ridings
-
ఖమ్మంలో 31 వాటర్ ప్లాంట్ల సీజ్
సాక్షి, ఖమ్మం అర్భన్ : ఖమ్మంలోని వాటర్ ప్లాంట్లపై కార్పోరేషన్, రెవెన్యూ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏకకాలంలో మెరుపుదాడులు చేశారు. 31 ప్లాంట్లను సీజ్ చేశారు. హైకోర్ట్ ఆదేశాలతో ఈ దాడులు చేసినట్టు ప్లాంట్ల యజమానులతో చెప్పారు. ఇదీ నేపథ్యం ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకుని నిబంధనల ప్రకారంగా వాటర్ ప్లాంట్లు నడుపుతున్న తాము.. ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటైన ప్లాంట్ల కారణంగా నష్టపోతున్నామంటూ కొందరు (ప్లాంట్ల యజమానులు) గతంలో ఆందోళనకు దిగారు. దీనిపై సంబందిత అధికారులు స్పందించనట్టయితే తామంతా ప్లాంట్లు బంద్ చేస్తామన్నారు. ప్లాంట్ల యజమానుల సంఘం నాయకులతో ఆర్డీఓ చర్చించారు. అనుమతి లేని ప్లాంట్లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో సంఘం ఆధ్వర్యంలో ప్లాంట్ల యజమానులు ఆందోళన విరమించారు. ఈ దాడులు ఎందుకంటే... అనుమతి, ట్రేడ్ లైసెన్స్ లేని, నిబంధనలు పాటించని వాటర్ ప్లాంట్లు నగరంలో 31 ఉన్నట్టుగా గుర్తించి, వాటిని సీజ్ చేసినట్లు ఖమ్మం కార్పోరేషన్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్ కృష్ణఫర్ తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో నగరంలోని ఖానాపురం, బల్లేపల్లి, పాండురంగాపురం, కైకొండాయిగూడెం, బైపాస్ రోడ్డు తదితర ప్రాంతాల్లోని ప్లాంట్లపై దాడులు చేశారు. సీజ్ చేయడానికి ముందుగానే వీటి యజమానులకు నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు. కొన్ని ప్లాంట్లలో నిర్వహణ లోపాలను, అపరిశుభ్రతను చూసిన అధికారులు నివ్వెర పోయారు. ‘‘శుద్ధ జలం పేరుతో జనానికి అంటగడుతున్నది ఈ నీళ్లా..?’’ అనుకుంటూ అవాక్కయ్యారు. ఆ ప్లాంట్ల యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడుల్లో ఏసీపీ రాంచందర్‌రావు, అర్భన్ డిప్యూటీ తహసీల్దార్ సురేష్‌బాబు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు వెంకటరమణ, భాస్కర్, వీఆర్ఓలు బాలయ్య, ఆర్.వెంకటేశ్వర్లు, జూనియర్ అసిస్టెంట్ నాగరాజు, హెల్త్ అసిస్టెంట్ వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. -
లాడ్జిపై షీ టీమ్స్ దాడులు, మహిళ మృతి
కర్నూలు : షీ టీమ్స్ నుంచి తప్పించుకునే క్రమంలో ఓ మహిళ కిందపడి మృతి చెందిన ఘటన ఆదివారం నగరంలోని కొత్తబస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఆత్మకూరు పట్టణానికి చెందిన లక్ష్మి(40) భర్త చనిపోవడంతో లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కుమార్తె ఉంది. లక్ష్మి రోజూ కర్నూలుకు వచ్చి మహిళలను ఆర్టీసీ కొత్త బస్టాండు సమీపంలోని లాడ్జికి తరలించి పడుపు వృత్తి చేయించేది. ఇందులో భాగంగా హసీనా అనే మహిళతో పాటు మరో మహిళను లాడ్జీలోకి పంపించి బయటే వేచి ఉంది. సమాచారం అందుకున్న షీటీమ్స్ ఆటోలో అక్కడికి చేరుకున్నారు. మహిళా పోలీసులను చూసిన లక్ష్మి పారిపోయేందుకు యత్నించింది. ఈ క్రమంలో కిందపడడంతో ముక్కు నుంచి రక్తస్రావమైంది. వెంటనే పోలీసులు ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సీఐ మురళీధర్‌రెడ్డి, ఎస్ఐ మహేశ్వరరెడ్డి, ఏఎస్ఐ ప్రకాష్ ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. -
సెల్ ఫోన్ దుకాణాలపై దాడులు
ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలోని పలు సెల్‌ఫోన్ దుకాణాలపై పైరసీ అధికారులు (ఐఎంఐ) యు.వి.సూర్యనారాయణ, బండారు జీవరత్నం శనివారం దాడులు నిర్వహించారు. మూడు సెల్ ఫోన్ దుకాణాల్లో కంప్యూటర్ల నుంచి మెమెరీ కార్డులకు అనధికారికంగా పాటలు ఎక్కిస్తున్నట్టు గుర్తించారు. ఆ దుకాణాల్లోని కంప్యూటర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ దుకాణాల యజమానులపై ఎస్ఐ కె. గోవిందరావు కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. ఇదిలా ఉండగా మేం ఏ అక్రమాలు చేయడంలేదని, ఏటా మా వద్ద నుంచి దుకాణానికి సుమారు రూ. 22 వేలు అక్రమంగా వసూలు చేస్తున్నారని సెల్‌ఫోన్ దుకాణ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లైసెన్సు పేరుతో డీడీలు తీస్తున్న సొమ్ములు ఎవరికి చెందుతున్నాయోనని పోలీసులను ప్రశ్నించారు. సంబంధిత వ్యక్తిని పిలిపించి న్యాయం జరిగేలా చూస్తానని ఎస్ఐ సెల్‌ఫోన్ దుకాణదారులకు హామీ ఇచ్చారు. -
రూ.83.52 లక్షల ఎరువులు, పురుగుమందుల సీజ్
నిడమర్రు: జిల్లాలో రూ.83.52 లక్షల విలువైన పురుగుమందులు, ఎరువులను సీజ్ చేసినట్టు రాష్ట్ర తనిఖీ బృందం కో–ఆర్డినేటర్, శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఉపసంచాలకుడు పి.శివప్రసాద్ తెలిపారు. శుక్రవారం నిడమర్రు మండలంలోని పలు ఎరువులు, పురుగుమందుల దుకాణాలను రాష్ట్ర బృందం తనిఖీ చేసింది. దుకాణాల్లో ఇటీవల తగ్గించిన ధరలకు అమ్మకాలు జరుగుతున్నాయా? బిల్లులపై రైతుల సంతకాలు ఉన్నాయా అనే విషయాలను బృందం పరిశీలించింది. అనంతరం శివప్రసాద్ మాట్లాడుతూ.. ఈనెల 1 నుంచి శుక్రవారం వరుకూ 14 మండలాల్లో తనఖీలు చేపట్టామని, నిబంధనలకు విరుద్ధంగా 19 దుకాణాల్లో ఉన్న రూ.75లక్షల విలువైన ఎరువులు, నాలుగు దుకాణాల్లో ఉన్న రూ.8.42 లక్షల విలువైన పురుగు మందులను సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ బృదంలో ఏడీఏ ఆర్.శ్రీనివాసరావు, విత్తన పరిశోధన అధికారి వి.ఎల్.కె.వర్మ, ఏవో పి.భాస్కరరావు ఉన్నారు. -
కల్తీకల్లు విక్రయిస్తే కఠిన చర్యలు
జగిత్యాల: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవల నల్లగొండ జిల్లాలో పర్యటించిన మంత్రి.. తాజాగా బుధవారం కరీంనగర్ జిల్లా జగిత్యాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గుడుంబా, కల్తీకల్లు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. ఆఫీసుల నిర్వహణకు ప్రతి నెల నిధులు కేటాయించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల కోసం సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. సిబ్బందికి వాహనాలు అందజేసేందుకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.