ఎంపీ శివప్రసాద్ వ్యా్‌ఖ్యలపై మంత్రి జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏలూరు: ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యలపై మంత్రి జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులోని జెడ్పీ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతిలో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేసేందుకు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు రూ. 75 కోట్లు కేటాయించి దళితుల పట్ల తనకున్న ప్రేమను సీఎం చంద్రబాబు చాటుకున్నారన్నారు. ప్రాంతాలవారీగా పదవులు ఇచ్చారనడం శివప్రసాద్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. సీనియర్ నాయకుడిగా ఉన్న శివప్రసాద్ పార్టీని అప్రదిష్టపాలు చేస్తున్నారన్నారు. శివప్రసాద్ వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని జవహర్ చెప్పారు.