Beer Company
-
కుక్కకు ఉద్యోగం.. నెలకు 15 లక్షల జీతం!
అసలే కరోనా దెబ్బకు జాబులు పోయి.. జీతాలు తగ్గిపోయి.. ఇంక్రిమెంట్లు రాక ఇబ్బందులు పడుతున్న మనలాంటోళ్లు.. ఈ జాబ్ ఆఫర్ వింటే.. పైనన్న మాట నిజమేనని ఒప్పుకోవాల్సిందే.. ఎందుకంటే.. తాజాగా ఓ బీరు కంపెనీలో చీఫ్ టేస్టింగ్ ఆఫీసర్ జాబును భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. నెలకు దాదాపు రూ.15 లక్షల జీతం. రూ.60 వేల విలువైన హెల్త్ ఇన్సూరెన్స్. ఇలా చాలా బెనిఫిట్స్. ఇంతకీ ఎవరికి? శునకాలకు!! అవును.. వాటికే.. అవి చేయాల్సిందల్లా.. బీరును రుచి చూడటంతోపాటు, సంస్థ అంబాసిడర్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇంకా అర్థం కాలేదా.. బీరుకు.. వాటికి ఏం సంబంధమని..? అమెరికాలోని బుష్ కంపెనీ కేవలం కుక్కల కోసం జంతువుల ఎముకలతో ప్రత్యేకమైన బీరు తయారు చేస్తుంటుంది. ఈ ఆల్కహాల్ రహిత బీరును రుచి చూసేందుకు మాంచి ఘ్రాణ శక్తి ఉండి.. రుచి చూడటంలో దిట్ట అయిన కుక్క కావాలి. అందుకే ఎవరైనా తమ పెంపుడు కుక్కలను ఈ జాబ్‌లో జాయిన్ చేసేందుకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కంపెనీ పేపర్లో ప్రకటన ఇచ్చింది. అదండీ సంగతి.. ఇక్కడ చదవండి: వైరల్: చలి చీమ చేతలకు పాము గిలగిల ఏలియన్స్ నిజంగానే ఉన్నారా? -
‘కరోనా’ బీరు ప్రియులకు బ్యాడ్‌న్యూస్!
మెక్సికో సిటీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో కరోనా బీర్ తయారీని నిలిపివేస్తున్నట్లు గ్రూపో మాడెలో ప్రకటించింది. మహమ్మారి విజృంభిస్తున్న వేళ మెక్సికో ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు... ‘‘ బీర్ ప్లాంట్లలో ఉత్పత్తిని క్రమక్రమంగా తగ్గించబోతున్నాం’’అని కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం గనుక సహకరిస్తే తమ సంస్థలోని 75 శాతం మంది సిబ్బంది బీర్ తయారీలో నిమగ్నమయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొంది. కాగా కరోనా వైరస్ సృష్టిస్తున్న కారణంగా అమెరికాలో కరోనా బీర్ అమ్మకాలు 40 శాతం మేర అమ్మకాలు పడిపోయాంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే గ్రూప్ మాడెలో ఈ వార్తలను ఖండించింది. (చైనాకు పేరుప్రఖ్యాతులే ముఖ్యం: నిక్కీ హేలీ) అంతేగాకుండా కరోనా వ్యాప్తిలోనూ జోరుగా అమ్మకాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఇక ప్రస్తుతం ప్రభుత్వం ఆదేశాలతో గ్రూప్ మాడెలోతో పాటు మెక్సికోలోని బీర్ మరో ప్రధాన ఉత్పత్తిదారు హెంకెన్ సైతం నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బీరు ప్రియులు నిరాశకు గురవుతున్నారు. కాగా కోవిడ్-19 నియంత్రణ చర్యల్లో భాగంగా ఏప్రిల్ 30 వరకు అత్యవసరాలు మినహా అన్ని ఉత్పత్తుల సరఫరాను నిలిపివేయాలని స్థానిక ప్రభుత్వం ఆదేశించింది. ఆ దేశంలో ఇప్పటివరకు 1500 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా... 50 మంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో కేవలం వ్యవసాయవ, దాని అనుబంధ ఉత్పత్తిదారులకు మాత్రమే అనుమతినిచ్చింది.(ట్రంప్‌కు రెండోసారి కరోనా పరీక్షలు) -
బీర్ బాటిల్స్‌పై గాంధీ కార్టూన్.. తీవ్ర ఆగ్రహం!
ఇజ్రాయెల్‌లో బీరు బాటిల్స్‌పై మహాత్మాగాంధీ చిత్రాన్ని ముద్రించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇజ్రాయెల్ 71వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ బీర్ తయారీ కంపెనీలు మాల్కా బ్రేవరీ, నెగేవ్ బీర్స్ ఈ చర్యకు పాల్పడ్డాయి. తమ బీర్లకు పబ్లిసిటీ కల్పించేందుకు ఏకంగా వివిధ దేశాల ప్రముఖ వ్యక్తుల ముఖచిత్రాలను బీర్ బాటిళ్లపై ముద్రించాయి. ఇందులో భాగంగా టీ షర్ట్ వేసుకొని.. కూలింగ్ గ్లాస్ పెట్టుకున్న మహాత్మాగాంధీ కార్టూన్‌ను బీర్ బాటిల్‌పై ముద్రించాయి. తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఏకంగా బీర్ బాటిళ్లపై మహాత్మా గాంధీ కార్టూన్ ముద్రించి.. అవమానించడంపై భారతీయులు మండిపడుతున్నారు. ఈవిధంగా స్వాతంత్ర్యయోధులను కించపరిచిన ఆ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహులకు లేఖలు రాశారు. ఇజ్రాయెల్‌లో పనిచేసే ఓ భారతీయుడు మొదట ఈ బీర్ బాటిల్‌ను ఆన్లైన్లో పోస్ట్ చేసి.. తన ఆవేదనను వ్యక్తం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భారత జాతిపిత అయిన గాంధీని అవమానించడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవితమంతా మద్యం ముట్టనని తన తల్లికి వాగ్దానం చేసి.. మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడిన గాంధీని ఇలా చేయడం నిజంగా అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2015 సంవత్సరంలో కూడా అమెరికాకు చెందిన ఒక బీరు కంపెనీ గాంధీని అవమానించేలా ఓ వాణిజ్య ప్రకటనను రూపొందించింది. దీనిపై భారత ప్రభుత్వం నిరసన తెలపడంతో ఆ కంపెనీ క్షమాపణలు చెప్పింది. -
బీరు బుస్సు.. పన్ను తుస్సు!
సాక్షి, హైదరాబాద్ : ముద్దుగా డ్రాట్ బీర్.. లేదా మైక్రో బ్రూవరీ.. ఇలా పేరేదైనా సొంతంగా బీర్లు తయారు చేసుకొని అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్న మాల్స్.. పన్నుకు మాత్రం ఎగనామం పెడుతున్నాయి. బీర్లు తయారు చేసి అక్కడే అమ్ముకుంటున్న ఈ మాల్స్.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన 70 శాతం వ్యాట్‌ను తమ జేబుల్లోకి వేసుకుంటున్నాయి. డ్రాట్ బీర్లు తయారు చేసి అమ్ముకునే మాల్స్, పబ్‌ల సంఖ్య తక్కువే అయినా జరిగే వ్యాపారం కోట్లలో ఉండడంతో ఏటా రూ.30 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. ఈ మాల్స్, పబ్‌లకు రాష్ట్రంలోని ఓ మంత్రి అండదండలు ఉన్నాయన్న చర్చ నేపథ్యంలో కనీసం నోటీసులు ఇచ్చేందుకు కూడా పన్నుల శాఖ అధికారులు వెనుకాడుతుండటం గమనార్హం. నెలకు 20 లక్షల పైనే.. ఎక్సైజ్ శాఖ 2015లో డ్రాట్‌బీర్లకు రాష్ట్రంలో అనుమతి ఇచ్చింది. మాల్స్ లేదా పబ్‌లలో సొంత తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని కొన్ని ముడి సరుకుల ద్వారా అక్కడికక్కడే బీర్లను తయారు చేసుకుని అమ్ముకునేందుకు మైక్రో బ్రూవరీల పేరుతో వీటికి అనుమతించింది. మగ్లు, లీటర్లలో ఉండే