వ్యవహరిస్తున్నారని సినిమాకు వెళ్లే ప్రేక్షకులు అంటున్నారు. నిత్యం ఉద్యోగ, వ్యాపారాలతో బిజీగా గడిపి... ఖాళీ సమయంలో కాస్త విశ్రాంతి కోసం సినిమా చూసేందుకు హాల్‌కు వెళ్తే.... నిలువుదోపిడీకి దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. బైక్‌పై వెళ్తే.. బండి లోపల పెట్టింది మొదలు... క్యాంటీన్లో కూడా అధిక ధరలకు తినుబండారాత విక్రయాలు చేస్తున్నారని, హాల్ ఆవరణలో కనీస భద్రతాచర్యలు కరువయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని నిలదీస్తే... దాడులకు సైతం దిగుతున్నారని ఆవేదన చెందుతున్నారు. పార్కింగ్ ఫీజు వసూలు.. సినిమా థియేటర్లలలో పార్కింగ్‌ఫీజు వసూలు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై ఈ ఏడాది ఆగస్టు 7వ తేదీన పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి, అప్పటి నగరపాలక కమిషనర్ శశాంకాలు నగరంలో ఉన్న సినిమాహాళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిందని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. దీంతో పాటు ప్రతీ థియేటర్లో నాణ్యమైన మెటల్ డిటెక్టర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అగ్ని ప్రమాద నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు. లేకుంటే థియేటర్లకు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఆదేశాలు బేఖాతర్.. ఉన్నతాధికారులు చెప్పినప్పటికీ నగరంలోని పలు సినిమాహాళ్ల నిర్వాహకులు నిబంధనలను పెడ చెవిన పెడుతున్నారు. అడ్డగోలుగా పార్కింగ్‌ఫీజు వసూలు చేస్తున్నారు. సినిమాకు వచ్చే ప్రేక్షకులకు సరైన వసతులు కల్పించడం లేదు. నాసిరకమైన ఫుడ్ అందుబాటులో ఉంచుతున్నారు. దాన్నీ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గతంలో పలు థియేటర్ల క్యాంటీన్లపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించినా... పద్ధతిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. ప్రశ్నిస్తే.. దాడులే.. నగర నడిఒడ్డున ఉన్న ఓ ప్రముఖ వ్యక్తికి చెందిన సినిమాహాల్ నిర్వాహకులు సినిమాకు వచ్చేవారిపట్ల రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఓ తహసీల్దార్ సినిమా చూడడానికి థియేటర్‌కు వెళ్లాడు. నిర్వాహకులు పార్కింగ్ ఫీజు అడిగారు. పార్కింగ్ ఫీజు వసూలు చేయెద్దని సుప్రీం ఆదేశాలు జారీ చేసిందని, ఫీజు కట్టనని చెప్పిన పాపానికి అతడిపై దాడికి యత్నించారు. నెట్టివేసి అవమానకరంగా మాట్లాడారు. ఈ విషయమై సదరు తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేసినా... వారు పట్టించుకున్న పాపాన పోలేదు. ఓ ఉన్నతాధికారికే న్యాయం జరగలేదంటే సామాన్యుడి పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ థియేటర్లో జరిగే అన్యాయాలను గురించి ప్రశ్నిస్తే... పట్టించునే వారే కరువయ్యారని శుక్రవారం సైతం దాడికి గురైన వ్యక్తి ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే.. కఠిన చర్యలు సినిమాహళ్లలో నిబంధనలు అతిక్రమించే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. సినిమాకు వచ్చే ప్రేక్షకులను ఇబ్బందులకు గురిచేస్తే సంబంధితశాఖతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. సినిమాహళ్లలో పార్కింగ్‌ఫీజు విషయంలో నిబంధనల ప్రకారం, భద్రత ప్రమాణాలు పాటించని వారిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలుకు పూనుకుంటాం.– తుల శ్రీనివాసరావు, వన్‌టౌన్ సీఐ, కరీంనగర్ -
పార్కింగ్ కష్టాలకు చెక్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మెట్రో పార్కింగ్ కష్టాలు ఒక్కొక్కటిగా తొలగుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నాంపల్లి, అమీర్‌పేట్ ఇంటర్ఛేంజ్మెట్రో స్టేషన్లకు అవసరమైన పార్కింగ్ స్థలాలు ఎట్టకేలకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సేకరించింది. సోమవారం అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఎవర్ కార్స్ సంస్థ అధీనంలో ఉన్న 1,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న పార్కింగ్ స్థలాన్ని మెట్రో అధికారులు సేకరించారు. స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు తమ వ్యక్తిగత వాహనాలను ఈ స్థలంలో నిలుపుకొనేందుకు వీలుగా హెచ్ఎండీఏ అధికారులు మెట్రోకు ఈ స్థలాన్ని కేటాయించారు. దీనిని తమకు రూ.15 కోట్లకు విక్రయించాలంటూ.. ఖాళీ చేసేందుకు ఎవర్కార్స్ సంస్థమొండికేసింది. దీంతో రంగంలోకి దిగిన మెట్రో అధికారులు ఆ సంస్థకు సంబంధించిన వస్తువులను పోలీసుల సహకారంతో సోమవారం బలవంతంగా తొలగించారు. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ అన్ని వసతులతో పార్కింగ్ స్థలం ఏర్పాటుచేస్తా మని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపా రు. మెట్రో స్టేషన్లకు సమీపంలో ప్రభుత్వం కేటాయించిన పార్కింగ్ స్థలాల సేకరణ జటిలంగా మారినప్పటికీ ప్రభుత్వ సహకారంతో ఒక్కో సమస్యను అధిగమిస్తున్నామన్నారు. నాంపల్లిలోనూ.. ఇక నాంపల్లి మెట్రో స్టేషన్.. రైల్వే స్టేషన్ మధ్యలోని 2,800 చదరపు అడుగుల ప్రభుత్వ స్థలాన్ని సైతం మెట్రో పార్కింగ్‌కు కేటాయించారు. సుమారు రూ.28 కోట్ల విలువైన ఈ స్థలాన్ని ప్రైవేటు ట్యాక్సీ అసోసియేషన్లు ఆక్రమించాయి. ఇటీవలే ఆక్రమణలను తొలగించి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో మెట్రో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు బస్బేతో పాటు ఆధునిక సౌకర్యాలతో వెహికిల్ బే, అత్యాధునిక మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. మెట్రో విద్యుదీకరణ పనులు భేష్ సాక్షి, సిటీబ్యూరో: నగరమెట్రో ప్రాజెక్టులో భాగంగా మలక్‌పేట్ నుంచి మూసారాంబాగ్ రూట్లో మెట్రో కారిడార్ల విద్యుదీకరణ పనులను కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (ఈసీఐజీ) డీవీఎస్‌రాజు సోమవారం తనిఖీ చేశారు. ఈ మార్గంలో 33,415 కెవి ఇండోర్ సబ్స్టేషన్లను తనిఖీచేసి పనుల పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ మార్గంలో స్టేషన్లు,ట్రాక్ విద్యుదీకరణ పనులతోపాటు సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్స్, ఆటోమేటిక్ టికెట్ కలెక్టింగ్ యంత్రాల వ్యవస్థను పరిశీలించారు. కాగా ఈ సబ్స్టేషన్లకు ఎంజీబీఎస్ వద్ద ఏర్పాటు చేసిన భారీ రిసీవింగ్ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఈ సబ్స్టేషన్ల పూర్తితో ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకలకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతోందని డీవీఎస్ రాజు తెలిపారు. ఆయన వెంట మెట్రో ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.పి.నాయుడు తదితరులున్నారు. -
ట్రాఫిక్ ఆంక్షలు తప్పనిసరి
అరసవల్లి: రథసప్తమి ఉత్సవం సందర్భంగా అరసవల్లి పరిసర ప్రాంతాలతో పాటు నగరంలో కూడా పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని, ఈ నిబంధనలను అందరూ పాటించి సహకరించాలని ట్రాఫిక్ డీ ఎస్పీ సీహెచ్ పెంటారావు కోరారు. శనివారం ఉదయం ఆయన అరసవల్లి ప్రాంతంలో పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా ఎస్పీ త్రివిక్రమ వర్మ ఆదేశాల మేరకు ఈనెల 23 రాత్రి నుంచి 24 వ తేది రాత్రి వరకు (రథసప్తమి ఉత్సవం ముగిసినంత వరకు) ట్రాఫిక్ సంబంధించి పలు నిబంధనలను విధించామన్నారు. ముఖ్యంగా అరసవల్లికి వచ్చే వాహనా లన్నీ దాదాపుగా 80 ఫీట్ రోడ్డులోనే నిలిపివేస్తామని, కేవలం వీవీఐపీలు, జిల్లా స్థాయి ఉన్నతాధికారుల వాహనాలు మాత్రమే అరసవల్లి జంక్షన్‌ను దాటి అనుమతిస్తామని, మళ్లీ ఇందులో కూడా మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలు మాత్రమే ఆలయ ప్రధాన ముఖ ద్వారం (ఆర్చిగేటు) వరకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే మొత్తం పార్కింగ్ కోసమే 12 స్థలాలను ఏర్పాటు చేశామని వివరించారు. ► శ్రీకాకుళం నగరం నుంచి అరసవల్లి వైపుగా వచ్చిన వారి వాహనాలకు 80 ఫీట్ రోడ్డులోనే బైకులు, కార్లు, బస్సులకు వేర్వేరుగా 7 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ► అలాగే గార నుంచి వచ్చే వాహనాల కోసం వాడాడ కూడలి లోనూ, అరసవల్లి అసిరితల్లి ఆలయం వద్ద వేర్వేరుగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామన్నారు. ► గార నుంచి నగరానికి వచ్చే బస్సులు, ఇతర వాహనాలన్నీ వాడాడ మీదుగా కలెక్టరేట్, ఓబీఎస్ మీదుగా వెళ్లాలని సూచించారు. ► నగరం నుంచి గార, శ్రీకూర్మం వైపు వెళ్లే వాహనాలు కూడా జాతీయ రహదారి మీదుగా వెళ్లి, అంపోలు (జిల్లా జైలు రోడ్డు) మీదుగా ఓ మార్గంలో వెళ్లాలని, అలాగే సింగుపురం (బూరవల్లి రోడ్డు) మీదుగా కొన్ని వాహనాలు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ► శ్రీకాకుళం నగరంలో కూడా రథసప్తమి రోజున పూర్తిగా వన్‌వే విధానాన్ని అమలు చేస్తున్నామని, అరసవల్లి రావాల్సిన అన్ని వాహనాను కాంప్లెక్స్, రామలక్ష్మణ కూడలి, సూర్యామహల్ మీదుగా అరసవల్లి జంక్షన్ (80 ఫీట్ రోడ్డు)కు చేరుకుంటాయని, తిరిగి వెళ్లే వాహనాలన్నీ మిల్లు జంక్షన్ నుంచి ఓబీఎస్ మీదుగా నగరంలోకి వెళ్లాలని, అలాగే జీటీ రోడ్డును కూడా వెళ్లే మార్గంగానే గుర్తించామని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు కచ్చితంగా పౌరులంతా పాటించాలని లేదంటే చర్యలు తప్పవని అన్నారు. ఆయన వెంట సిఐ బి.ప్రసాదరావు, వన్‌టౌన్ ఎస్సై చిన్నంనాయుడు తదితరులున్నారు. -
పార్కింగ్ స్థల పరిశీలన
చింతపల్లి : కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తుల వాహనాలను నిలిపేందుకు మండల పరిధిలోని వింజమూరు సమీపంలో ఏర్పాటు చేస్తున్న పార్కింగ్ స్థలాన్ని మంగళవారం ఆర్డీఓ గంగాధర్, డీఎస్పీ చంద్రమోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాగార్జునసాగర్, అజ్మాపురం, పెద్దమునిగల్, కాచరాజుపల్లి పుష్కర ఘాట్ల వద్ద భక్తుల రద్దీ ఎక్కువైతే హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలను వింజమూరు వద్ద నిలిపివేసేందుకు సుమారు 70 ఎకరాల స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్కింగ్ వద్ద భక్తుల కోసం మూత్రశాలలు, మరుగుదొడ్లు, రోడ్డు, విద్యుత్,తాగునీటి వసతి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. పుష్కరాలను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్ ఏఈ జీవన్‌సింగ్, డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్ఐ మల్లారెడ్డి, వీఆర్వోలు మల్లయ్య, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంత దారుణమా..?
- పుష్కరాల పనుల్లో జిల్లా వెనుకబడింది - ఇంకెప్పుడు పూర్తి చేస్తారు - పార్కింగ్ స్థలాలు అవసరమో లేదో తెలియదా..? - ప్రపోజల్స్, పనులు చూస్తే నవ్విపోతారు - పంచాయతీరాజ్ ఇంజినీర్లపై ఈఎన్సీ సత్యనారాయణరెడ్డి అసహనం ఇందూరు : ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా నిర్వహించే పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిద్దామని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కానీ, మీరేమో ఇక్కడ ఒక్క పని కూడా పూర్తి చేయలేదు. పుష్కర ఘాట్ల వద్ద పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా మీకు రాలేదా..? ఈ ప్రపోజల్స్‌ను... పనులను ఎవరికైనా చూపిస్తే నవ్విపోతారు. ఇంత దారుణంగా ఏ జిల్లాలో లేదు. నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా.. పట్టించుకున్న నాథుడే లే డు.’ అని పంచాయతీ రాజ్ ఇంజనీర్ ఇన్ ఛీఫ్ (ఈఎన్సీ) ఎం. సత్య నారాయణరెడ్డి పంచాయతీ రాజ్ ఇంజినీర్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గురువారం జిల్లా సందర్శనకు వచ్చిన ఆయన పలు మండలాలను పర్యటించి పుష్కర ఘాట్ల వద్ద చేపడుతున్న పనులను పర్యవేక్షించారు. అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకుని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఇంజినీర్ అధికారులు, కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో 433 ప్యాకేజీలకు, 3420 రోడ్లు వేస్తున్నామన్నారు. నిజామాబాద్‌లో 16 పుష్కర ఘాట్లకు గాను 15 ఘాట్లకు టెండర్లు నిర్వహించగా, ఇందులో మూడింటికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో టెండర్లు రాలేదని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు పనుల విషయంలో తికమకపడుతున్నారని, గత సమావేశంలో అన్ని వివరించి చెప్పినా ఇంజనీర్లకు అర్థం కాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలో ప్రారంభించిన పనులు ఏ ఒక్కటి కూడా ముందుకు కదలడం లేదని, గ్రౌండింగ్, ప్రోగ్రెస్, పర్ఫామెన్స్లో దారుణంగా ఉందని అన్నారు. ఇలాగైతే పనులెప్పుడు పూర్తి చేస్తారని మండిపడ్డారు. ఎక్కువ జన తాకిడి ఉండే కందకుర్తి ఘాట్‌లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయకపోవడం దారుణమని, ఇదొక్కటే కాకుండా చాలా చోట్ల పార్కింగ్ స్థలాలు నిర్మించకుండా పనులు చేపట్టడం సిగ్గుచేటన్నారు. పుష్కర పనులపై సీఎం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, ఉన్నతాధికారులపై ఒత్తిడి తీవ్రం గా ఉందని చెప్పారు. సమష్టిగా పని చేసి జిల్లా రూపు రేఖలు మార్చాలని సూచించారు. జూన్ 15 గడువు... పుష్కరాల పనులపై చాలా ఒత్తిడి ఉందని, ఇంకా నెల న్నర సమయం ఉందని, ఏ మాత్రం ఆలస్యం చేయొద్దని ఇం జినీర్లకు సూచించారు. ప్రారంభమైన పనులను, టెండర్లు రాని పనులను జూన్ 15వ తేదీలోగా పూర్తి చేయూలని ఆదేశించారు. గతంలో నిజామాబాద్‌లో ఐదు పుష్కర ఘాట్లు ఉంటే, 11 కొత్త వాటితో కలుపుకుని మొత్తం 16 ఘాట్లు పూర్తి చేయాలని సూచించారు. అన్ని ఘాట్ల వద్ద పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఏర్పాటు చేయని వాటికి కలెక్టర్ ద్వారా ప్రపోజల్స్‌ను 24 గంటల్లో తనకు పంపించాలని పంచాయతీరాజ్ ఎస్ఈ సత్యమూర్తిని ఆదేశించారు.60 శాతం పనులు పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను బాధ్యులను చేయాల్సి ఉంటుం దని హెచ్చరించారు. ఆర్అండ్బీ రోడ్డు నుంచి పుష్కర ఘాట్ వరకు రోడ్లు వేయడం, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయ డం పంచాయతీరాజ్ శాఖ ప్రధాన ఉద్దేశమన్నారు. చేసే పనులు నాణ్యంగా ఉండాలన్నారు. అనంతరం ఎంఆర్ఆర్, ఆర్ఐడీఎఫ్, బీఆర్జీఎఫ్, నాబార్డు, 13వ ఆర్థిక సంఘం, తదితర పథకాల నిధుల ద్వారా చేపడుతున్న భవనాలు, రోడ్డు పనులు, వాటి పురోగతిపై సమీక్షించారు. పీఆర్ డిప్యూటీ డీఈ జలేందర్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
బహిరంగసభకు భారీ బందోబస్తు
సాక్షి, సిటీబ్యూరో: జింఖానా గ్రౌండ్లో సోమవారం నిర్వహించనున్న టీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు పటిష్ట భద్రత కల్పిస్తున్నారు. 4వేల మంది పోలీసులతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వీఐపీల వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలు కేటాయించారు. అలాగే జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు పార్కింగ్ ప్రదేశాలు కేటాయించారు. ఏ జిల్లా వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేయాలో ఇప్పటికే నాయకులకు తెలియజేశారు. ఈ మేరకు ట్రాఫిక్ చీఫ్ జితేందర్, డీసీపీలు రంగనాథ్, చౌహాన్, అదనపు పోలీసు కమిషనర్ అంజనీకుమార్, డీసీపీలు కమలాసన్‌రెడ్డి, డాక్టర్ రవిందర్, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, సుధీర్‌బాబు, రవి వర్మ, స్పెషల్ బ్రాంచ్ జాయింట్ పోలీసు కమిషనర్ వై.నాగిరెడ్డిలతో కమిషనర్ శనివారం ప్రత్యేకంగా సమావేశమై ఆరా తీశారు. ముందు జాగ్రత్త గా జింఖానా గ్రౌండ్స్‌లో బాంబ్ స్క్వాడ్ పోలీసులు అణువణువు తనిఖీ చేపట్టారు. ⇒ రంగారెడ్డి, మహబూబ్‌నగర జిల్లాలోని శంకర్పల్లి, చేవేళ్ల, తాండూర్, వికారాబాద్, మహబూబ్‌నగర్ నుంచి వచ్చే వాహనాలు మెహదీపట్నం, మాసాబ్‌ట్యాంక్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1, పంజగుట్ట, బేగంపేట మీదు గా రసూల్‌పురాకు చేరుకోవాలి. ఈ వాహనాలను ఎయిర్ కార్గో వద్ద పార్క్ చేయాలి. ⇒ మెదక్, రంగారెడ్డిలోని పటాన్చెరువు, సదాశివపేట్, జహిరాబాద్, కూకట్పల్లి నుంచి వచ్చే వాహనాలు బీహెచ్ఈఎల్, కూకట్పల్లి, అమీర్‌పేట, బేగంపేట మీదుగా పీజీ కాలేజ్‌కు చేరుకోవాలి. పీజీ కాలేజ్, క్లాసిక్ గార్డెన్, బాలమ్రాయ్, ఈద్గా ప్రాంతాల్లో పార్క్ చేయాలి. ⇒ మెదక్, రంగారెడ్డిలోని మెదక్, నర్సాపూర్, జీడిమెట్ల, బాలనగర్ నుంచి వచ్చే వాహనాలు నర్సాపూర్ చౌరస్తా, బోయిన్పల్లి జం క్షన్, తాడ్‌బండ్ మీదుగా బాలమ్రాయ్కు చేరుకోవాలి. ఇక్కడ మల్లారెడ్డి గార్డెన్, చందనాగార్డెన్, సేఫ్ ఎక్స్‌ప్రెస్, సీఎంఆర్ స్కూల్, అషిస్ గార్డెన్లో వాహనాలు పార్క్ చేయాలి. ⇒ నిజామాబాద్, నిర్మల్, మేడ్చల్, కామారెడ్డి, కుత్బుల్లాపూర్ నుంచి వచ్చే వాహనాలు మేడ్చల్, బోయిన్పల్లి, తాడ్‌బండ్ మీదుగా బాలమ్రాయ్కి చేరుకోవాలి. ⇒ మెదక్, కరీంనగర్, అదిలాబాద్, వరంగల్, రంగారెడ్డి నుంచి కరీంనగర్ హైవే పై నుంచి వాహనాలు శామీర్‌పేట్, బొల్లారం, కార్ఖానా, ఎన్సీసీ గేట్, డైమండ్ పాయింట్ మీదుగా చేరుకుని ధోబీఘాట్, ఇంపిరయల్ గార్డెన్, రాజరాజేశ్వరీ గార్డెన్, గాయిత్రి గార్డెన్, అశోక్‌గార్డెన్, బోయిన్పల్లి మార్కెట్, ముడాపోర్టులో పార్కింగ్ చేయాలి. ⇒ భువనగిరి, వరంగల్, ఘట్కేసర్, మల్కాజ్గిరి, కీసర నుంచి వచ్చే వాహనాలు ఉప్పల్, తార్నక, మెట్టుగడ్డ మీదుగా హైదరాబాద్ భవన్ సంగీత్‌కు చేరుకోవాలి. రైల్వే డిగ్రీ కాలేజ్, ఆర్సీసీ గ్రౌండ్స్, సీఎస్ఐ, పీజీ కాలేజ్, కీస్ హై స్కూల్, ఓపెన్ గ్రౌండ్, ఎల్‌అండ్‌ఓ పీఎస్ వద్ద పార్క్ చేయాలి. ⇒ ఖమ్మం, నల్లగొండ నుంచి విజయవాడ హైవే మీదుగా వచ్చే వాహనాలు ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు, మలక్ పేట్, ఛాదర్‌ఘాట్, ఎంజే మార్కెట్, నాంపల్లి, తెలుగుతల్లి ఫ్లైవర్, లోయర్ ట్యాంక్‌బండ్, కవాడి గూడ మీదుగా బైబిల్ హౌస్‌కు చేరుకుని వాహనాలను మాత్రం ఎన్టీఆర్గార్డెన్, పబ్లిక్ గార్డెన్లో పార్క్ చే యాలి. ⇒ నల్లగొండ, మహబూబ్‌నగర్ లోని కొంత భాగం, యాచారం, యంచాల్, ఇబ్రహీంపట్నం నుంచి నాగార్జునసాగర్ హైవే నుంచి వాహనాలు సాగర్ రింగ్‌రోడ్డు, సైదాబాద్, చంచల్‌గూడ, మలక్‌పేట్, ఎంజే మార్కెట్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీదుగా బైబిల్ హౌస్‌కు చేరుకుని అక్కడ కార్యర్తలను దించివేసి వాహనాలు మాత్రం నిజాం కాలేజీలో పార్క్ చేయాలి. ⇒ కందుకూర్, మహేశ్వరం, మహబూబ్‌నగర్‌లోని కొంత భాగం నుంచి శ్రీశైలం హైవే మీదుగా వచ్చే వాహనాలు కందుకూర్, పహాడిషరీఫ్, సంతోష్‌నగర్ మీదుగా వచ్చి కర్బలా మైదానంలో కార్యకర్తలను దించివేసి వాహనాలను నెక్లెస్‌రోడ్‌లో పార్క్ చేయాలి. ⇒ మహబూబ్‌నగర్, శంషాబాద్, రాజేంద్రనగర్ నుంచి కర్నూల్ హైవేపై నుంచి వచ్చే వాహనాలు అరాంఘర్ చౌరాస్తా, పీవీఎన్ఆర్ ఫ్లైఓ వర్, మాసాబ్‌ట్యాంక్, పంజగుట్ట, బేగంపేట మీదుగా రసూల్‌పురాకు చేరుకుని అక్కడ కార్యకర్తలను దించివేసి నెక్లెస్‌రోడ్డులో వాహనాలను పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. వీఐపీ కార్ల పార్కింగ్... జింఖానా గ్రౌండ్, లంబారోడ్, ఆర్జీఆర్ సిద్ధాంతి కాలేజ్ , వెస్లీ డిగ్రీ కాలేజ్, లీ రాయల్ ప్యాలస్, చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయం, మహబూబియా కాలేజ్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్, సెంటనరీ హై స్కూల్, హరి హర కళా భవన్, ఎస్బీహెచ్ చౌరస్తా నుంచి ప్యాట్నీ చౌరస్తా వరకు, ఎస్బీహెచ్ చౌరస్తా నుంచి ప్లాజా చౌరస్తా వరకు, కె.యస్.బాలికల ఉన్నత పాఠశాలలో వీఐపీ కార్ల పార్కింగ్‌ను కేటాయించారు. ఆయా ప్రాంతాల్లో కేవలం 830 కార్లు మాత్రమే పార్క్ చేస్తారు. డైవర్షన్ పాయింట్లు.. ⇒ సురభి గార్డన్, టివోలి జంక్షన్ హాల్ దగ్గర- సాధారణ ట్రాఫిక్‌ను ప్లాజా వైపు వెళ్లడానికి అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను జూబ్లీ బస్టాండ్, స్వీకార్ ఉపకార్, వైఎంసీఏ, జెయింట్ జోస్ రోటరీ, బ్రూక్ బాండ్, సీటీఓ వైపు పంపిస్తారు. ⇒ సీటీఓ జంక్షన్-సాధారణ ట్రాఫిక్‌ను ప్లాజా వైపు వెళ్లడానికి అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను రాజీవ్గాధీ విగ్రహం, లీరాయల్, బ్రూక్‌బాండ్, టీవోలీ, స్వీకార్ ఉపకార్, వైఎంసీఏ, ప్యారడైజ్, ఎస్డీరోడ్, ప్యాట్నీ, క్లాక్‌టవర్ వైపు మళ్లిస్తారు. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు కూకట్పల్లి: పరేడ్ గ్రౌండ్లో టీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు కె. తారకరామారావు, పద్మారావు, శ్రీనివాస్‌యాదవ్‌లు, కర్నె ప్రభాకర్, కూకట్పల్లి టీఆర్ఎస్ ఇన్చార్జ్ పద్మారావులు శనివారం పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరిగే పార్టీ ఆవిర్భావ సభ ను విజయవంతం చేయాలని సూచించారు. -
పార్కింగ్ ప్లేసే... ఓ చిన్న విద్యుత్ ప్లాంట్
ప్రత్యేకమైన టైల్స్‌తో సిద్ధం చేసిన పార్కింగ్ ప్లేస్ ఇది. దీని ద్వారా రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వాహనాలను పార్క్ చేసుకోవడంతోపాటు ఈ టైల్స్‌పై పడే సూర్యుడి శక్తి విద్యుత్తుగా మారిపోతుంది. అందుకు వీలుగా సోలార్ ప్యానెళ్లను ఈ టైల్స్ అడుగుభాగంలో ఏర్పాటు చేశారు. పన్నెండు అడుగుల పొడవు, వెడల్పు ఉండే షట్భుజి ఆకారపు టైల్స్‌ను బాగా గట్టిపరిచిన గాజుతో తయారు చేశారు స్కాట్, జూలీ బర్సౌ దంపతులు. ఫొటోలో కనిపిస్తోంది ఆ జంటే. గాజు పొరకు దిగువన ఒక్కో టైల్లో 69 శాతం విస్తీర్ణంలో సోలార్ ప్యానెల్, ఒకట్రెండు ఎల్ఈడీ లైట్లు, సర్క్యూట్లూ ఉంటాయి. ఈ పార్కింగ్ ప్లేస్‌పై పడే వెలుతురును బట్టి గరిష్టంగా 3,600 వాట్ల విద్యుత్తు తయారు చేయవచ్చునని వీరు చెబుతున్నారు. ఎనిమిదేళ్ల క్రితం తాము మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పుడిప్పుడే వాణిజ్యస్థాయికి చేరుతోందని, ఈ టైళ్లను పార్కింగ్‌కు మాత్రమే కాకుండా హైవేల్లోనూ వాడుకోవచ్చని, తద్వారా మరింత పర్యావరణహిత విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చని చెప్పారు. -
పార్కింగ్ స్థలంలో నిర్మాణాలపై ఆందోళన
అల్లిపురం, న్యూస్‌లైన్ : జ్ఞానాపురం హోల్‌సేల్ మార్కెట్లో పార్కింగ్ స్థలాన్ని యథాతధంగా ఉంచాలని హోల్‌సేల్ విజిటబుల్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కె.రాము, కొణతాల వీర్రాజు డిమాండ్ చేశారు. కమిషనర్ శివధర్‌రెడ్డికి సమస్యను విన్నవించేందుకు అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది వర్తకులు శనివారం పోలీసు కమిషనరేట్‌కు రాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు కొంతసేపు గేటు ముందు ఆందోళన చేశారు. మహారాణిపేట జోన్ సీఐ ఆర్.మల్లికార్జునరావు అక్కడికి చేరుకుని ఐదుగురు వ్యాపారులను కమిషనర్ వద్దకు తీసుకువెళ్లారు. షాపుల నిర్మాణంపై హై కోర్టులో స్టే ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించి ఓ వ్యక్తి నిర్మాణాలు చేపడుతున్నారని వారు కమిషనర్‌కు తెలిపారు. పోలీసులు అక్రమార్కులకు వత్తాసు పలకటమే కాకుండా దగ్గరుండి నిర్మాణాన్ని పూర్తి చేయిస్తున్నారని పేర్కొన్నారు. శనివారం హోల్‌సేల్ మార్కెట్ బంద్ చేశామని, తమకు న్యాయం జరిగే వరకు మార్కెట్ తెరిచేది లేదని స్పష్టం చేశారు. వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. కమిషనర్‌ను కలిసిన వారిలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అడబాల నారాయణమూర్తి, న్యాయవాది కొనతాల ప్రతాప్, పొలమర శెట్టి వెంకట సత్యనారాయణ, కోరిబిల్లి ప్రసాద్, పి.సత్తిబాబు, ఎం.రామకృష్ణ, ఆటో డ్రైవర్ల యూనియన్ ప్రతినిధులు ఉన్నారు. -
కెమెరా కంటికి చిక్కిన బైకు దొంగలు!!
జంట నగరాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇప్పుడో కొత్తరకం దొంగతనాలు మొదలయ్యాయి. పార్కింగులో ఉన్న వాహనాలను చాకచక్యంగా లేపేస్తున్నారు. పొరపాటున ఆదమరచి ఉన్నా, ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా ఏమాత్రం వాహనాలకు గ్యారంటీ ఉండట్లేదు. ముఖ్యంగా సైకిళ్లు, బైకులు ఇలాంటి చోరీలకు గురవుతున్నాయి. బైకులు మెరుపు వేగంతో మాయమైపోతున్నాయి. వేలరూపాయలు పోసి సొంత బైకు కొనుక్కున్న ఆనందం ఇంకా తీరకముందే ఆ బైకు ఏ షాపింగ్ కాంప్లెక్సులోనో పార్కింగ్ చేస్తే.. నిమిషాల్లో మాయం అయిపోతోంది. అలాగని బయటే పెట్టక్కర్లేదు. కాస్త రద్దీ ప్రాంతంలో మీ ఇల్లు ఉన్నా కూడా.. ఇంటి ముందు నిలిపి ఉంచిన వాహనాలను కూడా చకచకా తీసుకెళ్లిపోతున్నారు. అసలు ఎవరూ గుర్తించని వాహనాన్ని చూస్తే చాలు.. వాళ్ల చేతులకు దురద మొదలైపోతుంది. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమోనని చూడటం, తమను ఎవరూ గమనించకపోతే లైన్ క్లియరైపోయిందని వెంటనే రంగంలోకి దూకుతారు. క్షణాల్లో డ్యూటీకెక్కుతారు. కుదిరితే మారుతాళంతో బైకు తాళం తీస్తారు. వీలైతే తోసుకుంటూ వెళ్లిపోతారు. ఇక సైకిళ్లనయితే, చిన్న పిల్లలు కూడా ఎంచక్కా పార్కింగ్ ప్రదేశాలలోకి వెళ్లి, దొరల్లా తొక్కుకుంటూ వెళ్లిపోతున్నారు. సొంత సైకిల్ కూడా అంత దర్జాగా ఎవరూ తీసుకెళ్లలేరన్నంత ధీమాగా వాళ్లు వెళ్తున్నారు. బైకు లేదా సైకిల్ చోరీ అయ్యిందని యజమాని చూసుకునే వరకూ మూడో కంటికి కూడా విషయం తెలియడు. దొంగల పనితనం అంత అద్భుతంగా ఉంటోంది మరి. ఈ కొత్త తరహా దొంగతనాలు చూసి పోలీసులు తల పట్టుకుంటున్నారు.