![Dog Job: Busch Wants to Pay Pooch 20000 Dollars to be Brew Taster - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/17/DOG_Job.jpg.webp?itok=wx-qIO1f)
అసలే కరోనా దెబ్బకు జాబులు పోయి.. జీతాలు తగ్గిపోయి.. ఇంక్రిమెంట్లు రాక ఇబ్బందులు పడుతున్న మనలాంటోళ్లు.. ఈ జాబ్ ఆఫర్ వింటే.. పైనన్న మాట నిజమేనని ఒప్పుకోవాల్సిందే.. ఎందుకంటే.. తాజాగా ఓ బీరు కంపెనీలో చీఫ్ టేస్టింగ్ ఆఫీసర్ జాబును భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. నెలకు దాదాపు రూ.15 లక్షల జీతం. రూ.60 వేల విలువైన హెల్త్ ఇన్సూరెన్స్. ఇలా చాలా బెనిఫిట్స్. ఇంతకీ ఎవరికి? శునకాలకు!! అవును.. వాటికే.. అవి చేయాల్సిందల్లా.. బీరును రుచి చూడటంతోపాటు, సంస్థ అంబాసిడర్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది.
ఇంకా అర్థం కాలేదా.. బీరుకు.. వాటికి ఏం సంబంధమని..? అమెరికాలోని బుష్ కంపెనీ కేవలం కుక్కల కోసం జంతువుల ఎముకలతో ప్రత్యేకమైన బీరు తయారు చేస్తుంటుంది. ఈ ఆల్కహాల్ రహిత బీరును రుచి చూసేందుకు మాంచి ఘ్రాణ శక్తి ఉండి.. రుచి చూడటంలో దిట్ట అయిన కుక్క కావాలి. అందుకే ఎవరైనా తమ పెంపుడు కుక్కలను ఈ జాబ్‌లో జాయిన్ చేసేందుకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కంపెనీ పేపర్‌లో ప్రకటన ఇచ్చింది. అదండీ సంగతి..
ఇక్కడ చదవండి:
Comments
Please login to add a commentAdd a comment