న్యూఢిల్లీ: నీళ్లలో ఉండే చేపలు ఏం తాగుతాయి? అనగానే ఉప్పు నీటిలో నివసించే చేపలు నీళ్లు తాగుతాయి, మంచి నీటిలో ఉండే చేపలు నీళ్లు తాగవు అని సైన్స్ స్టూడెంట్స్ చటుక్కున సమాధానమిస్తారు. కానీ ఇక్కడో చేప మాత్రం నీళ్లు కాకుండా బీరు తాగుతోంది. దీని తాలూకు వీడియోను అటవీ అధికారి సుశాంత్ నందా సోషల్ మీడియాలో షేర్ చేయగా చక్కర్లు కొడుతోంది. అయితే చేప బీరు తాగడమేంటని నెటిజన్లు అవాక్కవుతున్నారు. (కోబ్రాతో ఫైట్: కోతి పోరాటానికి ఫిదా!)
సముద్రంలో ఓ వ్యక్తి షికారుకెళ్లాడు. ఈ క్రమంలో ఓ చేప ఏదో పసిగట్టినదానిలా వెంటనే అతని పడవపై వచ్చి కూర్చుంది. దీంతో అతను వచ్చింది నా ఫ్రెండే అన్నట్లుగా దానికి బీరు పట్టించాడు. బీరు సీసా ముందు పెట్టగానే చేప కూడా ఆత్రంగా గుటుక్కుమంటూ తాగింది. దీన్ని చూసిన నెటిజన్లకు ఇప్పుడో ప్రశ్న అంతుచిక్కడం లేదు. "చేపకు బీరు మంచిదేనా? కాదా?" అని నెట్టింట వాదులాడుకుంటున్నారు. "ఇంతకీ బీరు పుచ్చుకుంటున్న ఈ చేప పేరేంటి చెప్మా?" అని మరికొందరు దాని వివరాలకోసం ఆరా తీస్తున్నారు. (ఈ చేపలను తింటే ప్రాణాలు పోతాయ్)
Comments
Please login to add a commentAdd a comment