baar
-
బార్‌ముందు బీర్ సీసాలతో దాడి
ఇద్దరిపై ఆరుగురి హత్యాయత్నం ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన నిందితులపై చర్యలకు పోలీసుల వెనుకంజ? కరీంనగర్ క్రైం : అసలే అర్ధరాత్రి..ఆపై మద్యంమత్తు.. ఆ మత్తులో ఇద్దరు యువకులపై ఆరుగురు దాడిచేశారు. అది ఓ బార్‌షాప్ ముందు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు బాధితుల కథనం ప్రకారం.. మూడు రోజుల క్రితం అర్ధరాత్రి దాటాక సుమారు ఒంటిగంట సమయంలో అశోక్‌నగర్‌నకు చెందిన సృజన్, వావిలాలపల్లికి చెందిన రాజు బస్టాండ్ సమీపంలోని నటరాజ్ బార్ వద్దకు వచ్చారు. అర్ధరాత్రి మద్యం విక్రయించే కౌంటర్ వద్దకు వెళ్లి బీర్లు కావాలని అడిగారు. అప్పటికే మద్యం సేవించిన ఆరుగురు వీరి వద్దకు వచ్చి.. ‘మాకే బీర్లు ఇవ్వనివారు మీకు ఎలా ఇస్తారు..’ అంటూ వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా విచక్షణారహితంగా దాడి చేశారు. కర్రలు, బీరుసీసాలు పగులగొట్టి దాడి చేయడంతో రాజుకు మూడుచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. కాసేపటికి వాళ్లు వెళ్లిపోవడంతో క్షతగాత్రులు ఆసుపత్రిలో చేరారు. మరుసటి రోజు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో పోలీసులు సీసీ కెమెరాల పుటేజీలు పరిశీలించి దాడి జరిగినట్లు గుర్తించారు. ఫిర్యాదు చేసి రెండు రోజులు గడుస్తున్నా... నిందితులను గుర్తించడంలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని, నిందితులు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తుండడంతోనే వెనుకంజ వేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. -
వావ్రింకాకు ‘చేదు’ అనుభవం!
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గడం అంటే అన్నింటికీ లెసైన్స్ వచ్చేసినట్లే అని భావించినట్లున్నాడు వావ్రింకా. పాపం...నాదల్లాంటి దిగ్గజాన్ని ఓడించిన ఘనత సాధించి కొన్ని గంటలైనా గడవక ముందే అతనికి ఆసీస్ గడ్డపై చేదు అనుభవం ఎదురైంది. అతను ఎంత గొప్ప విజయం అందుకున్నా... అవన్నీ జాన్తానై, రూల్స్ అంటే రూల్సే అని ఒక బార్లో తెలిసొచ్చింది. వివరాల్లోకెళితే...విజేతగా నిలిచిన రాత్రి ఒంటి గంట తర్వాత మందు పార్టీ చేసుకునేందుకు వావ్రింకా దాదాపు 20 మంది స్నేహితులతో కలిసి మెల్బోర్న్ నగరంలో తిరిగాడు. అయితే ఒక బార్లో మాత్రం ఈ స్విస్ స్టార్‌కు చేదు అనుభవం ఎదురైంది. లాబీలో షాంపేన్ గ్లాస్ అందుకొని స్నేహితులతో బార్లోకి వెళుతుంటే నిర్వాహకులు అడ్డుకున్నారు. అక్కడ చాలా స్థలం ఖాళీగా ఉన్నా వీరికి అనుమతి లభించలేదు. దాంతో అసహనంతో షాంపేన్ పారబోసిన వావ్రింకా, లాంజ్‌లోనే గ్లాస్ పడేసి వెళ్లిపోయాడు. అతను ఎవరైనా తమకు... తమ నిబంధనలు మారవని అని యాజమాన్యం తేల్చేసింది. ఇంతకీ కారణమేమిటంటే...ఒకే సమయంలో గరిష్టంగా అక్కడ 12 మందిని అనుమతిస్తారు కాబట్టి వావ్రింకాను వెనక్కి పంపించామని బార్ వాళ్లు జవాబిచ్చారు! చివరకు ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు తమకు తెలిసిన బార్ల సమాచారం ఇచ్చారు. అక్కడ అతనికి గౌరవ మర్యాదలు లభించాయి. పట్టలేని ఆనందంతో ఉదయం 5 గంటల వరకు వావ్రింకా అక్కడ చిత్తుగా తాగుతూనే కూర్చున్నాడట!