బార్‌ముందు బీర్‌ సీసాలతో దాడి | attack at the baar | Sakshi
Sakshi News home page

బార్‌ముందు బీర్‌ సీసాలతో దాడి

Published Tue, Sep 27 2016 11:36 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

కరీంనగర్‌ క్రైం : అసలే అర్ధరాత్రి..ఆపై మద్యంమత్తు.. ఆ మత్తులో ఇద్దరు యువకులపై ఆరుగురు దాడిచేశారు. అది ఓ బార్‌షాప్‌ ముందు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు బాధితుల కథనం ప్రకారం..

  • ఇద్దరిపై ఆరుగురి హత్యాయత్నం
  • ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
  • నిందితులపై చర్యలకు పోలీసుల వెనుకంజ?
  • కరీంనగర్‌ క్రైం : అసలే అర్ధరాత్రి..ఆపై మద్యంమత్తు.. ఆ మత్తులో ఇద్దరు యువకులపై ఆరుగురు దాడిచేశారు. అది ఓ బార్‌షాప్‌ ముందు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు బాధితుల కథనం ప్రకారం.. మూడు రోజుల క్రితం అర్ధరాత్రి దాటాక సుమారు ఒంటిగంట సమయంలో అశోక్‌నగర్‌నకు చెందిన సృజన్, వావిలాలపల్లికి చెందిన రాజు బస్టాండ్‌ సమీపంలోని నటరాజ్‌ బార్‌ వద్దకు వచ్చారు. అర్ధరాత్రి మద్యం విక్రయించే కౌంటర్‌ వద్దకు వెళ్లి బీర్లు కావాలని అడిగారు. అప్పటికే మద్యం సేవించిన ఆరుగురు వీరి వద్దకు వచ్చి.. ‘మాకే బీర్లు ఇవ్వనివారు మీకు ఎలా ఇస్తారు..’ అంటూ వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా విచక్షణారహితంగా దాడి చేశారు. కర్రలు, బీరుసీసాలు పగులగొట్టి దాడి చేయడంతో రాజుకు మూడుచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. కాసేపటికి వాళ్లు వెళ్లిపోవడంతో క్షతగాత్రులు ఆసుపత్రిలో చేరారు. మరుసటి రోజు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో పోలీసులు సీసీ కెమెరాల పుటేజీలు పరిశీలించి దాడి జరిగినట్లు గుర్తించారు. ఫిర్యాదు చేసి రెండు రోజులు గడుస్తున్నా... నిందితులను గుర్తించడంలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని, నిందితులు పెద్ద ఎత్తున లాబీయింగ్‌ చేస్తుండడంతోనే వెనుకంజ వేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement