Jagtial Man Complaints To Prajavani For Kingfisher Beer - Sakshi
Sakshi News home page

‍కలెక్టర్‌ సారూ.. కింగ్‌ ఫిషర్‌ బీర్లు దొరకడం లేదు..!

Published Mon, Feb 27 2023 12:44 PM | Last Updated on Mon, Feb 27 2023 1:30 PM

A Person From Jagtial Complaints To Prajavan For KF Beer - Sakshi

మద్యం ప్రియులు బ్రాండ్‌ల విషయంలో ఏ మాత్రం రాజీపడరనే విషయం మరోసారి రుజువైంది. తమకు అత్యంత ఇష్టమైన మద్యం బ్రాండ్‌ లేకపోతే తాము ఎందుకు సర్దుకుపోవాలి అనుకున్నాడో ఏమో గానీ ఒక వ్యక్తి ఏకంగా కలెక్టరేట్‌నే ఆశ్రయించాడు. ‘మాకు కింగ్‌ ఫిషర్‌ బీర్లు అందుబాటులో లేవు’ అని  ఫిర్యాదు చేశాడు. మద్యం పాలసీ అనేది ప్రభుత్వం చూస్తుంది కాబట్టి దాన్ని ఏకండా ప్రభుత్వ ఉన్నతాధికారి దృష్టికే తీసుకెళ్లాడు మనోడు. ఏకంగా కలెక్టర్‌కే ఫిర్యాడు చేశాడు.

జగిత్యాలకు చెందిన బీరం రాజేష్‌ అనే వ్యక్తి తమ ఊరిలో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందనే విషయం తెలుసుకున్నాడు. ఏదైనా సమస్య కదా అనుకున్నాడు. తనకు వచ్చిన సమస్య కింగ్‌ ఫిషర్‌ బ్రాండ్‌ అందుబాటులో లేదనేది. దీన్ని కలెక్టర్‌ వద్దకే తీసుకెళ్లాడు. ప్రజావాణిలో తమకు కింగ్‌ ఫిషర్‌ బ్రాండ్‌ బీర్లు దొరకడం లేదని విన్నవించాడు. ఇది చూడటానికి నవ్వు తెప్పించినా మనోడి కష్టం ఎవరికి తెలుసు. మరి ఆ కలెక్టర్‌గారు దీనిపై చర్యలు తీసుకుంటామన్నారా.. లేక లైట్‌ తీసుకుంటారో చూడాలి. 

గతంలో కూడా జగిత్యాల ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది.  అదే జగిత్యాలలో 2018లో అయిల సూర్యనారాయణ అనే వ్యక్తి కూడా కింగ్‌ ఫిషర్‌ బ్రాండ్‌ బీరు దొరకడం లేదని ఫిర్యాదు చేశాడు. అప్పుడు కూడా ప్రజావాణి కార్యక్రమంలోనే కలెక్టర్‌గా ఫిర్యాదు చేశాడు. జగిత్యాలలో కింగ్ ఫిషర్ బీరు విక్రయాలను నిలిపేసి వాటి స్థానంలో నాసిరకం బీరును అమ్ముతూ కొనుగోలుదారులను మోసం చేస్తున్నారని తెలిపారు. పొరుగున కరీంనగర్‌లో కింగ్ ఫిషర్ బీర్ యథేచ్చగా దొరుకుతుండగా జగిత్యాలలో ఈ గడ్డు పరిస్థితికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడుమరొక ఫిర్యాదు. వ్యక్తులు మారారు కానీ అదే ఫిర్యాదు. బ్రాండ్‌ కూడా అదే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement