
ఆట ఏదైనా సరే.. కొందరు అభిమానులు తమ చర్యతో, అందంతో అందరి దృష్టిని తమవైపు తిప్పుకుంటారు. తాజాగా యూఎస్ ఓపెన్‌లో అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. అమెరికాకు చెందిన మేఘన్ లక్కీ అనే యువతి టెన్నిస్‌కు వీరాభిమాని. గతేడాది యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా ఒక మ్యాచ్‌కు హాజరైన మేఘన్ లక్కీ.. అందరూ చూస్తున్న సమయంలో గ్లాసు బీరును దించకుండా తాగి అందరి దృష్టిలో పడింది.
అప్పటినుంచి ఆమెను ''బీర్ చీర్ గర్ల్'' అని ముద్దుగా పిలుస్తున్నారు. కాగా సదరు యువతి ఈ ఏడాది కూడా తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఆదివారం(సెప్టెంబర్ 4న) యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో మ్యాచ్‌లు చూడడానికి వచ్చింది. కాగా ఈసారి కూడా తన బాయ్‌ఫ్రెండ్ అందించిన బీర్ గ్లాసును అందుకున్న మేఘన్ పూర్తిగా తాగేసింది. అలా వరుసగా రెండో ఏడాది కూడా బీర్ చాలెంజ్‌ను పూర్తి చేసి తనకున్న పేరును నిలబెట్టుకోవడంతో మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకులు మేఘన్‌కు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం గమనార్హం.
ఈ వీడియోనూ స్వయంగా యూఎస్ ఓపెన్ నిర్వాహకులే ట్విటర్‌లో షేర్ చేస్తూ.. మేఘన్ లక్కీకి మా అభినందనలు.. బహుశా ఇది ట్రెండింగ్ పాయింట్‌గా నిలిచే అవకాశముంది. అంటూ క్యాప్షన్ జత చేశాడు. కాగా ఈ వీడియోకు దాదాపు 2 లక్షల వ్యూస్ రావడం విశేషం.
It seems this is becoming tradition at this point 🍻 pic.twitter.com/vTO1hUJVNS
— US Open Tennis (@usopen) September 4, 2022