బీర్‌ని బేషుగ్గా తాగొచ్చట! అందులో ప్రోటీన్‌, విటమిన్‌ బీ.. | Beer Health Benefits: Beer Is Healthy It Contains More Health Benefits - Sakshi
Sakshi News home page

Health Benefits of Beer: బీర్‌ని బేషుగ్గా తాగొచ్చట!అందులో ప్రోటీన్‌, విటమిన్‌ బీ..

Published Thu, Sep 7 2023 3:41 PM | Last Updated on Thu, Sep 7 2023 5:55 PM

Beer Is healthier It Contains More Health Benefits - Sakshi

బీర్‌ని ఎలాంటి సందేహం లేకుండా హాయిగా తాగొచ్చట. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. పైగా ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ఆరోగ్య నిపుణులు ఎలాంటి ఆందోళన లేకుండా బీర్‌ని బేషుగ్గా తాగండి అని ధీమాగా చెప్పేస్తున్నారు. ఇంతకీ బీర్‌ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..

బీర్‌ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

  • రోజు 1.5 నుంచి రెండు గ్లాసుల బీర్లు తీసుకుంటే గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ ఇప్పటికే గుండె సమస్యలతో బాధపడుతుంటే వాళ్లు బీర్‌ తాగాలని నిర్ణయించుకోవడం అనేది చాలా మంచి ఆప్షన్‌ అంటున్నారు. ఇంతకు మునుపు గుండె పోటుకి గురైనవారు క్రమం తప్పకుండా బీర్‌ తాగితే ఇరవై ఏళ్లకు పైగా జీవిస్తారని, వారి ఆయుః ప్రమాణం కూడా పెరుగుతుందని చెబుతున్నారు
  • బీర్‌లో వైన్‌ కంటే పోషకమైనది. ఎందుకంటే వైన్‌లో ఉండే ఆల్కహాలిక్‌ ద్రాక్ష రసం కంటే బీర్‌లో ఎక్కువ ప్రోటీన్‌లు, విటమిన్‌ బీ రెండూ ఉంటాయని అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. బీర్‌లో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుంది. 
  • మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తక్కువే. వారానికి 14 గ్లాస్లుల బీర్‌ తాగితే టైప్‌2 డయాబెటిస్‌కు గురయ్యే అవకాశం తక్కువగా ఉందని, ఏడువేల మందికి పైగా వ్యక్తులపై జరిపిన అధ్యయనంలో తేలింది. 
  • బలమైన ఎముకల కోసం పాలు ఎలా అయితే మంచిదే బీర్‌ కూడా మంచిదే. పాలు ఎముకలకు ఏ విధమైన శక్తిని అందిస్తాయో అలానే బీర్‌ కూడా ఇస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పచ్చి బఠానీలు, తృణధాన్యాల్లో ఎలాంటి విటమిన్‌లు ఉంటాయో అవే బీర్‌లో కూడా ఉంటాయిన చెబుతున్నారు. 
  • దంతాలు కూడా బాగుంటాయట. ఇది తాగితే పెదాలపై చిరునవ్వు తగ్గదని దంత వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే బీర్‌ దంతాలపై ప్రభావంతంగా పనిచేస్తుందట. ముఖ్యంగా కావిటీస్‌, ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుందట.

(గమనిక: ఒక గ్లాసు బీరు ఎలాంటి హాని ఉండదన్నారు. అదికూడా వారానికి ఒక్కసారి చొప్పున తీసుకుంటుంటే ఎలాంటి సమస్య ఉండదని  చెబుతున్నారు)

(చదవండి: అత్యంత అరుదైన వ్యాధి!స‍ల్మాన్‌ ఖాన్‌ సైతం ఫేస్‌ చేశాడు! ఆ వ్యాధి ఏంటంటే)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement