Telangana Beer Prices Likely To Get Hike, Details Inside - Sakshi
Sakshi News home page

Telangana Beer Prices: ‘బీర్‌’ప్రియులకు చేదు వార్త.. భారీగా ధరలు పెంపు?

Published Wed, May 18 2022 2:06 AM | Last Updated on Wed, May 18 2022 8:14 AM

Telangana Beer Prices Rises - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: ‘బీర్‌’ప్రియులకు చేదు వార్త. బీర్‌ ధరలను పెంచాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపా దనలు కూడా సిద్ధమైనట్టు సమా చారం. బీర్‌ ధరలను పెంచాలని కొంతకాలంగా డిస్టలరీల యాజమాన్యాలు కోరుతున్న నేపథ్యంలో బీర్‌ ధరల పెంపుపై ఎ క్సైజ్‌ ఉన్నతాధికారులు ఇటీవల కసరత్తు జరిపారు.

ఈ కసరత్తు అనంతరం ఒక్కో బీర్‌ ధరను రూ.10–20 పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుతం లైట్‌ బీర్‌ రూ.140 ఉండగా దాన్ని రూ.150, స్ట్రాంగ్‌ బీర్‌ రూ.150 ఉండగా, దాన్ని రూ.170 చేయనున్నట్లు సమాచారం. 
చదవండి: హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement