అల్లిపురం, న్యూస్‌లైన్ : జ్ఞానాపురం హోల్‌సేల్ మార్కెట్‌లో పార్కింగ్ స్థలాన్ని యథాతధంగా ఉంచాలని హోల్‌సేల్ విజిటబుల్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కె.రాము, కొణతాల వీర్రాజు డిమాండ్ చేశారు. కమిషనర్ శివధర్‌రెడ్డికి సమస్యను విన్నవించేందుకు అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది వర్తకులు శనివారం పోలీసు కమిషనరేట్‌కు రాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు కొంతసేపు గేటు ముందు ఆందోళన చేశారు. మహారాణిపేట జోన్ సీఐ ఆర్.మల్లికార్జునరావు అక్కడికి చేరుకుని ఐదుగురు వ్యాపారులను కమిషనర్ వద్దకు తీసుకువెళ్లారు. షాపుల నిర్మాణంపై హై కోర్టులో స్టే ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించి ఓ వ్యక్తి నిర్మాణాలు చేపడుతున్నారని వారు కమిషనర్‌కు తెలిపారు.
పోలీసులు అక్రమార్కులకు వత్తాసు పలకటమే కాకుండా దగ్గరుండి నిర్మాణాన్ని పూర్తి చేయిస్తున్నారని పేర్కొన్నారు. శనివారం హోల్‌సేల్ మార్కెట్ బంద్ చేశామని, తమకు న్యాయం జరిగే వరకు మార్కెట్ తెరిచేది లేదని స్పష్టం చేశారు. వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. కమిషనర్‌ను కలిసిన వారిలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అడబాల నారాయణమూర్తి, న్యాయవాది కొనతాల ప్రతాప్, పొలమర శెట్టి వెంకట సత్యనారాయణ, కోరిబిల్లి ప్రసాద్, పి.సత్తిబాబు, ఎం.రామకృష్ణ, ఆటో డ్రైవర్ల యూనియన్ ప్రతినిధులు ఉన్నారు.
పార్కింగ్ స్థలంలో నిర్మాణాలపై ఆందోళన
Published Sun, Dec 22 2013 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM
Advertisement
Advertisement