త్వరలో చందమామపై బీర్‌ | Beer on the moon | Sakshi
Sakshi News home page

త్వరలో చందమామపై బీర్‌

Published Tue, Jan 24 2017 2:49 AM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM

త్వరలో చందమామపై బీర్‌

త్వరలో చందమామపై బీర్‌

లాస్‌ఏంజిలెస్‌: త్వరలో చంద్రుడిపై బీర్‌ తయారుకానుంది. టీమ్‌ఇండస్‌ అనే సంస్థ నిర్వహించిన ‘ల్యాబ్‌ టు మూన్ ’పోటీల్లో అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ సంస్థ వచ్చే డిసెంబర్‌ 28న చంద్రుడికిపైకి అంతరిక్షనౌకను పంపనుంది. ఈ నౌకలో వర్సిటీ విద్యార్థులు రూపొందించిన బీరు క్యాన్ ను పంపి అక్కడ బీరును తయారు చేయనున్నారు.

ఈ ప్రయోగంలో మూడు విభాగాలున్న లోహపు డబ్బాలో పులియని బీరు, ఈస్ట్‌ను విడిగా ఉంచి చంద్రుడికిపైకి పంపుతారు. ఇది అక్కడికి చేరాక వాల్వ్‌ తెరుచుకొని ఈ రెండు మిశ్రమాలు కలుస్తాయి. అనంతరం పులియబెట్టిన బీరు తయారవుతుంది. అక్కడ బీర్‌ను ఎంతవరకు పులియబెట్టవచ్చో దీనిద్వారా తెలుసుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement