పార్కింగ్ ప్లేసే... ఓ చిన్న విద్యుత్ ప్లాంట్ | Parking place is designed with special Tiles for Small power plant | Sakshi
Sakshi News home page

పార్కింగ్ ప్లేసే... ఓ చిన్న విద్యుత్ ప్లాంట్

Published Tue, Apr 29 2014 4:09 AM | Last Updated on Mon, Oct 22 2018 8:26 PM

పార్కింగ్ ప్లేసే... ఓ చిన్న విద్యుత్ ప్లాంట్ - Sakshi

పార్కింగ్ ప్లేసే... ఓ చిన్న విద్యుత్ ప్లాంట్

ప్రత్యేకమైన టైల్స్‌తో సిద్ధం చేసిన పార్కింగ్ ప్లేస్ ఇది. దీని ద్వారా రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వాహనాలను పార్క్ చేసుకోవడంతోపాటు ఈ టైల్స్‌పై పడే సూర్యుడి శక్తి విద్యుత్తుగా మారిపోతుంది. అందుకు వీలుగా సోలార్ ప్యానెళ్లను ఈ టైల్స్ అడుగుభాగంలో ఏర్పాటు చేశారు. పన్నెండు అడుగుల పొడవు, వెడల్పు ఉండే షట్భుజి ఆకారపు టైల్స్‌ను బాగా గట్టిపరిచిన గాజుతో తయారు చేశారు స్కాట్, జూలీ బర్‌సౌ దంపతులు.
 
 ఫొటోలో కనిపిస్తోంది ఆ జంటే. గాజు పొరకు దిగువన ఒక్కో టైల్‌లో 69 శాతం విస్తీర్ణంలో సోలార్ ప్యానెల్, ఒకట్రెండు ఎల్‌ఈడీ లైట్లు, సర్క్యూట్లూ ఉంటాయి. ఈ పార్కింగ్ ప్లేస్‌పై పడే వెలుతురును బట్టి గరిష్టంగా 3,600 వాట్ల విద్యుత్తు తయారు చేయవచ్చునని వీరు చెబుతున్నారు. ఎనిమిదేళ్ల క్రితం తాము మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పుడిప్పుడే వాణిజ్యస్థాయికి చేరుతోందని, ఈ టైళ్లను పార్కింగ్‌కు మాత్రమే కాకుండా హైవేల్లోనూ వాడుకోవచ్చని, తద్వారా మరింత పర్యావరణహిత విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement