![మోదీ బాణం సామాన్యులకు గుచ్చుకుంది - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/41480451044_625x300.jpg.webp?itok=cXT703mF)
మోదీ బాణం సామాన్యులకు గుచ్చుకుంది
ఎంపీ శివప్రసాద్ వినూత్న వేషధారణతో నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ ఎంపీ శివప్రసాద్ మరోసారి వినూత్న తరహాలో నిరసనకు దిగారు. నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకొచ్చేలా నలుపు, తెలుపు రంగులో ఉన్న దుస్తులు ధరించి మంగళవారం పార్లమెంట్ ఆవరణలోని విజయ్‌చౌక్‌లో నిరసన తెలిపారు.
చొక్కాకు ఒకవైపున్న నలుపు రంగుపై ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని నల్లకుబేరులు స్వాగతిస్తూ వికటాట్టహాసం చేస్తూ ముద్రించిన చిత్రాలు.. మరోవైపున్న తెల్లరంగుపై సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుపుతూ ముద్రించిన చిత్రాలు ఉన్నారుు. ఈ సందర్భంగా ఎంపీ శివప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ దశరథ మహారాజు ఏనుగు అనుకొని ముని కుమారుడిని చంపినట్టు.. ప్రధాని అనాలోచిత నిర్ణయం వల్ల ఆయన వదిలిన బాణం నల్లకుబేరులకు కాకుండా సామాన్య ప్రజలకు గుచ్చుకుందని వ్యాఖ్యానించారు.