అమరావతి: ఆంధ్రపద్రేశ్ ఎక్సైజ్ మంత్రి కేఎస్ జవహర్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. బీరును హెల్త్ డ్రింక్‌గా ప్రమోట్ చేస్తున్నామని ఆయన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కావాలంటే బీరు హెల్త్ డ్రింక్ అని నిరూపిస్తానంటూ మంత్రి సవాల్ చేయటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలుచోట్ల నిరసనలు చేపట్టారు.
సాక్షాత్తూ ఎక్సైజ్ మంత్రికి బీరు హెల్దీ డ్రింక్‌గా కనిపిస్తుందా? ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం అవుతుందా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. కాగా మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూడబోమని ఓ వైపు చెబుతూనే మరోవైపు బీరును హెల్త్ డ్రింక్‌గా ప్రమోట్ చేస్తున్నామని మంత్రి కేఎస్ జవహర్ పేర్కొనడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వం ఉద్దేశ్యం ఏంటో ఇట్టే అర్ధమవుతుంది.