ఈ బీర్లకు యువతలో క్రేజ్ ఎక్కువగా కనిపించడంతో 2016, 17 సంవత్సరాల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 25 వరకు మాల్స్ ఏర్పడ్డాయి. వీటిలో వారాంతాలు, ఇతర సెలవు దినాల్లో డ్రాట్ బీర్లకు ఫుల్లు గిరాకీ ఉంటుంది. కిక్ కొంచెం తక్కువగా ఉండే ఈ బీర్ల వైపు యువత మొగ్గు చూపింది. ఏడాది తర్వాత కాస్త క్రేజ్ తగ్గడంతో కొన్ని మాల్స్ మూతపడ్డాయని అధికారులు చెపుతున్నారు. మొత్తమ్మీద దాదాపు 20 వరకు మెక్రో బ్రూవరీలు జీహెచ్ఎంసీ పరిధిలో నడుస్తున్నాయని అధికారులు చెపుతున్నారు. ఒక్కో మాల్లో నెలకు కనీసం రూ.20 లక్షల వరకు డ్రాట్ బీర్ల వ్యాపారం జరుగుతోంది. అండదండలెవరివి? మొదటి అమ్మకందారు (ఫస్ట్ సెల్లర్)గా ఈ మాల్స్ యాజమాన్యాలు తమ వ్యాపారంలో 70 శాతాన్ని వ్యాట్ కింద ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ గత రెండేళ్లుగా ఈ మాల్స్ నుంచి రూపాయి కూడా పన్ను రావడం లేదని సమాచారం. ముఖ్యంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత యథేచ్ఛగా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నాయని తెలుస్తోంది. నెలకు రూ.14 లక్షల చొప్పున కనీసం 15–20 మాల్స్‌లో రూ.2.50 కోట్ల వరకు ప్రభుత్వానికి పన్ను రూపంలో రావాలి. అంటే ఏడాదికి రూ.30 కోట్లపైనే! ఇంత మొత్తాన్ని ఇష్టారాజ్యంగా మైక్రో బ్రూవరీలు ఎగ్గొడుతున్నా పన్నుల శాఖ అధికారులు కనీసం నోటీసులివ్వడం లేదు. మాల్స్‌లో పన్ను ఎగవేతను ఓ సర్కిల్ ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని, వాటికి ఓ మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్నాయనే కారణంతోనే నోటీసులు ఇవ్వడం లేదన్న చర్చ ఇప్పుడు పన్నుల శాఖ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. -
బడ్వైజర్ పేరు మారింది..!
అమెరికా.. ఈ పేరు వింటేనే చాలు, చాలామందికి ఒళ్లు పులకిస్తుంది. మనవాళ్లయితే ఎప్పుడెప్పుడు అక్కడ వాలిపోదామా, ఎప్పుడు మంచి సాఫ్ట్వేర్ కొలువు చేద్దామా అని చూస్తుంటారు. కానీ అదే అమెరికాను మనం చేత్తో పట్టుకోగలిగితే ఎలా ఉంటుంది? అవును.. ప్రముఖ బీరు బ్రాండు బడ్వైజర్.. తన పేరు మార్చుకుంది. అమెరికా అని పేరు పెట్టుకుంది. ఈనెల 23వ తేదీ నుంచి తాగుబోతులు మరింత పండగ చేసుకునేలా తమ బీరు పేరు మారుస్తున్నామని, ఇక అమెరికాను చేత్తో పట్టుకుని తాగొచ్చని బడ్వైజర్ బీరు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం పేరు మార్చడమే కాదు, బీరు క్యాన్లు, బాటిళ్ల మీద స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఇతర బొమ్మలు ఉంటాయట. 'అమెరికా ద బ్యూటిఫుల్', 'ద స్టార్ స్పాంగిల్డ్ బ్యానర్' లాంటి పాటల సాహిత్యం కూడా వాటి మీద ముద్రిస్తున్నారు. ఈ మార్పులను 2016 రియో ఒలింపిక్స్, పారాలింపిక్ గేమ్స్ వరకు కూడా కొనసాగిస్తారు. ఆన్హ్యూసర్- బష్ ఇన్బెవ్ అనే బెల్జియం కంపెనీ ఈ బడ్వైజర్ బీరుకు యజమాని. -
బీరుకు ‘నీటి’ గండం!
సాక్షి, హైదరాబాద్: బీరు బాబులకు కష్టకాలం రానుంది. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ ప్రభావం బీర్ల కంపెనీలపైనా పడింది. రోజూ బీర్ల తయారీకి అవసరమైన లక్షలాది లీటర్ల నీటిని సరఫరా చేసే మంజీరా ఇప్పటికే ఎండిపోగా, సింగూరు నీరు ప్రజావసరాలకు కూడా సరిపోని పరిస్థితి ఉంది! దాంతో బ్రూవరీలకు నీరు సరఫరా చేయలేమంటూ సర్కారు చేతులెత్తేసింది. దాంతో, రాష్ట్రంలోని పది జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాలకు కూడా బీర్లను సరఫరా చేసే మెదక్ జిల్లా సంగారెడ్డి పరిధిలోని ఐదు బ్రూవరీలు (బీర్ల కంపెనీలు) ఆందోళనకర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. నీరివ్వకుంటే తాత్కాలికంగా కంపెనీలను మూసివేయడం తప్ప మరో మార్గం లేదని ఆబ్కారీ అధికారులకు తేల్చిచెప్పాయి. దాంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీరందించే విషయమై ఎక్సైజ్ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. రోజుకు 44 లక్షల లీటర్ల నీరు వర్షాకాలం, చలికాలాల్లో తెలంగాణలో నెలకు దాదాపు 30 లక్షల పెట్టెల బీర్లు విక్రయిస్తారు. పెట్టెలో 12 బీర్లుంటాయి (ఒక్కొక్కటి 650 ఎంఎల్ పరిమాణం). ఫిబ్రవరి నుంచి జూన్ వరకు డిమాండ్ నెలకు 40లక్షల పెట్టెలు దాటుతుంది. మెదక్ జిల్లా పటాన్చెరు పరిసరాల్లో ఉన్న ఐదు బ్రూవరీలు తయారు చేసే బీర్లు రాష్ట్రంతోపాటు ఏపీ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకూ సరఫరా అవుతాయి. బీర్ల తయారీకి బ్రూ వరీలు రోజుకు దాదాపు 44 లక్షల లీటర్ల నీటిని వినియోగించుకుంటాయి. పటాన్చెరు ప్రాంతంలోని ఇతర పరిశ్రమలతో పాటు ఈ 5 బ్రూవరీలకు కూడా హైదరాబాద్ వాటర్ బోర్డే ‘సింగూరు-మంజీరా నీటి సరఫరా వ్యవస్థ’ ద్వారా నీటిని సరఫరా చేస్తుంది. మంజీరా నుంచి సింగూరు జలాశయం ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. మంజీరా ఎండి, సింగూ రు డెడ్‌స్టోరేజీకి చేరడంతో సింగూరు జలాలను తాగు అవసరాలకే వాడాలని బోర్డు నిర్ణయిం చింది. ఈ మేరకు బ్రూవరీల యాజమాన్యా లకు వారం క్రితమే బోర్డు పటాన్చెరు జనరల్ మేనేజర్ లేఖలు రాశారు. అయినా ప్రస్తుతానికి సింగూరు నుంచి బ్రూవరీలు కొంతమేర నీరు వాడుకుంటున్నాయి. డిసెంబర్ 1 నుంచి వాటికి నీటి సరఫరాను పూర్తిగా ఆపేయాలని వాటర్‌బోర్డు అధికారులు నిర్ణయించి ఎక్సైజ్ అధికారులకు తెలియజేశారు. నీటి సరఫరా లేకపోతే బ్రూవరీల మూసివేత తప్ప మార్గం లేదని యాజమాన్యాలంటున్నాయి. బీరు ఉత్పత్తి ఇప్పటికే కొంతమేర తగ్గింది. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. లక్షలాది లీటర్ల నీటిని బీరు కంపెనీలు ప్రైవేటుగా కూడా సమకూర్చుకునే పరిస్థితి లేదు. భారీ స్థాయి బోర్‌వెల్స్ ఏర్పాటుకు వాల్టా చట్టం అడ్డొస్తోంది. దాంతో డిసెంబర్ నెలాఖరులో నగరానికి వస్తాయని భావిస్తున్న గోదావరి జలాలపైనే ఎక్సైజ్ శాఖ ఆశలు పెట్టుకుంది. కానీ డిసెంబర్ 1 నుంచే బ్రూవరీలకు నీటిని పూర్తిగా నిలిపేస్తే పరిస్థితేమిటనేదే ప్రశ్న.