పాలు వద్దు.. బీరు ముద్దు! | Beer healthier than milk, says PETA | Sakshi
Sakshi News home page

పాలు వద్దు.. బీరు ముద్దు!

Published Thu, Oct 27 2016 12:39 PM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

పాలు వద్దు.. బీరు ముద్దు!

పాలు వద్దు.. బీరు ముద్దు!

విస్కాన్సిన్: పాల కంటే బీరు ఆరోగ్యరం. మీరు చదివింది నిజమే. జంతు పరిరక్షణ కోసం పాటుపడుతున్న 'పెటా' ఈ ప్రకటన చేసింది. అంతేకాదు ఈ విషయం శాస్త్రీయంగా రుజువైందని కూడా వెల్లడించింది. అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ-మాడిసన్ క్యాంపస్ కు కూటవేటు దూరంలో హిల్ డేల్ మాల్ వద్ద 'గాట్ బీర్' పేరుతో బిల్ బోర్డును పెటా ఏర్పాటు చేసింది. పాలు తాగడం కంటే బీరు సేవించడం ఆరోగ్యానికి మంచిదని అధికారికంగా నిర్ధారణయిందని అందులో పేర్కొంది. పాలతో పోలిస్తే బీరు బలవర్ధక ఆహారమని వివరించింది. రెండింటిలోనూ పోషకాలను పోల్చిచూపింది. ఎముకల పటుత్వాన్ని పెంచి ఆయుర్ధాయం పెంచుతుందని తెలిపింది.

పాలు తాగడం వల్ల ఒబిసిటీ, డయాబెటీస్, కేన్సర్ వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించింది. పాల ఉత్పత్తులు వాడడం వల్ల ఎముకలు గుల్లబారే ప్రమాముందని హెచ్చరించింది. 'పాలు తాగడం మానండి, బాధ్యతగా బీరు తాగండి' అని ప్రకటనలో పేర్కొంది. గతంలోనూ బీరుకు మద్దతుగా పెటా ప్రచారం చేసింది. 2000 సంవత్సరంలో బీరుకు మద్దతుగా పెటా ప్రచారం చేసింది. అయితే పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో అప్పట్లో పెటా వెనక్కు తగ్గింది.

అయితే ఆల్కహాల్ మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనని పెటా కార్యవర్గ ఉపాధ్యక్షుడు ట్రేసీ రీమాన్ తెలిపారు. ఆరోగ్యం కోసం పాల ఉత్పత్తులనే వినియోగించాల్సిన అవసరం లేదన్నారు. పాల కోసం లక్షలాది ఆవులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, పాల వినియోగం తగ్గితే వాటిని హింసించడం మానుకుంటారన్న ఉద్దేశంతో బీర్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement