గొంతు కోసి పరారైన యువకుడు
నూతనకల్: బీరు ఉద్దెర ఇవ్వనందుకు ఓ యువకుడు బెల్టుషాపు మహిళ గొంతు కోశాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నూతనకల్ మండలంచిన నెమిల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఐతరాజు మహేశ్ తన స్నేహితులతో కలసి బెల్టు షాపు నిర్వహిస్తున్న లింగాల రేణుక ఇంట్లో మద్యం సేవించాడు. మరొక బీరు ఉద్దెర ఇవ్వమని రేణుకను కోరాడు. ఇందుకు ఆమె అంగీకరించలేదు. పలుమార్లు ప్రాధేయపడినా ఉద్దెర ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన మహేశ్.. చిన్నపిల్లకు పాలు ఇస్తున్న రేణుకపై అకస్మాత్తుగా దాడిచేసి గొంతుకోసి గాయపరిచి పరారయ్యాడు.
తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలిని వెంటనే చికిత్స నిమిత్తం సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు. సమాచారం. ఇతడు రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో జ్యూస్ దుకాణంలో వర్కర్‌గా పనిచేస్తూ ఇటీవల ఇంటర్ పరీక్షలు రాయడానికి తన స్వగ్రామానికి వచ్చాడు. స్నేహితులతో కలసి విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ శుక్రవారం ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
బీరు ఉద్దెర ఇవ్వలేదని మహిళపై దాడి
Published Sat, Mar 26 2016 4:16 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement